SRH VS CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) తుది దశకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు మూడు జట్లు దూసుకువెళ్లాయి. నాలుగో స్థానం కోసం ఏకంగా 5 జట్లు తెగ పోటీ పడుతున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో లైవ్ మ్యాచ్ జరుగుతుండగానే ఓ జంట.. వీఐపీ బాక్స్ లో ఫస్ట్ నైట్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. బీర్లు, బిర్యానీలు తిని.. వీఐపీ బాక్సులోనే ఎంజాయ్ చేసినట్లు ఓ పోస్ట్ హాట్ టాపిక్ అయింది. ఇక ఈ న్యూస్ చూసిన క్రికెట్ అభిమానులు ఉలిక్కి పడుతున్నారు. వేలాదిమంది అభిమానులు ఉన్న స్టేడియంలో ఇలాంటి పనులేంట్రా ? అంటూ కామెంట్ చేస్తున్నారు.
Also Read: Trolls On Rizwan: 50 పైసల ఓవర్ యాక్టింగ్ అంటూ మూకుమ్మడిగా బంగ్లా ప్లేయర్ల దాడి..అంపైర్ కు రిజ్వాన్ ఫిర్యాదు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా మొన్న సోమవారం రోజున చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ ( Chennai Super Kings vs Sunrisers Hyderabad) మధ్య 63వ మ్యాచ్ జరిగింది. ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అద్భుతంగా రాణించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు… ఏకంగా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఆసక్తికర సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంట్లో ప్రశాంతత లేదని వీఐపీ బాక్స్ బుక్ చేసుకుందట ఓ జంట. అయితే వీళ్లకు పెళ్లయిందా ? కాలేదా ? అనేది తెలియదు కానీ… విఐపి బాక్స్ బుక్ చేసుకొని, అందులోనే ఫస్ట్ నైట్ చేసుకున్నారట.
బీరు అలాగే బిర్యానీ లాగించిన తర్వాత… ఫస్ట్ నైట్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారట. జనాలందరూ మ్యాచ్ చూస్తుండగా.. వీళ్లు మాత్రం చెమటలు కక్కినట్లు ఓ పోస్ట్ హాట్ టాపిక్ అయింది. ఈ జంటలో ఒకరు చెన్నై జెర్సీ వేసుకోగా, అమ్మాయి సన్ రైజర్స్ జెర్సీ ధరించిందట. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ… చాలామంది నిజమే అని అంటున్నారు. ఇక ఈ సంఘటన వైరల్ అయిన నేపథ్యంలో క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి జంటలపై బీసీసీఐ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంతైనా వీఐపీ బాక్స్ లో ఫస్ట్ నైట్ అంటే మామూలుగా ఉండదని మరికొంతమంది అంటున్నారు. లాడ్జిలో లేదా ఓయో రూముల్లో ఇలాంటి పనులు చేయాలి కదా ? స్టేడియం లో ఈ దరిద్రమైన పని చేస్తారా అని ఇంకొంతమంది ఫైర్ అవుతున్నారు. ఇది ఇలా ఉండగా, ఈ మ్యాచ్ లో గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ లోకి వెళ్లింది.