E-Paper
Advertisement

OTT Movie : 11 ఆస్కార్స్ గెలిచి టైటానిక్ రికార్డ్‌ని బద్దలు కొట్టిన సినిమా … ఎక్కడ చూడచ్చో తెలుసా ?

OTT Movie : 11 ఆస్కార్స్ గెలిచి టైటానిక్ రికార్డ్‌ని బద్దలు కొట్టిన సినిమా … ఎక్కడ చూడచ్చో తెలుసా ?
Advertisement

OTT Movie : ఒక్కసారైనా చూస్తే.. జీవితంలో మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్’. 2003 డిసెంబర్ 17న థియేటర్లలో దిగిన ఈ ఎపిక్ ఫైనల్ పార్ట్ ప్రభంజనం సృష్టించింది. 76వ అకాడమీ అవార్డ్స్ (2004)లో నామినేట్ అయిన ప్రతి కేటగిరీల్లోనూ గెలిచింది. 11 ఆస్కార్స్ గెలిచి సెన్సేషన్ అయింది. ఇది వరకు టైటానిక్ (1997), బెన్-హుర్ (1959) కలిసి 11 ఆస్కార్స్ గెలిచాయి కానీ ఈ సినిమా ఒక్కటే 100% విన్నింగ్ రేట్ తో టాప్‌లో ఉంది. ఈ సినిమా ఎక్స్‌టెండెడ్ ఎడిషన్ (4 గంటల 20 నిమిషాలు) సహా, థియేట్రికల్ వెర్షన్ కూడా రెడీగా ఉంది. ఎక్కడ చూడొచ్చు? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో చూడొచ్చు అంటే

2003 డిసెంబర్ 17న రిలీజ్ అయిన పీటర్ జాక్సన్ మాస్టర్‌పీస్ థియేటర్ వెర్షన్ 3 గం 21 ని, ఎక్స్‌టెండెడ్ ఎడిషన్ 4 గం 20 నిమిషాలు ఉంటుంది. $94 మిలియన్ బడ్జెట్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద $1.14 బిలియన్లను వసూలు చేసిన ఈ సినిమా, 11 ఆస్కార్స్ గెలిచి రికార్డ్ బద్దలు కొట్టింది. ఐయండిబిలో 9.0/10 రేటింగ్ తో ఇప్పటికీ ఆల్ టైమ్ టాప్ 5 సినిమాల్లో ఉంది. ప్రస్తుతం Amazon Prime Video, Jio hotstar, Apple TV, Google Play Movies లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : పెళ్లి జంటను విడగొట్టే ఫొటోగ్రాఫర్… ఒక్క తప్పుతో గందరగోళం… నవ్వుకోవడానికి మరికొన్ని గంటలే

స్టోరీ ఏమిటంటే

చెడు శక్తులకు, మంచి శక్తులకు మధ్య జరిగే ఒక భీకర పోరాటంతో ఈ స్టోరీ నడుస్తుంది. సౌరోన్ తన సైన్యాన్ని మిన్హాస్ తిరిత్ రాజధాని గోండార్‌పైకి పంపుతాడు. గాండాల్ఫ్ నేతృత్వంలో మానవులు, ఎల్వ్స్, డ్వార్ఫ్‌లు ఒక్కటై ఈ భారీ దాడిని ఎదుర్కొంటారు. అరగోర్న్, గిమ్లి లెగోలాస్ వంటి యోధులు ప్రాణాలకు తెగించి పోరాడతారు. ఈ యుద్ధం మధ్యలోనే అరగోర్న్ సింహాసనాన్ని అధిష్ఠించడానికి సిద్ధమవుతాడు. సైన్యానికి కొత్త ఆశను కలిగిస్తాడు. యుద్ధం ఒకవైపు జరుగుతుండగా, మరోవైపు ఫ్రోడో, సామ్ తమ ప్రాణాంతకమైన ప్రయాణాన్ని కొనసాగిస్తారు. మోర్డోర్ గుండా ప్రయాణించి, మౌంట్ డూమ్ వద్ద ఉన్న అగ్ని పర్వతంలోకి ‘వన్ రింగ్’ ను విసిరి నాశనం చేయాలనేది వారి లక్ష్యం. గోల్లమ్ వారిని వెంటాడి ఇబ్బందులు సృష్టిస్తాడు. చివరికి ఎన్నో కష్టాల తర్వాత, ఫ్రోడో రింగ్‌ను నాశనం చేయగలుగుతాడు. రింగ్ నాశనంతో సౌరోన్ శక్తి పూర్తిగా అంతమైపోతుంది. దుష్ట శక్తులు అంతమై రాజ్యంలో శాంతి నెలకొంటుంది.

Advertisement

 

 

 

Related News

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

Big Stories

Advertisement
×