E-Paper
Advertisement

OTT Movie : ఇదేం ఫ్యామిలీ భయ్యా ఇలా ఉంది… ఇంటికొచ్చిన కోడలిపై ఒక్కొక్కరూ… మామూలు స్టోరీ కాదు

OTT Movie : ఇదేం ఫ్యామిలీ భయ్యా ఇలా ఉంది… ఇంటికొచ్చిన కోడలిపై ఒక్కొక్కరూ… మామూలు స్టోరీ కాదు
Advertisement

OTT Movie : కొరియన్ ఇండస్ట్రీ నుంచి మనసుకు హత్తుకునే రొమాంటిక్ సినిమాలే కాదు, మతిపోగొట్టే బ్రూటల్ రివేంజ్ లు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో బ్రూటల్ సీన్స్ చాలా ఘోరంగా ఉంటాయి. ఒక్క సారి చూస్తే వారం రోజులు ముద్ద కూడా దిగదు.
ఈ కథ సియోల్‌లో ఒక బ్యాంక్ ఉద్యోగిని, ఒక చిన్న ద్వీపానికి వెళ్ళాక మొదలవుతుంది. అక్కడ ఆమె ఫ్రెండ్ ని కొందరు మగాళ్లు దారుణమైన హింస చేస్తారు. దీంతో స్టోరీ తీవ్రమైన బ్రూటల్ రివేంజ్ కి వెళ్తుంది. ఈ కొరియన్ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2010లో వచ్చిన ఈ సౌత్ కొరియన్ సైకలాజికల్ థ్రిల్లర్ / రివెంజ్ హారర్ మూవీ పేరు ‘బెడెవిల్డ్’. జాంగ్ చుల్-సూ మొదటి సారిగా దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఇందులో సియో యంగ్-హీ రివెంజ్ తీర్చుకునే మహిళ కిమ్ పాత్రలో, జి సుంగ్-వోన్ సియోల్ నుంచి వచ్చిన ఫ్రెండ్ హే-వోన్ పాత్రలో నటించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, Mubi, Shudderలో ఈ సినిమా అందుబాటులో ఉంది.ఐయండిబిలో 7.3/10 రేటింగ్ పొందింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

సియోల్‌లో హే-వోన్ అనే అమ్మాయి బ్యాంక్‌లో పని చేస్తుంటుంది. ఆఫీస్‌లో ఒక కస్టమర్ తో గొడవ జరుగుతుంది. దాని వల్ల ఆఫీసులో అందరూ ఆమెని దూరం పెడతారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక మానసికంగా డౌన్ అయిపోతుంది. లీవ్ తీసుకుని చిన్నప్పుడు తాను గడిపిన ఒక చిన్న ఐలాండ్‌ లో వెకేషన్‌కి వెళ్తుంది. ఆ ద్వీపంలో ఆమె చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్ కిమ్ ఉంటుంది. ఆ ద్వీపంలో మొత్తం 10 మంది మాత్రమే ఉంటారు. అందరూ ఒకరికొకరు బంధువులు. ఇక్కడ పూర్తిగా పురుషాధిపత్యం ఉంటుంది. కిమ్ ని అందరూ బానిసలా ఉపయోగిస్తారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 వరకు పని చేయిస్తారు. ఆమె భర్త జాంగ్, అతని అన్నయ్య, మిగతా మగాళ్లు ఎవరికి ఇష్టమొచ్చినప్పుడు ఆమెని కొట్టడం, అఘాయిత్యం చేయడం, బూతులు తిడుతూ హ్యూమిలియేట్ చేయడం చేస్తుంటారు. ఆమెకి 13 ఏళ్ల కూతురు కూడా ఉంటుంది. ఆ అమ్మాయిని కూడా ఆ మగాళ్లు అఘాయిత్యం చేస్తారు. కిమ్ ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్‌కి వెళ్లినా నీ ఇంటి విషయం నీవే చూసుకో అని తిప్పేస్తారు. ఆమె ఒకసారి సియోల్‌కి పారిపోదామని ట్రై చేస్తుంది కానీ భర్త బెదిరించి తిరిగి తీసుకొస్తాడు.

Read Also : అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు లీక్… ఆన్లైన్ చాట్ లో అడ్డమైన పనులు… ఆగమయ్యే జీవితాలు

Advertisement

ఇప్పుడు హే-వోన్ ని చూసి కిమ్ ఆనందంతో ఏడుస్తుంది. నన్ను సియోల్ తీసుకెళ్లు అని బతిమాలుతుంది. కానీ హే-వోన్ భయపడి నాకు సంబంధం లేదు, నేను వెకేషన్‌కి వచ్చానని దూరంగా ఉంటుంది. ఒక రోజు కిమ్ ని ఈడ్చి కొట్టడం, దారుణంగా అఘాయిత్యం చేయడం హే-వోన్ కళ్లారా చూస్తుంది. కానీ ఏమీ చేయకుండా మౌనంగా వెళ్లిపోతుంది. ఒక రాత్రి జాంగ్, అతని అన్నయ్య, మిగతా మగాళ్లు కిమ్ కూతుర్ని అఘాయిత్యం చేసి చంపేస్తారు. ఆ అమ్మాయి శవాన్ని సముద్రంలో పడేస్తారు.అది చూసిన కిమ్ మైండ్ పూర్తిగా బ్లాంక్ అయిపోతుంది. ఆమె ఇంట్లో దాచిపెట్టిన పెద్ద కొడవలి తీసుకుని ఒక్కొక్కరిని నరికి చంపేయడం మొదలెడుతుంది. ఈ రివేంజ్ చూస్తే వారం రోజులు ముద్దకూడా డిగదు. అంత బ్రూటల్ గా ఉంటుంది. చివరికి హే-వోన్ దగ్గరికి కిమ్ వస్తుంది. ఆమె మీద కూడా రివేంజ్ తీర్చుకుంటుందా ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

 

 

 

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×