E-Paper
Advertisement

కొత్త కారు మంచిదా? సెకండ్ హ్యాండ్ కారు బెటరా? ముందు ఇవి తెలుసుకోండి!

కొత్త కారు మంచిదా? సెకండ్ హ్యాండ్ కారు బెటరా? ముందు ఇవి తెలుసుకోండి!
Advertisement

Car Buying Guide: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కారు కొనాలని భావిస్తున్నారు. ఉద్యోగం, కుటుంబ ప్రయాణాలు, రోజువారీ పనుల కోసం కారు అయితే, కంఫర్ట్ గా ఉంటుందనుకుంటున్నారు. అయితే, కారు కొనేటప్పుడు చాలా మందికి ఓ డౌట్  వస్తుంది. అదే.. కొత్త కారు కొనాలా? లేక సెకండ్ హ్యాండ్ కారు తీసుకోవాలా?. ఈ ప్రశ్న చాలామందిని గందరగోళానికి గురి చేస్తోంది. ఎందుకంటే, రెండింటికీ కొన్నిలాభాలతో పాటు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

కొత్తకారుతో కలిగే లాభాలు

కొత్త కారు కొనడం వల్ల కలిగే ముఖ్యమైన లాభం నమ్మకం. కంపెనీ నుంచి నేరుగా వాహనం వస్తుండటంతో ప్రారంభంలో పెద్దగా సమస్యలు ఉండవు. ఎక్కువ కంపెనీలు కొత్త కార్లపై వారంటీ కూడా ఇస్తాయి. దీని వల్ల కొన్ని సంవత్సరాలు మెయింటెనెన్స్ ఖర్చుల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అలాగే, కొత్త కార్లలో తాజా టెక్నాలజీ, ఆధునిక భద్రతా ఫీచర్లు, మెరుగైన మైలేజ్ లాంటి ప్రయోజనాలు ఉంటాయి. కొత్త కార్లలో ఎయిర్‌ బ్యాగ్స్‌, టచ్‌ స్క్రీన్ సిస్టమ్‌ లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, చక్కటి బ్రేకింగ్ వ్యవస్థ వంటి లాంటి సౌకర్యాలు ఉంటాయి. ముఖ్యంగా కుటుంబంతో ఎక్కువగా ప్రయాణించే వారికి ఇవి ఉపయోగపడతాయి. అదనంగా కొత్త కార్లు ఇంధనాన్ని కూడా కొంత వరకు ఆదా చేసేలా రూపొందిస్తున్నారు.

Advertisement

కొత్త కారు కొనడంలో ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కారు ధరతో పాటు రిజిస్ట్రేషన్‌, ఇన్సూరెన్స్‌, రోడ్డు పన్ను వంటి అదనపు ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొత్త కారు షోరూమ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే దాని విలువ తగ్గడం ప్రారంభమవుతుంది. దీన్నే డిప్రిసియేషన్ అంటారు. సాధారణంగా మొదటి ఏడాదిలోనే కారు విలువ 10 నుంచి 15 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది.

సెకెండ్ హ్యాండ్ కారుతో లాభాలు

అటు సెకండ్ హ్యాండ్ కారు కొనడం బడ్జెట్ పరంగా కొంత లాభదాయకంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో మంచి మోడల్ కారును కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కొంతమంది కొత్త కారుకు బదులుగా అదే ధరలో మంచి ఫీచర్లున్న పాత ప్రీమియం కారును ఎంచుకుంటారు. అదనంగా ట్యాక్సులు, రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా ఎక్కువగా ఉండవు.

Advertisement

అయితే, సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు సరైన తనిఖీ చాలా ముఖ్యం. వాహనం సర్వీస్ హిస్టరీ ఎలా ఉంది? ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు ఉన్నాయా? ప్రమాదాల్లో పడిందా? అనే విషయాలు తెలుసుకోవాలి. టెస్ట్ డ్రైవ్ చేయకుండా కారు కొనకూడదు. లేదంటే భవిష్యత్తులో భారీ మరమ్మతు ఖర్చులు వచ్చే ప్రమాదం ఉంటుంది.  మంచి కండిషన్‌లో ఉన్న వాడిన కారు తీసుకుంటే చాలా సంవత్సరాలు ఉపయోగించుకోవచ్చు. అయితే కొన్ని పాత కార్లలో మెయింటెనెన్స్ ఖర్చులు క్రమంగా పెరగవచ్చు. ముఖ్యంగా ఎక్కువ కిలోమీటర్లు నడిచిన వాహనాల్లో ఇంజిన్‌, సస్పెన్షన్‌, టైర్లు వంటి భాగాలకు మరమ్మతులు అవసరం కావచ్చు.కొత్త కారు కొనాలా? సెకండ్ హ్యాండ్ కారు ఎంచుకోవాలా? అనేది పూర్తిగా వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది.

Read Also: గ్యాస్ కార్లు vs ఎలక్ట్రిక్ కార్లు.. థర్మల్ ఇమేజింగ్‌ చూస్తే షాకవ్వాల్సిందే!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×