OTT Movie : ఇప్పుడు ప్రధాన నటులు కూడా వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి భాషలో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లు ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. వెంకటేష్, రానా లాంటి స్టార్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించు కున్నారు. ఇక అందాల భామలు వీటిలో ఒక అడుగు ముందే ఉన్నారు. అంజలి గత ఏడాది నటించిన ‘బహిష్కరణ’ సిరీస్ కూడా ఆసక్తికరమైన కథనంతో వచ్చింది. దీనికి ఆడియన్స్ నుంచి కూడామంచి రెస్పాన్స్ వచ్చింది. అమ్మాయిల మిస్సింగ్, రివేంజ్ థీమ్స్ తో ఒక గ్రామీణ నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది. ఇందులో అంజలి పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. సోషల్ ఇష్యూస్ కూడా గట్టిగా చూపించారు. రెండో సారి చూసినా బోర్ కొట్టకుండా ఉంటుంది. దీని కథ ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలపై ఓ లుక్ వేద్దాం పదండి.
ఈ క్రైమ్ థ్రిల్లర్ తెలుగు వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’ (Bahishkarana) 2024 జూలై 19న ZEE5లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ముఖేష్ ప్రజాపతి దర్శకత్వంలో అంజలి, రవీంద్ర విజయ్, శృతేజ్, అనన్య నాగల, షాన్ముఖ్ లీడ్ రోల్స్ లో నటించారు. 6 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ ఐయండిబిలో 7/10 రేటింగ్ పొందింది.
గుంటూరు జిల్లా పెద్దపల్లి గ్రామంలో శివయ్య సర్పంచ్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. ఆ ఊళ్లో దర్శి, సూరి అతని దగ్గర పనిచేస్తుంటారు. దర్శికి’లక్ష్మి అనే మరదలు కూడా ఉంటుంది. ఆ ఊళ్లో టీనేజ్ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అందుకు కారణమేమిటనేది మిస్టరీగా ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా నేరస్థులను పట్టుకుంటామని పోలీసులు కూడా చెప్తుంటారు. ఈ సమయంలో ఆ ఊరికి పుష్ప (అంజలి) అనే అందమైన అమ్మాయి శివయ్య దగ్గరకి వస్తుంది. ఆమె అతన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది. పుష్ప వేశ్య అని తెలుసుకున్న శివయ్య ఆమెను ఊరి చివరన ఒక ఇంట్లో పెడతాడు. దర్శి ఆమెను చూసి ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావని అడుగుతాడు.
Read Also : ప్రియుడికి షాక్ ఇచ్చే అమ్మాయి… ఫీలింగ్స్ రాలేదంటూ మరో అమ్మాయితో… అబ్బబ్బా ఏం సీన్స్ ఉన్నాయంటే