Khajuraho Dreams OTT : ఓటీటీలలో రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే సినిమాలు ఓటీటీలలో సందడి చేస్తాయన్న విషయం తెలిసిందే. సాధారణంగా థియేటర్లలో రిలీజ్ అయిన 45 డేస్ నుంచి 90 డేస్ లోపు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతుంటాయి సినిమాలు. కొన్ని అంతకంటే ముందే విడుదల అవుతాయి. తాజాగా ఓ మూవీ బిగ్ స్క్రీన్ పైకి వచ్చిన రెండు నెలల తరువాత డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. అయితే ఇదొక యూత్ ఫుల్ మూవీ కావడం విశేషం. మరి ఆ మూవీ ఏంటి ? ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? అన్నది తెలుసుకుందాం.
2025 డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన మలయాళ రోడ్ ఫిల్మ్ ‘ఖజురహో డ్రీమ్స్ ‘. అర్జున్ అశోకన్, షరాఫ్ ఉధీన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రల్లో నటించారు. అదితి రవి, ధృవన్, చందునాధ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తారు. మనోజ్ వాసుదేవ్ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రానికి సేతు స్క్రిప్ట్ అందించాడు. ఈ సినిమాను మొదట 2023లో ప్లాన్ చేశారు. కానీ వివిధ కారణాల వల్ల ఆలస్యమైంది. థియేటర్లలో మిశ్రమ సమీక్షలు అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేదు. మమ్ముట్టి నటించిన ‘కలాంకావల్’, శ్రీనాథ్ భాసి ‘పొంగళ’, ఇంద్రజిత్ సుకుమారన్ ‘ధీరం’ వంటి సినిమాలతో పోటీ పడింది. ఈ నాలుగింటిలో ‘కలాంకావల్’ మాత్రమే మంచి విజయం సాధించింది. డిసెంబర్ 5న హిందీ చిత్రం ‘ధురంధర్’ కూడా విడుదలై భారీ విజయం సాధించింది.
ఇక థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత ‘ఖజురహో డ్రీమ్స్’ డిజిటల్ అరంగేట్రం చేయనుంది. సైనా ప్లేలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని అనౌన్స్ చేశారు. కానీ ఖచ్చితమైన విడుదల తేదీని ప్రకటించలేదు. కాగా సినిమా మలయాళ భాషలో విడుదలైంది. కానీ OTTలో తెలుగు, తమిళ్ భాషలలొ కూడా అందుబాటులో ఉండవచ్చు. సుమారు 120 నిమిషాలు రన్ టైమ్ ఉన్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి. దర్శకుడు మనోజ్ వాసుదేవ్ ఈ చిత్రాన్ని సరళమైన మేకింగ్ తో తీశాడు. స్క్రిప్ట్ సేతు అందించాడు. సినిమాటోగ్రఫీ, సంగీతం రోడ్ ట్రిప్ వాతావరణాన్ని బాగా సృష్టించాయి. ‘ఖజురహో’ చారిత్రక స్థలాలు విజువల్స్‌గా అందంగా కనిపిస్తాయి. సినిమా మిశ్రమ సమీక్షలు అందుకున్నా, కామెడీ, స్నేహం థీమ్స్ ఆకట్టుకుంటాయి.
Also Read : స్టార్టింగ్ నుంచే అలాంటి సీన్లు… స్లో పాయిజన్ లా ఎక్కే రా అండ్ రియల్ సిరీస్… సింగిల్ గా ఉన్నప్పుడే చూడండి
కేరళ నుంచి ఖజురహోకు రోడ్ ట్రిప్ కు బయలుదేరిన ఐదుగురు స్నేహితుల గురించిన కథే ‘ఖజురహో డ్రీమ్స్’. యునెస్కో వారసత్వ ప్రదేశమైన ఖజురహోకు వారి ప్రయాణంలో ఎదురయ్యే సిట్యుయేషన్స్ ఆసక్తికరంగా ఉంటాయి. కథలో స్నేహితుల మధ్య గొడవలు, సరదాలు, ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలు, ఖజురహోలోని చారిత్రక స్థలాలు… అన్నీ హాస్యం, భావోద్వేగాలతో కలిసి సాగుతాయి. చివరికి ఈ ప్రయాణం వారి జీవితాలను మార్చేస్తుంది. స్నేహితులతో చూడటానికి బాగుంటుంది.