Best Netflix Series : డిజిటల్ ప్రపంచంలో నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఒక విప్లవం. పిచ్చెక్కించే కంటెంట్ ను పరిచయం చేయడంలో ముందు వరుసలో ఉంటుంది. ఇక కొన్ని సిరీస్‌లు కేవలం టైమ్ పాస్ కోసం చూస్తే, మరికొన్ని మాత్రం మనల్ని కథలో లీనం చేసి, నిద్రలేకుండా చేస్తాయి. అలా బుర్ర కరాబ్ అయ్యే రేంజ్ సస్పెన్స్, ఎమోషన్, యాక్షన్ ఉన్న అద్భుతమైన సిరీస్‌ల లిస్ట్ ఇక్కడ ఉంది. ఒక్క ఎపిసోడ్ తో మొదలెడితే చివరి వరకు అస్సలు ఆపలేరు.
క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మాస్టర్ పీస్. నేరస్తులు ఎందుకు నేరం చేస్తారు? వాళ్ళ మైండ్ లో ఏం జరుగుతుంది? అనే అంశాలపై ఇద్దరు FBI ఏజెంట్లు చేసే పరిశోధనే ఈ సిరీస్. సీరియల్ కిల్లర్ల సైకాలజీని అర్థం చేసుకునే క్రమంలో వచ్చే సీన్లు మీ బుర్రను ఆలోచింపజేస్తాయి. ఇది చూశాక క్రైమ్ ను చూసే మీ కోణం పూర్తిగా మారిపోతుంది.
సైన్స్ ఫిక్షన్ ప్రేమికులకు ఇది ఒక అద్భుతం. మానవ చరిత్రను మార్చేసే ఒక రహస్య ప్రయోగం, గ్రహాంతర వాసుల ముప్పు చుట్టూ తిరిగే ఈ కథ బుర్ర కరాబ్ చేసే ట్విస్టులతో ఉంటుంది. ఫిజిక్స్ తో మిస్టరీని కలిపి దర్శకుడు చూపించిన విధానం అద్భుతం. దీనిలోని గ్రాఫిక్స్, స్టోరీ లైన్ మిమ్మల్ని టీవీ ముందు నుంచి అస్సలు కదలనివ్వవు.
ఒక వింత ప్రపంచంలో ప్రాణాలను పణంగా పెట్టి ఆడే ప్రమాదకరమైన ఆటలతో ఇది ఉంటుంది. జపాన్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ కంటే ముందే వచ్చి ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసింది. ప్రతి గేమ్‌లోనూ తెలివితేటలు వాడాలి, లేదంటే చావు ఖాయం. ఉత్కంఠభరితమైన సర్వైవల్ థ్రిల్లర్ కావాలనుకుంటే ఇది బెస్ట్ ఛాయిస్.
చదరంగం బోర్ కొడుతుందని అనుకుంటే పొరపాటే. ఒక అనాథ అమ్మాయి ప్రపంచ స్థాయి చెస్ ఛాంపియన్‌గా ఎలా ఎదిగిందనే ప్రయాణం మస్త్ మజా ఇస్తుంది. ఆటపై ఆమెకు ఉన్న పట్టు చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. దీని మేకింగ్ స్టైల్, నటన మిమ్మల్ని కట్టిపడేస్తాయి.
లాస్ ఏంజిల్స్‌లోని ఒక మురికివాడలో నలుగురు స్నేహితుల హైస్కూల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఈ సిరీస్. ఇందులో కామెడీ ఎంత ఉంటుందో, గ్యాంగ్ వార్స్, ఎమోషనల్ డ్రామా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. టీనేజ్ లైఫ్, ఫ్రెండ్‌షిప్, రిస్క్ అన్నీ కలిపిన క్యూట్ అండ్ రఫ్ సిరీస్ ఇది.
చారిత్రక యుద్ధాలు, కత్తి సాములు పొలిటికల్ కుట్రలు ఇష్టపడేవారికి ఇది బెస్ట్ చాయిస్. ఇంగ్లాండ్‌ను ఏకం చేయడానికి సాగే పోరాటంలో కథానాయకుడు ఉట్రెడ్ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ‘గేమ్ ఆఫ్ త్రోన్స్’ స్థాయి యాక్షన్ ఇందులో చూడవచ్చు.
ప్రతి ఏటా ఒకే రోజు కలిసే ఇద్దరు ప్రేమికుల కథ. దశాబ్ద కాలంలో వాళ్ళ జీవితాలు ఎలా మారాయనేది చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. చివరిగా వచ్చే క్లైమాక్స్ ను మీరు అస్సలు ఊహించలేరు. ఈ సిరీస్‌లన్నీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఒక్కోటి ఒక్కో రకమైన అనుభూతిని ఇస్తాయి. ఒక్క ఎపిసోడ్ చూస్తే చాలు, మొత్తం పూర్తి చేసే వరకు నిద్రపోరు.
Read Also : వెంటాడే ఆత్మ… ప్రతి నిమిషం వెన్నులో వణుకు పుట్టించే హాస్పిటల్ హారర్ మిస్టరీ