E-Paper
Advertisement

ఒంటరి మనుషులే టార్గెట్… సైకో వదిలిన క్లూస్‌తో ఊపిరి బిగపట్టే పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలుగులో

ఒంటరి మనుషులే టార్గెట్… సైకో వదిలిన క్లూస్‌తో ఊపిరి బిగపట్టే పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలుగులో
Advertisement

Malayalam Psychological Thriller: పోలీస్ స్టేషన్‌ లో కొన్ని ఏళ్లుగా మూసి ఉన్న ఓ మర్డర్ కేసు ఫైల్‌ ను తెరిస్తే ? అది కేవలం ఓ పాత హత్య కేసు కాకుండా… ఆ ఫైల్‌ ను చదివిన ప్రతి ఒక్కరి జీవితంలో వింత పరిణామాలు మొదలైతే ? అసలు ఆ ఫైల్ నిజంగానే శాపగ్రస్తమా ? లేక దాని వెనుక ఎవరికీ తెలియని భయంకరమైన నిజం దాగుందా ? ఇలాంటి సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లరే ‘ఉన్మాదం’ (Unmadham). మరి ఇంతకీ అందరినీ ఇంతగా భయపెడుతున్న ఆ కేసు ఏంటి ? ఆ సైకో కిల్లర్ ఎందుకు అలా చేస్తున్నాడు ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్దాం పదండి.

కథలోకి వెళ్తే…

షెల్లీ (కుంచకో బోబన్) పోలీస్ డిపార్ట్‌మెంట్‌ లో కానిస్టేబుల్‌ గా పని చేస్తుంటాడు. అయితే పోలీస్ ఉద్యోగం కంటే సినిమా కథలు రాయాలన్నదే అతని పెద్ద కల. ఎలాగైనా స్క్రీన్‌ రైటర్‌ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని భావించి ఉద్యోగానికి సుదీర్ఘ సెలవు తీసుకుంటాడు. కానీ కథ రాయాలంటే ఐడియా దొరకదు. మరోవైపు ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల వెంట పడుతున్నాడంటూ భార్య సౌమ్య (లిజోమోల్ జోస్) కూడా అసంతృప్తిగా ఉంటుంది. దీంతో షెల్లీ వ్యక్తిగత జీవితం, రైటర్‌గా ఎదగాలన్న ఆశ… రెండూ ఒకేసారి ఒత్తిడిగా మారతాయి.

Advertisement

ఇలాంటి సమయంలో కొత్త కథ కోసం వెతుకుతున్న షెల్లీకి కొంగాడ్ పోలీస్ స్టేషన్‌ లో ఆరు సంవత్సరాలుగా పరిష్కారం కాని ఓ అమ్మాయి హత్య కేసు ఫైల్ కనిపిస్తుంది. ఆ కేసు చుట్టూ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ లో ఓ వింత నమ్మకం ఉంటుంది. ఆ ఫైల్‌ను ఎవరు తెరిచినా వారి జీవితాల్లో అనూహ్యమైన చావులు, వింత ఘటనలు జరుగుతాయని అక్కడి సిబ్బంది భావిస్తుంటారు.

అయితే షెల్లీ మాత్రం వాటిని మూఢనమ్మకాలుగానే చూస్తాడు. తనకు మంచి కథ దొరికిందన్న ఉద్దేశంతో ఆ ఫైల్‌ ను తెరిచి కేసు గురించి లోతుగా తెలుసుకోవడం మొదలుపెడతాడు. కానీ ఫైల్‌ ను ఓపెన్ చేసిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. అతని చుట్టూ జరిగే వింత సంఘటనలు క్రమంగా భయాన్ని పెంచుతాయి. తాను పరిశోధిస్తున్న కేసు… కేవలం ఓ హత్య మిస్టరీ కాదేమో అన్న అనుమానం మొదలవుతుంది. దర్యాప్తు సాగేకొద్దీ షెల్లీకి నిజం, భ్రమ, మూఢనమ్మకం మధ్య తేడా అర్థం కాని పరిస్థితి ఎదురవుతుంది. అసలు ఆ అమ్మాయి హత్య వెనుక ఉన్నది ఎవరు ? ఫైల్‌ కు నిజంగానే ఏదైనా అతీంద్రియ సంబంధం ఉందా ? లేక షెల్లీ మానసిక స్థితి అతడినే మరో ప్రమాదంలోకి నెట్టిందా ? ఈ ప్రశ్నలకు సమాధానమే సినిమా అసలు మిస్టరీ.

తెలుగులోనూ చూడొచ్చు

Advertisement

‘ఉన్మాదం’కు కిరణ్ దాస్ దర్శకత్వం వహించారు. కుంచకో బోబన్, లిజోమోల్ జోస్, సిద్ధిఖీ, విశాఖ్ నాయర్ తదితరులు నటించారు. ఈ మలయాళ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 4 నుంచి ‘సోనీ లివ్’ (Sony LIV)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ డబ్బింగ్ ఆడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. క్రైమ్ మిస్టరీతో పాటు సైకలాజికల్, సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్ ఇష్టపడేవారికి ఈ సినిమా మంచి వీకెండ్ వాచ్.

Read Also: 12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

Related News

నెత్తురు ఏరులై పారించే ఊరమాస్ రివేంజ్ డ్రామా… లోకేష్ కనగరాజ్ 100 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

గేమింగ్ ప్రేమికులకు ఊహించని విజువల్ ట్రీట్… 8000 కోట్ల రోలర్‌కోస్టర్ రైడ్

80ల నాటి తిరుగుబాటు, నెత్తురోడిన వీధులు… హిస్టరీని షేక్ చేసిన రియల్ ఇన్సిడెంట్స్

ఒకే ఇంట్లో రెండు తరాల ఘర్షణ… అవార్డ్ విన్నింగ్ బెంగాలీ క్లాసిక్ మాస్టర్‌పీస్

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

Big Stories

Advertisement
×