Mini Series OTT : రియలిస్టిక్ వార్ డ్రామాలు చూడాలి అనుకునే వారి కోసమే ఈ మూవీ సజెషన్. రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎమోషనల్ వార్ డ్రామా మినీ-సిరీస్ Band of Brothers (2001). ప్రముఖ హాలీవుడ్ దిగ్గజాలు స్టీవెన్ స్పీల్‌బర్గ్, టామ్ హ్యాంక్స్ కలిసి నిర్మించారు ఈ సిరీస్. అమెరికా ఆర్మీకి చెందిన ‘ఈజీ కంపెనీ’ (Easy Company) అనే సైనికుల యదార్థ గాథల ఆధారంగా రూపొందిన ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనేది తెలుసుకుందాం.
‘బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్’ 10 ఎపిసోడ్ల మాస్టర్ పీస్ సిరీస్. ఇప్పుడు భారతదేశంలో JioCinemaలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి ఎపిసోడ్ ప్రారంభంలోనే అసలైన ఈజీ కంపెనీ యుద్ధ వీరుల (Real veterans) ఇంటర్వ్యూ క్లిప్పింగ్స్ చూపించడం ఈ సిరీస్ స్పెషల్ అని చెప్పాలి. కేవలం యుద్ధం, రక్తపాతం మాత్రమే కాదు, చావు అంచుల్లో ఉన్న సైనికుల మధ్య ఉండే ‘ప్రాణ స్నేహం’ ఇందులో గొప్పగా ఉంటుంది. వార్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సిరీస్ అద్భుతంగా ఉంటుంది. ఐయండిబిలో 9.4 రేటింగ్ ఉంది.
1942లో జార్జియాలోని క్యాంప్ టోకోవాలో కథ మొదలవుతుంది. అక్కడ అత్యంత కఠినమైన పారాచూట్ శిక్షణ పొందిన సైనికులే ఈజీ కంపెనీ ఆర్మీ. వాళ్ళకు రిచర్డ్ వింటర్స్, లూయిస్ నిక్సన్ ఇద్దరూ హెడ్స్ గా ఉంటారు. 1944లో ఫ్రాన్స్‌లోని నార్మాండీ తీరంలో శత్రువుల సరిహద్దుల వెనుక పారాచూట్ల ద్వారా ల్యాండ్ అవుతారు ఈ ఆర్మీ. అక్కడ నాజీ జర్మనీ ఫిరంగులను నాశనం చేసి మిత్రదేశాల సైన్యానికి దారి సుగమం చేయడమే వీరి ఫస్ట్ మిషన్.
బెల్జియంలోని బాస్టోన్ అడవుల్లో ఈజీ కంపెనీ ఎదుర్కొన్న పరిస్థితులు ఈ సిరీస్ లో మెయిన్ హైలైట్స్ ఒకటి. గడ్డకట్టే చలి, ఆహారం, మందుగుండు సామాగ్రి, సరైన దుస్తులు కూడా లేని స్థితిలో ఈ పోరాటం జరుగుతుంది. ఒకానొక సమయంలో జర్మన్ సైన్యం చుట్టుముట్టినా లొంగకుండా ఫైట్ చేస్తారు. బాంబుల దాడిలో ఆర్మీ ఫ్రెండ్స్ కళ్లముందే చనిపోతుంటే, అనుభవించిన మానసిక వేదన చూస్తుంటే ప్రేక్షకులకు కన్నీళ్లు ఆగవు.
Also Read : 18 ఎపిసోడ్ల ఖతర్నాక్ క్రైమ్ సిరీస్ భయ్యా… రిలీజైన గంటల్లోనే ట్రెండింగ్ లో
ఎట్టకేలకు జర్మనీలోకి ప్రవేశించిన తర్వాత ఈజీ కంపెనీ సైనికులు నాజీల ‘కాన్సెంట్రేషన్ క్యాంప్’ను కనిపెడతారు. అక్కడ యూదులను బంధించి ఉంచుతారు. వారిని ఆకలితో అలమటించేలా చేసి దారుణంగా చంపిన నాజీల క్రూరత్వాన్ని కళ్లారా చూసి గుండె బరువెక్కుతుంది. మరి ఇవన్నీ చూసిన ఆ ఆర్మీ జర్మనీ వాళ్ళను ఏం చేశారు ? అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నారు ? అనేది తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.