E-Paper
Advertisement

ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్‌లు సీజ్.. రవాణా శాఖకు ఆటో జేఏసీ డెడ్‌లైన్!

ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్‌లు సీజ్.. రవాణా శాఖకు ఆటో జేఏసీ డెడ్‌లైన్!
Advertisement

Auto Drivers: ఆర్టీసీ అధికారులు బస్ భవన్ లో శనివారం ఆటో, క్యాబ్ సంఘాల జేఏసీతో సమావేశం నిర్వహించారు. మీ సేవ ద్వారా ఒకే టికెట్ పొంది బస్సు,మెట్రో ,ఆటో ప్రయాణం చేసే విధానాన్ని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ప్రతిపాదించారు. దీనిపై రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి వివరించారు. ఒక్కసారిగా క్యాబ్ సంఘాల జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో వాగ్వీవాదానికి దిగారు. ప్రభుత్వం ద్వంద వైఖరిని అవలంబిస్తుందని బీఎంఎస్, బీఆర్టీయూ నాయకులు సమావేశంను బాయ్ కాట్ చేసి బయటకు వచ్చారు. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, టీయూసీఐ, ఐఎఫ్టీయూ, టీఆర్ఎస్ నాయకులు సైతం సమావేశం బహిష్కరించారు.

ఆటో కనెక్టివిటీ ప్రతిపాదన..

అంతకు ముందు ఆటో,క్యాబ్ సంఘాలకు సంబంధం లేని ఇతర వ్యక్తులను చర్చలకు పిలిచి జాక్ నాయకులు బయట ఉంచడంతో ఆర్టీసీ భవన్ ఎదుట జాక్ నాయకులు రవిశంకర్, వెంకటేశం, సలీం, మారయ్య, ప్రవీణ్ తదితరులు బైటాయించి ధర్నా నిర్వహించారు. ఉద్రిక్తత అనంతరం జాక్ ప్రతినిధులను ఆర్టీసీ అధికారులు పిలిచి చర్చలు జరిపారు. అయినప్పటికీ జేఏసీ ప్రతిపాదనలను కొన్నింటికి ఓకే చెప్పినప్పటికీ మరికొన్నింటికి అధికారులు అంగీకరించకపోవడంతో సమావేశంను బహిష్కరించారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ గత నెల 23, రవాణా శాఖ మంత్రి, రవాణా శాఖ కమిషనర్ జాక్ చర్చలలోఆర్టీసీలో ఆటో కనెక్టివిటీ ప్రతిపాదన లేదని వ్రాసి ఇచ్చి ఇప్పుడు ప్రతిపాదన ఏంటని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్ల బ్రతుకు దెరువు విషయంలో మూడో వ్యవస్థ మధ్య వర్తిత్వం అవసరం లేదని తేల్చి చెప్పారు. జాక్ నాయకులు మారయ్య, వెంకటేశం మాట్లాడుతూ మంత్రి ఆటో యాప్ ఆధారిత సంఘాల జేఏసీతో చర్చలు జరిపి సంక్షేమ బోర్డు జీఓ విడుదల, ఆటో మీటర్ ఛార్జీలు పెంపు, పై చర్చిస్తామని తెలిపి, ఇప్పుడు ఆర్టీసీ అధికారులతో చర్చలు జరిపి ఆటో ,క్యాబ్ ఫస్ట్ మైలేజ్ కనెక్టివిటీ సమావేశం నిర్వహించడం సరికాదన్నారు.

Advertisement

Also read: క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

ఓలా, ఊబర్, ర్యాపిడో సీజ్..

ఓలా ,ఊబర్,ర్యాపిడో వైట్ ప్లేట్ బైకులను వెంటనే సీజ్ చేయాలని, మహిళల ఉచిత బస్సు ప్రయాణం పునరాలోచన చేయాలని మల్లేష్ గౌడ్, ప్రవీణ్ సలీం డిమాండ్ చేశారు. జేఏసీ నాయకుడు ముకేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం వలన రెండున్నర సంవత్చరాలలో 204 మంది డ్రైవర్లు చనిపోతే స్పందించని ప్రభుత్వం ఇప్పుడు ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ సమావేశం నిర్వహించి ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతీయడం సరికాదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వంద వైఖరి విడిచిపెట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి, సంక్షేమ బోర్డు ఏర్పాటు జీఓ విడుదల కొరకు వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సమ్మె చేయక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో మీసేవ కమిషనర్ రవికిరణ్‌తో పాటు ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

Tags

Related News

హైదరాబాద్‌లో భారీగా పెరగనున్న ఆటో చార్జీలు.. కొత్త ఛార్జీలు ఇవే

ఇక దండయాత్రే కాస్కోండి.. నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్!

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

Big Stories

Advertisement
×