E-Paper
Advertisement

OTT Movie : హాంటెడ్ బంగ్లాలో పోలీస్ స్టేషన్… పోలీసులను పారిపోయేలా చేసే దెయ్యం… క్రేజీ మలయాళ మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : హాంటెడ్ బంగ్లాలో పోలీస్ స్టేషన్… పోలీసులను పారిపోయేలా చేసే దెయ్యం… క్రేజీ మలయాళ మిస్టరీ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఈ రోజుల్లో హారర్ సినిమాలను సమయం తీసుకుని మరీ చూస్తున్నారు. అంతలా ఆడియన్స్ వీటికి కనెక్ట్ అవుతున్నారు. ఇవి ఇచ్చే ఎంటర్టైన్మెంట్ తో పోల్చుకుంటే, మిగతా సినిమాలు వీటి వెనుకే అని చెప్పుకోవాలి. అలా వీటిని రూపొందించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఒక ఒక మలయాళ హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలో సందడి చేయనుంది. ఇది కేరళలో రూపొందించబడిన మొట్టమొదటి హారర్ వెబ్ సిరీస్‌గా ప్రచారం పొందుతోంది. మరికొన్ని గంటల్లో హారర్ అభిమానులకు దర్శనం ఇవ్వబోతోంది. ముఖ్యంగా మలయాళం ఫ్యాన్స్ ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలోకి రాబోతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘ఇన్‌స్పెక్షన్ బంగ్లా’ (Inspection Bungalow). సైజు ఎస్.ఎస్. దర్శకత్వంలో ఈ సిరీస్ రూపొందింది. ఇందులో షబరీష్ వర్మ, షాజు శ్రీధర్, జయన్ చెర్తాల, వీణ నాయర్, బాలాజీ శర్మ వంటి నటులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సిరీస్ ZEE5 లో 2025 నవంబర్ 14 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ అవుతుంది.

Advertisement

Read Also : ఊరవతల పాడుబడ్డ బిల్డింగ్… మిస్సైన తండ్రి కోసం అడుగు పెడితే అరాచకం… హర్రర్ మూవీ లవర్స్ డోంట్ మిస్

స్టోరీలోకి వెళ్తే

అరవంగాడ్ అనే ఒక చిన్న గ్రామంలో ఉండే పోలీస్ స్టేషన్‌కి సబ్-ఇన్‌స్పెక్టర్ విష్ణు బదిలీ అవుతాడు. అతను వచ్చీరాగానే పోలీస్ స్టేషన్‌ను ఒక పాడుబడిన, దెయ్యాలు ఉన్నాయని పుకార్లు ఉన్న ఒక ప్రభుత్వ బంగ్లాకు మార్చవలసి వస్తుంది. పోలీసులు బంగ్లాలోకి మారిన తర్వాత, అక్కడ వింతైన, భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ఈ మిస్టరీని ఛేదించడానికి, మైథిలి అనే పారానార్మల్ రీసెర్చర్ తో విష్ణు ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతాడు. మైథిలితో కలిసి పనిచేస్తూ విష్ణు భయంకరమైన నిజాలను తెలుసుకుంటాడు. ఆ నిజాలు ఏమిటి ? ఆ బంగ్లాలో ఏముంది ? అక్కడ జరిగే వింత సంఘటనల వెనుక రహస్యమేంటి? విష్ణు ఈ సమస్యని కొలిక్కి తెస్తాడా ? అనే విషయాలను, ఈ మలయాళ హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోండి. ఈ కథ భయం, హాస్యం, హత్య దర్యాప్తు అంశాల అరుదైన కలయికతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.  ఈ వీకెండ్ ఫ్యామిలితో కలసి ఈ సిరీస్ ని చూసి అందించండి.

Advertisement

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×