E-Paper
Advertisement

మా ఇంటి బంగారం’నుండి వచ్చేసిన వీడియో.. సమంత ఫైట్స్ చూస్తే మైండ్ బ్లాకే!

మా ఇంటి బంగారం’నుండి వచ్చేసిన వీడియో.. సమంత ఫైట్స్ చూస్తే మైండ్ బ్లాకే!
Advertisement

Samantha Birthday : ఈరోజు టాలీవుడ్ వెటరన్ బ్యూటీ సమంత 39వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘మా ఇంటి బంగారం’ నుండి క్రేజీ వీడియో  వదిలి సామ్ కి బర్త్ డే విషెస్ చెప్పుకొచ్చింది మూవీ టీమ్. ఈ వీడియోనే ఇపుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇక ఈ సినిమాలో సమంతతో పాటు టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ రావు రమేష్ ఒక కీలక పాత్రలో కనిపిస్తుండగా, DJ టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ ఒక స్పెషల్ రోల్ చేస్తున్నాడన్న వార్తలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయ్.

యాక్షన్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా

Advertisement

‘యశోద’, ‘శాకుంతలం’ వంటి భారీ చిత్రాల తర్వాత సామ్ తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవీస్’పై ఎంతో ప్రెస్టేజియస్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ టీజర్‌లో సామ్ యాక్షన్ చూసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లీ, సామ్‌ని ఒక ‘బీస్ట్’ (Beast) అంటూ పోల్చడం విశేషం. గతంలో ‘ఓ బేబీ’ వంటి క్లాసిక్ హిట్‌ను అందించిన డైరెక్టర్ నందిని రెడ్డి, ఈసారి సామ్‌ను ఒక మాస్ యాక్షన్ అవతార్‌లో ప్రెజెంట్ చేస్తుందని, ఇందులో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఈ చిత్రంలో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉండబోతున్నాయని టీజర్ చూస్తేనే తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ఓంప్రకాష్ చేస్తుండగా, రాజ్ నిడిమోరు కథని అందిస్తుండటం మరో విశేషం.

1987 ఏప్రిల్ 28న చెన్నైలో జన్మించిన సామ్

Advertisement

ఇక సమంత విషయానికి వస్తే 1987 ఏప్రిల్ 28న చెన్నైలో జన్మించిన సామ్, సామాన్య మధ్యతరగతి నుంచి వచ్చి నేడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదగడం మెచ్చుకోతగ్గ విషయం. డిగ్రీ చదివే రోజుల్లో పాకెట్ మనీ కోసం మోడలింగ్ మొదలుపెట్టిన ఆమె, ‘ఏ మాయ చేసావే’తో టాలీవుడ్‌ని నిజంగానే మాయ చేసేసింది. ఆ తర్వాత ‘ఈగ’, ‘రంగస్థలం’, ‘ఓ బేబీ’, ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వంటి చిత్రాలతో తన నటనలోని విశ్వరూపం చూపించిందనే చెప్పాలి.

అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం

ఇక తన తొలి చిత్ర హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి 2017, అక్టోబర్ 7న గోవాలో పెళ్లి చేసుకున్న సామ్ నాలుగేళ్ల వైవాహిక బంధం తర్వాత కొన్ని మనస్పర్థల కారణంగా 2021, అక్టోబర్ 2న తాము విడిపోతున్నట్లు ప్రకటించిన జోడీ అభిమానులకు పెద్ద షాకే ఇచ్చారు. ఇక చాలా కాలం పాటు రాజ్ నిడిమోరు తో రిలేషన్‌షిప్‌లో ఉన్న సామ్ 2025, డిసెంబర్ 1న వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో (లింగ భైరవి ఆలయం) అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే.

చూడాలి మరి రాజ్‌తో వివాహ బంధంలో అడుగు పెట్టిన తర్వాత తొలిసారి మా ఇంటి బంగారంతో మే 15న థియేటర్లలోకి వస్తున్న సామ్ థియేటర్‌లో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×