E-Paper
Advertisement

నిద్రపోతే ప్రాణం పోతుందా?.. మనసుని కదిలించే హారర్ థ్రిల్లర్..

నిద్రపోతే ప్రాణం పోతుందా?.. మనసుని కదిలించే హారర్ థ్రిల్లర్..
Advertisement

Before Wake: సాధారణంగా పిల్లలకు రాత్రిపూట ఒంటరిగా పడుకోవాలన్నా, చీకటి అన్నా భయం వేస్తుంటుంది. కానీ ఎనిమిదేళ్ల కోడి (Cody) భయం మాత్రం చాలా విభిన్నమైనది. తను నిద్రపోతే ఎక్కడ తన కలలు నిజమైపోతాయో అని ఆ చిన్నారి వణికిపోతుంటాడు. వినడానికి వింతగా ఉన్నా, ఇదే ఈ సినిమాలోని అసలు ట్విస్ట్!

Read also-తన తల్లి కోసం దళపతి విజయ్ అంత పని చేశాడా?.. ఇది తెలిస్తే షాక్ అవుతారు..

కథా నేపథ్యం

Advertisement

మార్క్, జెస్సీ దంపతులు తమ సొంత కొడుకుని కోల్పోయిన బాధలో ఉంటారు. ఆ వెలితిని పూడ్చుకోవడానికి ‘కోడి’ అనే అబ్బాయిని దత్తత తీసుకుంటారు. కోడి చాలా మంచి అబ్బాయి, కానీ అతనికి నిద్ర అంటే విపరీతమైన భయం. జెస్సీ మొదట్లో అది కేవలం కొత్త చోటుకి వచ్చిన భయం అని అనుకుంటుంది. కానీ ఒక రాత్రి కోడి నిద్రపోతున్నప్పుడు, వారి ఇంట్లోకి అద్భుతమైన రంగురంగుల సీతాకోకచిలుకలు వస్తాయి. అంతా ఆశ్చర్యపోయేలోపే, చనిపోయిన వారి సొంత కొడుకు సజీవంగా వారి కళ్లముందే ప్రత్యక్షమవుతాడు.

కలలు నిజమైతే.. 

కోడికి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. అతను నిద్రలో ఏది ఊహించుకుంటే అది నిజరూపం దాల్చుతుంది. ఇది గమనించిన జెస్సీ, తన చనిపోయిన కొడుకుని మళ్లీ చూడవచ్చనే ఆశతో కోడికి నిద్రమాత్రలు ఇచ్చి మరీ పడుకోబెట్టాలని చూస్తుంది. కానీ ఇక్కడే అసలు ప్రమాదం పొంచి ఉంది. కోడికి కేవలం మంచి కలలే కాదు, భయంకరమైన పీడకలలు కూడా వస్తాయి.

Advertisement

అతని పీడకలల నుండి ‘క్యాంకర్’ (Canker) అనే భయంకరమైన రాక్షసుడు బయటకు వస్తాడు. ఆ రాక్షసుడు తన దారిలో అడ్డొచ్చిన వారిని మింగేస్తుంటాడు. మరి కోడి పీడకలల నుండి ఈ దంపతులు ప్రాణాలతో బయటపడ్డారా? కోడికి ఈ వింత శక్తి ఎందుకు వచ్చింది? ఆ ‘క్యాంకర్’ రాక్షసుడి వెనుక ఉన్న రహస్యం ఏంటి? అనేదే మిగతా కథ.

ఇది కేవలం రక్తం చిందే హారర్ సినిమా మాత్రమే కాదు. ఒక తల్లి ప్రేమ, కోల్పోయిన బిడ్డపై ఉన్న ఆరాటం ఈ సినిమాలో మనసుని హత్తుకుంటాయి. చిన్నారి కోడి పాత్రలో జాకబ్ ట్రెంబ్లే నటన అద్భుతం. తన కలల వల్ల ఇతరులకు హాని జరుగుతుందేమో అని అతను పడే ఆవేదన ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తుంది. సినిమాలో కనిపించే సీతాకోకచిలుకలు, ఆ రాక్షసుడి విజువల్స్ చాలా సహజంగా, భయంకరంగా ఉంటాయి.

Read also-Kissik Talks: ప్రభాస్ పై సంజన ఊహించని కామెంట్స్.. అలాంటి రోజు వస్తుందా?

‘బిఫోర్ ఐ వేక్’ కేవలం దయ్యాల సినిమా కాదు, ఇది ఒక చిన్నారి మెదడులోని భయాలకు ప్రతిరూపం. క్లైమాక్స్‌లో ఆ రాక్షసుడి వెనుక ఉన్న నిజాన్ని దర్శకుడు మైక్ ఫ్లానగన్ చూపించిన విధానం మెప్పిస్తుంది. మీరు వైవిధ్యమైన హారర్ సినిమాలను ఇష్టపడేవారైతే, నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని అస్సలు మిస్ అవ్వకండి! ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×