E-Paper
Advertisement

OTT Movie : దొంగతనానికి వెళ్ళి దిక్కుమాలిన పని… ఒక్కొక్కడిని పరుగులు పెట్టించే ఫ్యామిలీ మ్యాన్… బ్లడీ బ్లడ్ బాత్

OTT Movie : దొంగతనానికి వెళ్ళి దిక్కుమాలిన పని… ఒక్కొక్కడిని పరుగులు పెట్టించే ఫ్యామిలీ మ్యాన్… బ్లడీ బ్లడ్ బాత్
Advertisement

OTT Movie : ఒక్కసారి చూస్తే మరచిపోలేని థ్రిల్లర్ సినిమాలనే ఆడియన్స్ కోరుకుంటారు. అయితే అలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. నవాజుద్దీన్ సిద్దీకీ పెర్ఫార్మెన్స్ తో అలాంటి కిక్ ఇచ్చే ఒక మూవీ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఇందులో వరుణ్ ధవన్‌ హీరో పాత్రలో నటించగా, సిద్దీకీ విలన్ గెటప్ లో జీవించాడు. ఇద్దరికీ బ్రేక్ ఇచ్చిన సినిమా ఇది. ఈ రివెంజ్ థ్రిల్లర్, ఒక వ్యక్తి తన ఫ్యామిలీ మర్డర్ చేసిన క్రిమినల్స్‌పై 15 ఇయర్స్ తర్వాత రివెంజ్ తీర్చుకోవడం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్

2015లో విడుదలైన ఈ హిందీ నియో నాయిర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా పేరు ‘బద్లాపూర్’ (Badlapur). శ్రీరామ్ రాఘవన్ డైరెక్షన్లో దినేష్ విజయన్, సునీల్ లుల్లా (మాడాక్ ఫిల్మ్స్, ఎరోస్ ఇంటర్నేషనల్) దీనిని నిర్మించారు. ఇందులో వరుణ్ ధవన్, నవాజుద్దీన్ సిద్దీకీ, యామి గౌతమ్, హుమా ఖురేషీ, రాధికా ఆప్టే లీడ్ రోల్స్ లో నటించారు. 2 గంట 19 నిమిషాల నిడివి వున్న ఈ మూవీ ఐయండిబిలో 7.4/10 రేటింగ్ పొందింది. 2015ఫెబ్రవరి 20 థియేట్రికల్ రిలీజ్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా, 2015 మే నుంచి నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ ఒరిజినల్ తో పాటు తెలుగు, తమిళ డబ్బింగ్ వెర్షన్స్ కూడా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

రాఘవ్ (వరుణ్ ధవన్) అనే ఒక యంగ్ ఫ్యామిలీ మ్యాన్ పూణేలో భార్య మునీషా (యామి గౌతమ్), కొడుకు రోహణ్‌తో సంతోషంగా ఉంటాడు. ఒక రోజు వీళ్ళంతా  షాపింగ్ మాల్ నుంచి తిరిగి వస్తుంటే బ్యాంక్ రాబరీ జరుగుతుంది. లైక్ (నవాజుద్దీన్ సిద్దీకీ), తమ్ము అనే ఇద్దరు దొంగలు ఎస్కేప్ కోసం రాఘవ్ కారుని హైజాక్ చేస్తారు. మునీషా, రోహణ్‌ని కూడా బందీలుగా తీసుకెళ్తారు. ఇంతలో పోలీస్ షూటౌట్‌లో తమ్ము చనిపోతాడు. లైక్ ఎస్కేప్ అవుతాడు. ఈ ప్రాసెస్ లో మునీషా, రోహణ్‌ని లైక్ చంపేస్తాడు. రాఘవ్ జీవితం ఒక్కసారిగా నాశనం అవుతుంది. 15 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు రాఘవ్ ఒంటరిగా అల్కహాలిక్ అయిపోయాడు. అతనికి ఒకే లక్ష్యం ఉంటుంది. లైక్‌ని వదలకుండా రివెంజ్ తీర్చుకోవడం.

Read Also : 11 ఆస్కార్స్ గెలిచి టైటానిక్ రికార్డ్‌ని బద్దలు కొట్టిన సినిమా … ఎక్కడ చూడచ్చో తెలుసా ?

Advertisement

ఈ సమయంలో లైక్ భార్య కంచన్ (రాధికా ఆప్టే)ని టార్గెట్ చేస్తాడు. ఆమెని కిడ్నాప్ చేసి భయంకరంగా టార్చర్ చేసి లైక్‌కి మెసేజ్ పంపుతాడు. లైక్ జైల్ నుంచి ఎస్కేప్ ట్రై చేస్తాడు కానీ రాఘవ్ అడ్డుకుంటాడు. ఇక్కడే పెద్ద ట్విస్ట్ వస్తుంది. రోబరీలో లైక్‌కి హెల్ప్ చేసిన మరో జాన్వీ (హుమా ఖురేషీ) అనే బ్యాంక్ మేనేజర్ కూడా ఉంటుంది. రాఘవ్ జాన్వీని తన కంపెనీలో సెక్రటరీగా జాయిన్ చేయించి, ఆమెని కూడా టార్గెట్ చేస్తాడు. రాఘవ్ రివెంజ్ గేమ్ మరింత డార్క్‌గా మారుతుంది. ఎవరూ ఊహించని ట్విస్ట్‌లు, బ్రూటల్ వయలెన్స్, మానసిక టార్చర్ లతో కసితీరా రివేంజ్ తీర్చుకుంటాడు. చివరికి లైక్‌కి కాన్సర్ టర్మినల్ స్టేజ్‌లో ఉందని తెలుస్తుంది. అతను జైలు నుంచి రిలీజ్ అవుతాడు. లైక్‌ని రాఘవ్ ఒక డెజర్ట్ ఏరియాలో ఫైనల్ కాన్ఫ్రంటేషన్‌కి పిలుస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు గన్ పాయింట్‌కి గురి పెట్టుకుంటారు. చివరికి ఈ స్టోరీ ఏమౌతుంది ? రాఘవ్ రివేంజ్ పూర్తి అవుతుందా ? ఈ కథ ముగింపు ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చూసి తెలుసుకోండి.

 

 

 

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×