E-Paper
Advertisement

Romantic Comedy OTT : 20 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్స్‌… వారం రోజులు అలాంటి డీల్… క్రేజీ రొమాంటిక్ కామెడీ

Romantic Comedy OTT : 20 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్స్‌… వారం రోజులు అలాంటి డీల్… క్రేజీ రొమాంటిక్ కామెడీ
Advertisement

Romantic Comedy OTT : ఫ్రెండ్షిప్ వేరు, ప్రేమ వేరు అనేది చాలామంది అభిప్రాయం. అయితే స్నేహంలోనే ప్రేమను వెతుక్కునే వారు కూడా ఎంతోమంది ఉన్నారు. చాలాకాలంగా ఒక అబ్బాయి అమ్మాయి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారితే, ఆ బంధం ఇంకా బలంగా లైఫ్ లాంగ్ ఉంటుందని నమ్ముతారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటి స్టోరీ లైన్ తోనే రూపొందింది. కాకపోతే ఇందులో అమ్మాయి, అబ్బాయి ఓ వింత డీల్ చేసుకుంటారు. మరి ఇలాంటి ఆసక్తికరమైన కథతో రూపొందిన లైట్ హార్టెడ్ మూవీ పేరేంటి ? ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనేది ఇప్పుడు చూద్దాం.

నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో

2023లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన అమెరికన్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘యువర్ ప్లేస్ ఆర్ మైన్’ (Your Place or Mine). ఇది అలీన్ బ్రోష్ మక్‌కెన్నా దర్శకత్వం వహించిన సినిమా. రీస్ విథర్‌స్పూన్, అష్టన్ కుచర్ ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా 2023 ఫిబ్రవరి 10న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అయింది. ఇది స్నేహితుల మధ్య ప్రేమ, కుటుంబ బంధాలు, జీవిత మలుపులు గురించి సరదాగా, ఎమోషనల్ జర్నీని చూపించే చిత్రం. సినిమా బడ్జెట్ సుమారు $30 మిలియన్లు కాగా, నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్‌గా తెరకెక్కింది. థియేటర్లలో విడుదల కాలేదు, డైరెక్ట్ OTTలోకి వచ్చింది. IMDbలో 5.7 రేటింగ్ ఉన్న ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

Advertisement

సినిమా రొమాంటిక్ కామెడీ జానర్‌లో సరదాగా సాగుతుంది. లాస్ ఏంజిల్స్, న్యూయార్క్ లొకేషన్స్ అందమైన విజువల్స్‌గా కనిపిస్తాయి. సంగీతం గ్రెగ్ గార్డినర్ అందించారు. రొమాంటిక్ సీన్స్‌లో మెలోడిక్ ట్రాక్స్ బాగున్నాయి. సినిమా హాలీవుడ్ రొమ్-కామ్ స్టైల్‌లో ఉంటుంది. కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ ను మరింత లోతుగా చూపించారు. భారీ వ్యూస్ కొల్లగొట్టిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ టాప్ 10లోకి వచ్చింది.

Also Read : ఫోరెన్సిక్ పాథాలజిస్ట్‌ కు చెమటలు పట్టించే సీరియల్ కిల్లర్… స్ట్రీమింగ్ కొత్త సిరీస్ సిద్ధం

కథలోకి వెళ్తే…

Advertisement

డెబ్బీ (రీస్ విథర్‌స్పూన్), పీటర్ (అష్టన్ కుచర్) గత 20 ఏళ్లుగా స్నేహితులు. డెబ్బీ లాస్ ఏంజిల్స్‌లో ఒక సింగిల్ మదర్‌ గా, తన కుమారుడు జాక్‌ను చూసుకుంటూ జీవిస్తుంది. ఆమె జీవితం బాధ్యతలతో నిండి ఉంటుంది. పీటర్ న్యూయార్క్‌ లో ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా, స్వేచ్ఛాయుత జీవితం గడుపుతాడు. ఒక రోజు డెబ్బీ తన కుమారుడు జాక్‌ కు సంబంధించిన కోర్స్ కోసం న్యూయార్క్ వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు వాళ్లిద్దరూ “హోమ్ స్వాప్” చేసుకుంటారు. డెబ్బీ పీటర్ ఇంట్లో, పీటర్ డెబ్బీ ఇంట్లో ఉండాలని నిర్ణయించుకుంటారు. న్యూయార్క్‌లో డెబ్బీ పీటర్ జీవితాన్ని అనుభవిస్తుంది. అతని స్నేహితులు, గర్ల్‌ఫ్రెండ్ మిండీ (జోయి కింగ్), వ్యాపారం వంటివి చూసుకుంటుంది. లాస్ ఏంజిల్స్‌లో పీటర్ డెబ్బీ కుమారుడు జాక్‌ ను చూసుకుంటాడు. డెబ్బీ మాజీ భర్త థియో (జెస్సీ విలియమ్స్), స్నేహితురాలు జెన్ (రాచెల్ బ్లూమ్) వంటివి హ్యాండిల్ చేస్తాడు. ఈ స్వాప్ వల్ల వాళ్లు ఒకరి జీవితాన్ని మరొకరు అర్థం చేసుకుంటారు. మధ్యలో కామెడీ సీన్స్ తో పాటు భావోద్వేగ మలుపులు ఉంటాయి. చివరికి వాళ్ల మధ్య స్నేహం ప్రేమగా మారుతుందా ? అనేది కథ సినిమా హ్యాపీ ఎండింగ్‌తో ముగుస్తుంది. అభ్యంతర సీన్స్ ఉండవు. కాబట్టి ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను వీక్షించవచ్చు.

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×