OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ప్రేక్షకులు ఓటీటీ వైపు చూస్తున్నారు. ఎలాంటి కంటెంట్ కావాలన్నా ఇందులో ఒక్క క్లిక్ చేస్తే చాలు కళ్ళముందు వాలిపోతుంది. వీటిలో రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలు ఇచ్చే కిక్ మరో లెవెల్ లో ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ప్రియుడితో కలసి మొగుణ్ణి అంతం చేయాలనుకుంటుంది ఒక ఇల్లాలు. ఇక అలాంటి సన్నివేశాలకు కొదవ ఉండదు. ఈ సినిమా స్టోరీ ఏమిటి ? ఎందులో ఉంది ? పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
కథలోకి వెళ్తే
ఈ కథ హెలెనా రివాస్ అనే స్త్రీ చుట్టూ తిరుగుతుంది. ఆమె క్లాడియో మార్టినెజ్ అనే హోటల్ మొగల్ ని పెళ్ళి చేసుకుంటుంది. క్లాడియో ఒక రిచ్, పవర్‌ఫుల్, కానీ క్రూరమైన వ్యక్తి. ఆమెను కంట్రోల్ లో పెడుతుంటాడు. ఆమెను హింసిస్తూ బాధపెడతాడు. హెలెనాకు ఫెర్ అనే ఒక కొడుకు ఉంటాడు. అతను కూడా క్లాడియో వల్ల ఎమోషనల్ గా బాధపడుతుంటాడు. హెలెనా ఈ బాధల నుండి తప్పించుకోవడానికి, ఒక హై-క్లాస్ ఎస్కార్ట్ అయిన ఇవాన్ అనే యువకుడితో అఫైర్ నడుపుతుంది. ఇవాన్ ఆమెకు కంఫర్ట్ ఇస్తాడు. ఈ అఫైర్ క్లాడియోపై రివెంజ్ తీర్చుకునే మార్గంగా మారుతుంది.
హెలెనా, ఇవాన్ కలిసి క్లాడియోను బ్లాక్‌మెయిల్ చేయడానికి ఒక ప్లాన్ వేస్తారు. అలాంటి వీడియో టేప్‌లతో అతన్ని బెదిరించాలని చూస్తారు. కానీ ఇంతలో క్లాడియో ఆమెపై అనుమాన పడటం మొదలుపెడతాడు. ఈ అఫైర్ ఒక ప్రమాదకరమైన గేమ్‌గా మారుతుంది. క్లాడియో ఒక సాధారణ హస్బెండ్ మాత్రమే కాదు. అతను బ్లాక్‌మెయిల్, మానిప్యులేషన్, బెట్రయల్‌తో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. అతన్ని ఢీ కొట్టడం వీళ్ళకు కష్టంగా ఉంటుంది.
కథలో ఇతర కీలక పాత్రలు ఎంట్రీ ఇస్తాయి. వీళ్ళు కూడా ఇతని రహస్యాలను బయటపెట్టడానికి ప్రయత్నిస్తారు. కథ నడుస్తున్న కొద్దీ క్లాడియో కిడ్నాప్ అవుతాడు. హెలెనా, ఇవాన్ అఫైర్ కేవలం లస్ట్‌తో మొదలై ఒక బలమైన బంధంగా మారుతుంది. చివరికి హెలెనా క్లాడియోను చంపుతుందా ? ఇవాన్‌తో కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెడుతుందా ? ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.
నెట్‌ఫ్లిక్స్‌లో
‘అన్‌స్పీకబుల్ సిన్స్’ (Unspeakable Sins) ఒక మెక్సికన్ థ్రిల్లర్ డ్రామా టెలివిజన్ సిరీస్. దీనిని పాబ్లో అంబ్రోసిని దర్శకత్వంలో మార్ అబియెర్టో ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇందులో జూరియా వేగా, ఆండ్రెస్ బైడా, ఎరిక్ హేసర్, అడ్రియానా లౌవియర్, రెజీనా పావోన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో 2025 జూలై 30 నుండి 18 ఎపిసోడ్‌లతో స్ట్రీమింగ్‌కు అందుబాటులోఉంది. IMDbలో 6.7/10 రేటింగ్ ని పొందింది.
Read Also : హాల్ టికెట్ తెచ్చుకోవడానికి వెళ్ళి అమ్మాయి మిస్సింగ్… ఊరు ఊరే పోలీసులకు అడ్డుపడితే… మస్ట్ వాచ్ మలయాళ మూవీ