E-Paper
Advertisement

OTT Movie : 15 ఏళ్ళు ఒకే రూమ్ లో బందీగా… కట్ చేస్తే ఫ్యూజులు అవుటయ్యే షాక్

OTT Movie : 15 ఏళ్ళు ఒకే రూమ్ లో బందీగా… కట్ చేస్తే ఫ్యూజులు అవుటయ్యే షాక్
Advertisement

OTT Movie : కొరియన్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వీటిని ఓ కంట కనిపెడుతూ ఉంటారు. ఈ మధ్య కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్ లు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా ఏదో ఒక స్టోరీ నడుస్తూనే ఉంటోంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొరియెన్ సినిమా థియేటర్లను షేక్ చేసింది. ఒక కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది. 2003 లో వచ్చిన ఈ సినిమాని, 20 సంవత్సరాల తరువాత మళ్ళీ రీ రిలీజ్ చేశారు. ఈ కథ ఒక తాగుబోతు వ్యక్తి జీవితం చుట్టూ తిరుగుతుంది. అతన్ని ఒక గదిలో 15 సంవత్సరాలు బంధించడం జరుగుతుంది. ఆ తరువాత అసలు కథ మొదలవుతుంది. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. యాక్షన్ థ్రిల్లర్ అభిమానులు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

పార్క్ చాన్-వూక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓల్డ్‌బాయ్’ (Old boy) సినిమా 2003లో థియేటర్లలోకి వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 20వ వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా, 2023 ఆగస్ట్ 16న థియేటర్లలో తిరిగి రీ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో చోయ్ మిన్-సిక్ (ఓ దే-సు రోల్‌లో), యూ జీ-తే, కాంగ్ హ్యే-జెంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా, 2004 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డును కూడా గెలుచుకుంది. ఐయండిబిలో ఇది ఏకంగా 8.3/10 రేటింగ్ నిపొందింది. ప్రస్తుతం Netflix, Amazon Prime, Google Playలలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక వర్షం కురుస్తున్న రాత్రి, తన కుమార్తె పుట్టినరోజున, ఓహ్ డే-సు తాగి గొడవపడి పోలీసులకు పట్టుబడతాడు. అతని స్నేహితుడు అతన్ని విడిపిస్తాడు. అయితే అతని స్నేహితుడు ఫోన్ మాట్లాడుతున్న సమయంలో, డే-సు అకస్మాత్తుగా కిడ్నాప్ చేయబడతాడు.
డే-సును ఒక ప్రైవేట్ గదిలో నిర్బంధిస్తారు. ఆ గది ఒక పాత హోటల్ గదిలా ఉంటుంది. అతనికి బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఎవరూ అతన్ని కలవడానికి వీల్లేకుండా ఉంటుంది. అతను కేవలం టీవీ ద్వారా మాత్రమే బయట ఏం జరుగుతుందో తెలుసుకుంటాడు. ఈ సమయంలోనే టీవీలో తన భార్య హత్యకు గురైందని, ఆ నేరం తనపైనే పడిందని తెలుసుకుని మరింత కుమిలిపోతాడు. తనను తాను రక్షించుకోవడానికి, శిక్షణ పొందుతాడు. ఇట్టే 15 సంవత్సరాలు గడచిపోతాయి. అతన్ని ఎందుకు బంధించారో, బంధించిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనే ప్రతీకారేచ్ఛతో అతను రగిలిపోతాడు.

Read Also : 6 నెలల పాటు ఆ ఒక్క పని చేస్తే 5 కోట్ల నజరానా… కితకితలు పెట్టే హిందీ కామెడీ మూవీ

15 సంవత్సరాల తరువాత, డే-సు అనుకోకుండా విడుదల అవుతాడు. అతను తనను బంధించిన వ్యక్తిని కనుగొని ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతను మి-డో అనే ఒక చెఫ్‌ను కలుస్తాడు. ఆమె అతని ఒంటరితనాన్ని చూసి జాలిపడి అతనితో ప్రేమలో పడుతుంది. డే-సు తనను బంధించిన ఆ వ్యక్తిని కనుగొంటాడు. అతని పేరు లీ వూ-జిన్, ఒక ధనవంతుడు. వూ-జిన్, డే-సుకు ఒక సవాలు విసురుతాడు. ఐదు రోజుల్లో తనను ఎందుకు బంధించాడో తెలుసుకుంటే, తనను తాను చంపుకుంటానని చెబుతాడు. డే-సు ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. చివరికి అసలు సత్యం వెలుగులోకి వస్తుంది. ఈ విషయం తెలిసి ఈ సారి మళ్ళీ షాక్ అవుతాడు డే-సు. ఇక క్లైమాక్స్ ఊహించని ట్విస్టులతో మైండ్ బెండ్ అవుతుంది. ఆ ట్విస్ట్లు ఏమిటి ? అతన్ని ఎందుకు 15 సంవత్సరాలు బంధించారు ? లీ వూ-జిన్ పై డే-సు రివేంజ్ తీర్చుకుంటాడా ? అనే విషయాలను, ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.
Advertisement

 

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×