BigTV English

OTT Movie : బీచ్ బాష్ ఫెస్టివల్‌లో మనుషులను మాయం చేసే మ్యాజిక్… బార్బీ లవర్స్ కు పండగో

OTT Movie : బీచ్ బాష్ ఫెస్టివల్‌లో మనుషులను మాయం చేసే మ్యాజిక్… బార్బీ లవర్స్ కు పండగో

OTT Movie : పిల్లల చేత కేరింతలు పెట్టించే ఒక యానిమేటెడ్ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇందులో ఉండే ఐదు పాటలు, ఈ సిరీస్ ని నెక్స్ట్ లెవెల్ లో ఉంచాయి. బీచ్ ఫెస్టివల్‌లో జరిగే దొంగతనాలు, మనుషుల మిస్సింగ్ తో ఈ సిరీస్ ఒక అడ్వెంచర్‌ వైబ్ ను ఇస్తోంది. మీరు కూడా ఫ్యామిలీతో కలసి ఈ సిరీస్ పై ఓ లుక్ వేయండి. ఒక మంచి మెమరబుల్ మూవీగా గుర్తుండిపోతుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


కథలోకి వెళ్తే

బార్బీ, బ్రూక్లిన్ సమ్మర్ హాలిడేస్‌లో మాలిబు బీచ్ ఫెస్టివల్‌లో కెన్, రెనీ, డైసీ, నిక్కీ అనే స్నేహితులతో కలిసి ఫుడ్ స్టాండ్స్ నడుపుతూ సరదాగా ఉంటారు. ఫెస్టివల్‌లో విలియం వార్‌ లాక్ అనే కొత్త మాజిషియన్ తన మేజిక్ షోతో అందరినీ ఆకట్టుకుంటాడు. కానీ అక్కడ ఒక్కసారిగా జ్యువెలరీ, విలువైన వస్తువులు దొంగిలించబడతాయి. ఇప్పుడు బార్బీ బ్రూక్లిన్ తమ ట్రావెల్ పాడ్‌ కాస్ట్‌ను మిస్టరీ పాడ్‌ కాస్ట్‌గా మార్చి, స్నేహితులతో కలిసి ఈ దొంగతనాల వెనుక ఉన్న రహస్యాన్ని కనిపెట్టడానికి డిటెక్టివ్‌లుగా మారతారు. వార్‌ లాక్ షోలో ఏదో తేడాగా ఉందని డౌట్ పడతారు. ఇక్కడ విషయాలు మరింత గమ్మత్తుగా మారతాయి. దొంగతనాలతో పాటు వాళ్ల స్నేహితులు కూడా ఒక్కొక్కరూ మాయమవుతారు.


బార్బీ, బ్రూక్లిన్ ఈ బీచ్‌లో, ఫుడ్ స్టాండ్స్‌లో, వార్‌లాక్ షో వెనుక క్లూస్ కోసం తిరుగుతూ, ఈ దొంగతనాలు, మనుషుల మిస్సింగ్ వెనుక పెద్ద ప్లాన్ ఉందని కనుక్కుంటారు. ఈ సమయంలో వీళ్ళు ఒక షాకింగ్ విషయాన్ని తెలుసుకుంటారు. వార్‌లాక్ అతని అసిస్టెంట్‌తో కలిసి ఈ క్రైమ్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. బార్బీ, బ్రూక్లిన్ లు తమ తెలివితో ఈ మిస్టరీని సాల్వ్ చేసి, తమ స్నేహితులను కాపాడటానికి ప్రయత్నిస్తారు. క్లైమాక్స్ ఒక ఆసక్తికరమైన ముగింపును ఇస్తుంది. వీళ్ళు ఈ మిస్టరీని సాల్వ్ చేస్తారా ? మాజిషియన్ ఎందుకు ఇలాంటి పనులు చేసాడు ? క్లైమాక్స్ ఎలా ముగుస్తుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ యానిమేటెడ్ సిరీస్ ని మిస్ కాకుండా చుడండి.

నెట్‌ఫ్లిక్స్‌లో

‘బార్బీ మిస్టరీస్: బీచ్ డిటెక్టివ్స్’ (Barbie Mysteries: Beach Detectives) 2025లో విడుదలైన యానిమేటెడ్ సిరీస్. ఎనిమిది ఎపిసోడ్‌లతో మాటెల్ టెలివిజన్ దీనిని నిర్మించింది. 25-నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సిరీస్ 2025 ఆగస్ట్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ ప్రారంభమైంది. దీనికి IMDbలో 7.2/10 రేటింగ్ ఉంది.

Read Also : భర్తనే ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్… కట్టుకున్నోన్ని వదిలేసి ఆటగాడితో… వాడిచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

Related News

OTT Movie: ప్రేమించి.. ఆ పని కానిచ్చి మాయమైపోయే అపరిచితుడు.. ఈ మూవీ తెలుగులోనూ ఉంది

OTT Movie : డేటింగ్ యాప్ లో అపరిచితుడితో అరాచకం… లేటు వయసులో ఘాటు పని… నైట్ క్లబ్ లో చేయకూడని పని

OTT Movie : శవం పక్కన మిస్టీరియస్ ఫోటో… థ్రిల్లింగ్ ట్విస్టులు, గ్రిప్పింగ్ నరేషన్… ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

OTT Movie : ఆడవాళ్ళపై పగబట్టే సీరియల్ కిల్లర్… శవాల చర్మం వలిచి… స్పైన్ చిల్లింగ్ సైకో థ్రిల్లర్

OTT Movie : బ్లైండ్‌ఫోల్డ్‌లో బెస్ట్ ఫ్రెండ్ అన్నయ్యతో ఆ పని… హైస్కూల్లోనే సీక్రెట్ గా ఇలాంటి పాడు పనులేంది భయ్యా ?

Big Stories

×