E-Paper
Advertisement

అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు.. జనగామ జిల్లా అభివృద్ధి పనులకు ఎంపీ చామల శంకుస్థాపన!

అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు.. జనగామ జిల్లా అభివృద్ధి పనులకు ఎంపీ చామల శంకుస్థాపన!
Advertisement

Amrut 2.0 Works: జనగామ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అమృత్ 2.0’ స్కీమ్‌లో భాగంగా, పట్టణంలోని బతుకమ్మ కుంట పునరుద్ధరణ , సుందరీకరణ పనులకు వీరు భూమిపూజ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 1 కోటి 32 లక్షల రూపాయలను కేటాయించారు. ఈ నిధులతో కుంటను అందంగా తీర్చిదిద్ది, స్థానికులకు ఆహ్లాదాన్ని పంచేలా పనులు చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకం కూడా అర్హులైన లబ్ధిదారులకు నేరుగా అందాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇక ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఈ వేదికపైనే పట్టాలను పంపిణీ చేశారు.

Advertisement

అయితే, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. వార్డుల వారీగా ఇందిరమ్మ కమిటీల ద్వారానే ఈ ఎంపిక ఉండాలని, ఆయా వార్డు కౌన్సిలర్ల దృష్టికి తీసుకువెళ్తూ అర్హులకు మాత్రమే న్యాయం జరిగేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read: వనస్థలిపురంలో దారుణం.. అక్కను వేధిస్తున్నాడని బావను కొట్టి చంపిన బావమరిది!

Related News

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ముందు.. సీఎంపై చర్యలు తీసుకోవాలి.. కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్

Big Stories

Advertisement
×