Baby Girl Ending Explained : ఇటీవల కాలంలో మలయాళం నుంచి థ్రిల్లర్ సినిమాలకు ఆడియన్స్ ను అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. అందులో తాజాగా వచ్చిన ‘బేబీ గర్ల్’ కూడా ఒకటి. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. అయితే అసలు ఈ మూవీ స్టోరీ ఏంటి? ఎండింగ్ లో ఏం జరిగింది ? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
2026లో విడుదలైన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘బేబీ గర్ల్’. ఆసుపత్రి నుంచి అదృశ్యమైన ఒక నవజాత శిశువు మిస్టరీ చుట్టూ తిరుగుతుంది ఈ మూవీ స్టోరీ. నివిన్ పౌలీ, సంగీత్ ప్రతాప్, లిజోమోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు జియో బేబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సినిమాలో నరాలు తెగే ఉత్కంఠతో పాటు థ్రిల్లింగ్, సస్పెన్స్ తో ప్రేక్షకులను చివరి వరకు సీట్ల అంచున ఉంచుతుంది. జనవరి 23న థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో కూడా అందుబాటులోకి వచ్చింది. సోనీ లివ్ (Sony liv)లో ఫిబ్రవరి 12 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రన్ టైమ్ సుమారు 120 నిమిషాలు ఉన్న ఈ మూవీకి IMDbలో 7.4 రేటింగ్ ఉండడం విశేషం.
కథ క్రిస్మస్ నాడు గుడ్ షెపర్డ్ హాస్పిటల్ నుంచి మొదలవుతుంది. పర్దా ధరించిన ఒక వ్యక్తి అప్పుడే పుట్టిన 4 రోజుల బిడ్డను కిడ్నాప్ చేస్తాడు. దీంతో పోలీసు బృందం విచారణ మొదలు పెడుతుంది. ఇన్వెస్టిగేషన్ లో అనేక మంది అనుమానితుల లిస్ట్ లో ఉంటారు. ముఖ్యంగా ఆసుపత్రి ఉద్యోగి సనల్ మాథ్యూ (నివిన్ పౌలీ) ఆ లిస్ట్ లో ఉన్నవాళ్ళలో ఒకరు. అతనే అనుమానితుడు అయినప్పటికీ సనల్ స్వయంగా నేరస్థుల కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఈ కిడ్నాప్ వెనుక ఉన్నది ఎవరు? బాధ్యులు, కిడ్నాప్ కు గల కారణం ఏంటి ? అనేది కథాంశం. శిశువు తల్లి, బంధువులు ఆమెను పెంచడంలో ఆసక్తి చూపకపోవడం సినిమాలో ముఖ్యమైన అంశం. సనల్, రీతు (లిజోమోల్) మధ్య సంబంధం, రీతు ఆ బిడ్డ తల్లితో చేసే సంభాషణ భావోద్వేగపూరితంగా సాగుతాయి.
Also Read : ఇక్కడ సాంప్రదాయం చీర కట్టిందంటే చావే… ఒక్కోటి మైండ్ బెండింగ్ ట్విస్ట్ మావా
మూవీ చివరలో శిశువు కిడ్నాప్‌కు ఎవరు బాధ్యులు, ఎందుకు ? అనేది తెలుస్తుంది. బిడ్డను ఆమె తల్లిదండ్రులకు తిరిగి ఇస్తారా లేదా అనే ప్రశ్నలు లేవనెత్తుతుంది. శిశువు తల్లి, ఇతర బంధువులు ఆమెను పెంచడంలో ఆసక్తి చూపడం లేదని స్పష్టంగా తెలుస్తుంది. మొదట తల్లి తన బిడ్డను తనతోనే ఉంచుకోవాలని, ప్రేమను చూపించాలని కోరుకుంటుంది. రీతు రైలులో శిశువుతో పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా, సనల్ ఆమెను పట్టుకుంటాడు. సనల్ బిడ్డను తన కన్న తల్లికి తిరిగి ఇవ్వాలని భావిస్తాడు. కానీ రీతు అసలేం జరిగిందో వివరిస్తుంది. దీంతో సనల్ ఫోన్ కాల్ ద్వారా ఆమె చెప్పింది నిజమేనని కన్ఫామ్ చేసుకుంటాడు. మనసు మార్చుకుని ఆమె తప్పించుకోవడానికి సహాయం చేస్తాడు. చివరికి సనల్ పోలీసులకు అబద్దపు స్టేట్మెంట్ ఇస్తాడు. ఆసుపత్రిలో తన ప్రతిష్టను కాపాడుకోవడం కంటే నైతికంగా వ్యవహరించాలని కోరుకుంటాడు. ఈ క్లైమాక్స్ సినిమా ఎమోషనల్ గా ఎండ్ అవుతుంది.