E-Paper
Advertisement

OTT Movie : ప్రియుడికి షాక్ ఇచ్చే అమ్మాయి… ఫీలింగ్స్ రాలేదంటూ మరో అమ్మాయితో… అబ్బబ్బా ఏం సీన్స్ ఉన్నాయంటే

OTT Movie : ప్రియుడికి షాక్ ఇచ్చే అమ్మాయి… ఫీలింగ్స్ రాలేదంటూ మరో అమ్మాయితో… అబ్బబ్బా ఏం సీన్స్ ఉన్నాయంటే
Advertisement

OTT Movie : 2013లో వచ్చిన ఒక ఫ్రెంచ్ సినిమా ప్రపంచాన్ని షేక్ చేసింది. 3 గంటల సమయం ఉన్న ఈ రొమాంటిక్ సినిమా ఒక్క సెకను కూడా బోర్ కొట్టదు. ఇద్దరు అమ్మాయిల చుట్టూ తిరిగే ఈ స్టోరీ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. ఇందులో అడెల్ అనే అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఒక అమ్మాయిని లవ్ చేస్తుంది. ఇక వీళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మలుపులు ఉంటాయి. ఆ మలుపులలో వలపు కథలు కూడా ఉంటాయి. ఒంటరిగా చూస్తే మాంచి మజా ఇస్తుంది ఈ సినిమా. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘బ్లూ ఈజ్ ది వార్మెస్ట్ కలర్’ 2013లో విడుదలైన ఒక రొమాంటిక్ ప్రేమకథా చిత్రం. దీనిని అబ్దేల్లతిఫ్ కెచిచే దర్శకత్వం వహించారు. ఇందులో లియా సెడౌక్స్, అడెల్ ఎక్సార్కోపౌలోస్ నటించారు. ఈ సినిమా 2013 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అధికారిక జ్యూరీ నుండి గోల్డెన్ పామ్ అవార్డ్ ను గెలిచింది. దర్శకుడితో పాటు హీరోయిన్స్‌కి కూడా చరిత్రలో ఇదే మొదటి సారి ఈ అవార్డు ఇచ్చారు. ఐయండిబిలో 7.6/10 రేటింగ్ తో MUBI, netflix లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అడెల్ అనే 17 ఏళ్ల హైస్కూల్ అమ్మాయి అబ్బాయిలతో డేటింగ్ చేస్తుంది కానీ ఏదో లోపం అనిపిస్తుంది. ఒక రోజు బ్లూ హెయిర్ ఉన్న ఎమ్మా అనే అమ్మాయి రోడ్డు దాటుతుంటే చేయి పట్టుకుని దాటిస్తుంది. ఆ స్పర్శతో అడెల్ కి మతి పోతుంది. ఆ బ్లూ హెయిర్ కళ్ల ముందు తిరుగుతూనే ఉంటుంది. ఒక గే బార్‌లో ఇద్దరూ మళ్లీ కలుస్తారు. ఇద్దరికీ మొదటి కిస్ అక్కడే మొదలవుతుంది. ఆ ముద్దుతో అడెల్ కి ఎక్కడో స్పార్క్ అయినట్లు అనిపిస్తుంది. జీవితంలో మొదటిసారి ఇదే ప్రేమ అనిపిస్తుంది. ఇక పార్కులు, షికార్లతో గంటల తరబడి లవ్ చేసుకుంటారు. ఎమ్మా ఒక ఆర్ట్ స్టూడెంట్ కావడంతో, అడెల్‌ని పెయింట్ చేస్తూ తన మ్యూజ్‌గా చేసుకుంటుంది.

Read Also : గుడ్డి మొగుడితో కరాటే అమ్మాయి… ఒక్క పంచ్ తో క్రిమినల్స్ కి చుక్కలు… గుండెను పిండేసే ఫ్యామిలీ స్టోరీ

Advertisement

ఒక రోజు అడెల్ ఒక అబ్బాయితో ఒక నైట్ గడుపుతుంది. ఎమ్మాకి ఈ విషయం తెలిసి పూర్తి బ్రేకప్ అవుతుంది. అడెల్ ఏడుస్తూ బతిమాలుకుంటుంది కానీ ఎమ్మా తిరిగి దగ్గరికి రానివ్వదు. కొన్ని సంవత్సరాలు అడెల్ ఇప్పుడు స్కూల్ టీచర్, ఎమ్మా సక్సెస్‌ఫుల్ ఆర్టిస్ట్. చివర్లో ఎమ్మా ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ఇద్దరూ మళ్లీ కలుస్తారు. కళ్లల్లో ఇంకా ప్రేమ ఉంది. కానీ ఒక షాకింగ్ ట్విస్ట్ తో స్టోరీ ముగుస్తుంది. ఆ స్టోరీ ఏమిటి ? వీళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారా ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×