E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి నూతన వాహన యోగం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి నూతన వాహన యోగం – వారు చేపట్టిన పనుల్లో విజయం
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఫిబ్రవరి 13వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

 చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక సంతోషాన్నిస్తుంది. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున శుభకార్యాలు కొన్ని నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. 

వృషభం

Advertisement

అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయట కొద్దిపాటి సమస్యలు ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి. 

మిథునం

బంధువులతో అకారణ తగాదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు కొంత కలచి వేస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం.

కర్కాటకం

Advertisement

రావలసిన బాకీలు సకాలంలో వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. గృహమున సంతోషంగా గడుపుతారు.

సింహం

మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. బంధు మిత్రుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. సోదరులతో చర్చల్లో పురోగతి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు అదిగమిస్తారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. 

కన్య

చేపట్టిన పనులలో కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనుల్లో అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. దూరప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి. అనుకున్న పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు పని బాధ్యతలు పెరుగుతాయి.

వృశ్చికం

మొండి బాకీలు వసూలవుతాయి. ఆప్తుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. 

ధనుస్సు

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. శ్రమతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగస్థులకు స్థానచలన సూచనలున్నవి.  

మకరం

ఉద్యోగమున కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వాహన యోగం ఉన్నది. ఇంటాబయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. 

కుంభం

ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విభేదాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి.

మీనం

బంధు మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశించిన రీతిలో సాగుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×