E-Paper
Advertisement

అమ్మాయిలపై అఘాయిత్యం చేసి చంపే కిల్లర్… ఒళ్లు జలదరించే రియల్ స్టోరీ

అమ్మాయిలపై అఘాయిత్యం చేసి చంపే కిల్లర్… ఒళ్లు జలదరించే రియల్ స్టోరీ
Advertisement

True Crime Documentary Series: ఆడవాళ్లను మాత్రమే టార్గెట్ చేసి చంపే సీరియల్ కిల్లర్ల సినిమాలు ఇప్పటికే ఎన్నో చూశాం మనం. కానీ ఒంటరి అమ్మాయిలపై అఘాయిత్యం చేసి అత్యంత క్రూరంగా చంపేసిన ఓ రియల్ సీరియల్ కిల్లర్ కథనే ఈరోజు మన మూవీ సజెషన్. అయితే ఇది సినిమా కాదు భయంకరమైన రియల్ లైఫ్ క్రైమ్ డాక్యుమెంటరీ. ‘బీస్ట్ ఆఫ్ బెంగళూరు : ఇండియన్ ప్రిడేటర్’ (Beast of Bangalore : Indian Predator). మరి ఈ డాక్యుమెంటరీని ఎక్కడ చూడవచ్చు ? అసలు ఆ సైకో సృష్టించిన అరాచకం ఏంటి ? అన్నది తెలియాలంటే ముందు కథలోకి వెళ్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ 3 ఎపిసోడ్ల సిరీస్ కర్ణాటక క్రైమ్ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నేరాల్లో ఒకటైన ఉమేష్ రెడ్డి కేసు ఆధారంగా తెరకెక్కింది. డాక్యుమెంటరీలో పోలీసు అధికారులు, బాధితుల కుటుంబాలు, జర్నలిస్టులు, కేసుతో ముడిపడిన వ్యక్తుల ఇంటర్వ్యూలు, ఆర్కైవ్ ఫుటేజ్, రీఎనాక్ట్‌మెంట్స్ అన్ని ఉంటాయి.

Advertisement

1996లో ఒక యువతి దారుణ హత్యతో కథ మొదలవుతుంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఉమేష్ రెడ్డి అనే వ్యక్తి పేరు తెరపైకి వస్తుంది. అతను ఒకప్పుడు డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ లో కానిస్టేబుల్‌గా పని చేశాడు. కానీ ఉద్యోగం కోల్పోయాక అతని మనసులోని క్రూరత్వం నెమ్మదిగా బయట పడుతుంది. మహిళలపై దాడులు, అత్యాచారాలు చేస్తూ ఉంటాడు. ఆ తరువాత ఉమేష్ రెడ్డి బెంగళూరు వెళతాడు.

అక్కడ ఒంటరిగా ఉండే మహిళల ఇళ్లను టార్గెట్ చేస్తాడు. నీళ్లు అడుగుతాడు, సహాయం కోరడం వంటి సాకులతో ఇళ్లలోకి చొరబడతాడు. వాళ్ళను బంధించి, అమానుషంగా హింసించి, చివరికి హత్య చేస్తాడు. అతని క్రూరత్వం బెంగళూరు నగరాన్ని గడగడలాడించింది. దీంతో అప్పట్లో మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడేవారు. ఆ సమయంలో ఇంటి తలుపులకు గ్రిల్స్ వేయడం అలవాటు చేసుకున్నట్టు స్థానికులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.

Advertisement

డాక్యుమెంటరీలో ఉమేష్ రెడ్డి మానసిక స్థితి గురించి కూడా వివరంగా చెప్పారు. అతనికి మహిళల అంతర్వస్త్రాలను దొంగిలించే చివికృత అలవాటు కూడా ఉండేదట. ఒకవేళ పోలీసులకు దొరికినా చాకచక్యంగా తప్పించుకుని మళ్లీ నేరాలు చేసేవాడు. ఒక ఎపిసోడ్‌లో రైలు నుంచి దూకి పారిపోయిన సన్నివేశం భయంకరంగా ఉంటుంది. పక్కా ప్లాన్‌తో చివరికి ఉమేష్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేశారు ? అతను 18 మందికి పైగా మహిళలను ఎలా హత్య చేశాడు ? చివరికి అతనికి ఎలాంటి శిక్ష పడింది ? అన్నది సిరీస్ స్టోరీ.

తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ?

‘బీస్ట్ ఆఫ్ బెంగళూరు : ఇండియన్ ప్రిడేటర్’ అనే డాక్యుమెంటరీ సిరీస్ ఈ నిజమైన సీరియల్ కిల్లర్ కథ. ఇతని వల్ల 1990ల చివరలో కర్ణాటకలో మహిళలు ఒంటరిగా ఇంట్లో ఉండటానికే భయపడేవారు. తలుపులకు ఇనుప గ్రిల్స్ వేయడం అప్పట్లో ఒక ట్రెండ్‌గా మారింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడ, హిందీ, ఇంగ్లీష్ ఆడియోలతో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ లేదు, కానీ ఇంగ్లీష్ లేదా హిందీ సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు.

Read Also: ప్రతీ ఎపిసోడ్లో ఒక కొత్త కేసు… ట్విస్టులతో మెంటలెక్కించే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

Tags

Related News

ఆ పాత భవంతిలో ఉంటే చస్తారు… దెయ్యాల కోట వెనుక ఉన్న భయంకరమైన మిస్టరీ స్ట్రీమింగ్ తెలుగులో

కంటికి కనిపించని రాక్షస శక్తులు… అర్ధరాత్రి ఈ హారర్ చూస్తే గుండె ఆగిపోవాల్సిందే

ఆమె గుర్తొస్తే గుండెల్లో కోత… కన్నీళ్లు పెట్టించే అందమైన ప్రేమ ప్రయాణం

నామోషీగా భావిస్తే జీవితం నాశనమే… గ్రౌండ్‌లో చెమట కాదు రక్తం చిందేలా పోరాటం

ఒకే వారం ఏకంగా 4 మలయాళ సినిమాలు… థ్రిల్లర్స్ నుండి హారర్ వరకు ఫుల్ వినోదం

అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన జంట… పోలీసులకే చెమటలు… సీట్ ఎడ్జ్ డ్రామా

పగటిపూట సాధువులు, రాత్రికి సైకోలు… గూస్‌బంప్స్ తెప్పించే క్రైమ్ థ్రిల్లర్

మనసును తాకే అందమైన ప్రేమకథ… ఫ్యామిలీ అంతా కలసి చూడదగ్గ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్

Big Stories

Advertisement
×