BigTV English

Asia Cup : ఆసియా కప్ లో ఎక్కువ మ్యాచ్ లు గెలిపించిన తోపు కెప్టెన్లు వీళ్లే… ధోనినే రియల్ మొనగాడు

Asia Cup : ఆసియా కప్ లో ఎక్కువ మ్యాచ్ లు గెలిపించిన తోపు కెప్టెన్లు వీళ్లే… ధోనినే రియల్ మొనగాడు

Asia Cup : ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 09 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ ఆసియా కప్ (Asia Cup) లో 8 జట్లు పాల్గొంటాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (Asia Cricket Council) లోని 5 పూర్తి స్థాయి సభ్యులు అప్గనిస్తాన్, బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్, శ్రీలంక ఈ టోర్నమెంట్ కి స్వయంచాలకంగా అర్హత సాధించాయి. 2024 ACC పురుషుల ప్రీమియర్ కప్ లో మొదటి మూడు స్థానాలు నిలిచిన యూఏఈ, ఒమన్, హాంకాంగ్ చేరాయి. ఈ సీజన్ లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. గ్రూపుఏ లో టీమిండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ ఉండగా.. గ్రూపు బీలో అప్గానిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, హాంకాంగ్ ఉన్నాయి. అయితే ఇప్పటివరకు జరిగిన ఆసియా కప్ లో అత్యధికంగా టీమిండియానే విజయం సాధించింది. అయితే కెప్టెన్ల పరంగా చూస్తే.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ (M.S Dhoni) టాప్ లో కొనసాగుతున్నారు. అందుకే ధోనీ నే మొనగాడు అంటున్నారు నెటిజన్లు. ఇప్పటివరకు ఎక్కవ మ్యాచ్ లు గెలిచిన కెప్టెన్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఎం.ఎస్. ధోనీ : 

మహేంద్రసింగ్ ధోనీ టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించాడు. అతని కెప్టెన్సీలో 5 మ్యాచ్ లకు 5 మ్యాచ్ ల్లో విజయం సాధించి ఆసియా కప్ లో గ్రేట్ కెప్టెన్ గా నిలిచాడు. ధోనీ కెప్టెన్సీలో టీమిండియా ఆసియా కప్ విజయం సాధించింది. తొలిసారిగా 2010లో శ్రీలంకపై విజయం సాధించింది టీమిండియా. 2016లో టీ-20 ఫార్మాట్ లో ఛాంపియన్ గా నిలిచింది టీమిండియా. మొత్తం 5 మ్యాచ్ ల్లో గెలిచి టైటిల్ ను ఎగురేసుకుపోవడం విశేషం. ఐసీసీ ట్రోఫీలు అయిన టీ-20, వన్డే వరల్డ్ కప్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ, వన్డే, టీ-20 ఫార్మాట్లలో కూడా ఆసియా కప్ సొంతం చేసుకుని రికార్డు సృష్టించాడు. 


దాసున్ శనక : 

దాసున్ శనక 2022 ఆసియా కప్ గెలుచుకోవడానికి శ్రీలంక కు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇప్పటివరకు శ్రీలంక జట్టు 6 టైటిల్స్ తో రెండో స్థానంలో కొనసాగుతోంది. శనక శ్రీలంక జట్టు మాజీ కెప్టెన్. 2019లో టీ-20 కెప్టెన్ గా, 2021లో వన్డే కెప్టెన్ గా నియమితులయ్యాడు. 2022 ఆసియా కప్ కి శనక కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ సమయంలో శ్రీలంక 6 మ్యాచ్ లు ఆడి వాటిలో 5 మ్యాచ్ ల్లో విజయం సాధించింది.

అమ్జద్ జావేద్ : 

2008 ఆసియా కప్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆరంగేట్రం చేశాడు అమ్జద్ జావేద్. ఇతని కెప్టెన్సీలో యూఏఈ 7 మ్యాచ్ లు ఆడితే వాటిలో మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించింది.

బాబర్ ఆజమ్ : 

పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. పాక్ మాజీ కెప్టెన్ 2025 ఆసియా కప్ కి ఎంపిక కాలేదు. కానీ పాకిస్తాన్ కి ఆసియా కప్ లో బాబర్ ఆజమ్ కెప్టెన్సీ 6 మ్యాచ్ లకు 3 మ్యాచ్ లు గెలిచిన కెప్టెన్ గా నిలిచాడు.

మష్రఫ్ మోర్తజా :

 

మష్రఫ్ మోర్తజా బంగ్లాదేశ్ కి మాజీ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇతను మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆసియా కప్ లో ఇతని కెప్టెన్సీ వల్ల బంగ్లాదేశ్ 5 మ్యాచ్ లు ఆడగా.. వాటిలో 3 మ్యాచ్ ల్లో విజయం సాధించింది.

అస్గర్ ఆఫ్ఘన్ : 
అస్గర్ ఆప్గన్.. అప్గానిస్తాన్ క్రికెట్ జట్టుకు మాజీ కెప్టెన్. ఇతని కెప్టెన్సీ ఆసియా కప్ లో అప్గానిస్తాన్ 3 మ్యాచ్ లు ఆడితే.. వాటిలో 2 మ్యాచ్ ల్లో విజయం సాధించింది.
మహమ్మద్ నబీ : 
అప్గానిస్తాన్ క్రికెటర్ మహమ్మద్ నబీ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. అప్గానిస్తాన్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇతని కెప్టెన్సీలో ఆసియా కప్ లో 5 మ్యాచ్ లు ఆడగా.. వాటిలో 2 మ్యాచ్ ల్లో విజయం సాధించింది అప్గానిస్తాన్.
రోహిత్ శర్మ : 
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆసియా కప్ లో 4 మ్యాచ్ లు ఆడితే కేవలం 2 మ్యాచ్ ల్లోనే టీమిండియా విజయం సాధించింది. అయితే రోహిత్ శర్మ ప్రస్తుతం కేవలం వన్డే క్రికెట్ మాత్రమే కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. టెస్ట్ లకు శుబ్ మన్ గిల్, టీ-20 లకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. రోహిత్ శర్మ టెస్ట్, టీ-20 క్రికెట్ కి గుడ్ బై చెప్పేశాడు. 
షాహిద్ అఫ్రిది : 
పాకిస్తాన్ కి చెందిన క్రికెటర్ షాహిద్ అఫ్రిది కెప్టెన్సీలో ఆసియా కప్ లో 4 మ్యాచ్ లు ఆడితే.. వాటిలో కేవలం 2 మ్యాచ్ ల్లో మాత్రమే పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది.

Related News

Ban-Burqa: బుర‌ఖా ధ‌రించి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ప్లేయ‌ర్లు ?

IND VS WI: స్టేడియంలో ఘాటు రొమాన్స్‌…ప్రియుడి చెంప‌పైన కొట్టి మ‌రీ !

Sai Sudharsan: బౌండ‌రీ గేట్ ద‌గ్గ‌ర బ‌ర్గ‌ర్ తింటున్న సాయి సుద‌ర్శ‌న్‌…టెస్టు క్రికెట్‌లో ఫాలో ఆన్ అంటే?

CSK Srinivasan: మ‌హిళ‌ల క్రికెట్ తో రూపాయి లాభం లేదు..వంటింట్లో రొట్టెలు చేసుకుంటే బెస్ట్‌!

SAW vs BanW: నేడు బంగ్లా వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా మ్యాచ్‌..ఎవ‌రు గెలిచినా టీమిండియాకు ప్ర‌మాద‌మే, పాయింట్ల‌ ప‌ట్టికే త‌ల‌కిందులు

Smriti Mandhana: గిల్ ఓ పిల్ల‌బ‌చ్చా…స్మృతి మందాన కండ‌లు చూడండి…పిసికి చంపేయ‌డం ఖాయం !

హర్మన్‌ కు ఏది చేత‌కాదు, 330 టార్గెట్ ను కాపాడుకోలేక‌పోయారు..ఇంట్లో గిన్నెలు తోముకోండి?

Hardik Pandya: ఒక‌టి కాదు రెండు కాదు, ఏకంగా 8 మందిని వాడుకున్న‌ హార్దిక్ పాండ్యా?

Big Stories

×