E-Paper
Advertisement

వెంటాడే ఆత్మ… ప్రతి నిమిషం వెన్నులో వణుకు పుట్టించే హాస్పిటల్ హారర్ మిస్టరీ

వెంటాడే ఆత్మ… ప్రతి నిమిషం వెన్నులో వణుకు పుట్టించే హాస్పిటల్ హారర్ మిస్టరీ
Advertisement

Horror Thriller OTT : ఓటీటీలోకి ఏదో ఒక కంటెంట్ వస్తూనే ఉంది. వీటిలో హారర్ థ్రిల్లర్ సినిమాలను క్రేజీగా చూస్తున్నారు. దెయ్యాలు, ఆత్మలతో ఈ సినిమాలు ప్యాంట్లు తడిపిస్తుంటాయి. అలాంటి సినిమా గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఒక హాస్పిటల్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఈ కథలో అటు దయ్యాల భయం, ఇటు సస్పెన్స్ రెండూ ఉంటాయి. తన కొడుక్కి వచ్చిన వింత జబ్బును నయం చేయించడానికి వెళ్లిన ఒక తండ్రికి, అక్కడ ఊహించని భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. కేవలం దయ్యం సీన్లే కాకుండా, మెడికల్ ఫీల్డ్‌లో జరిగే కొన్ని చీకటి దందాలను కూడా ఈ సినిమాలో చూపించారు. పిల్లాడిని కాపాడుకోవడానికి తండ్రి చేసే పోరాటం, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు సినిమాకు హైలైట్ గా నిలిచాయి.

ప్రైమ్ వీడియో(Prime Video) లో స్ట్రీమింగ్

2021లో వచ్చిన ఈ మరాఠీ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘బలి’ (Bali). విశాల్ ఫురియా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆయన గతంలో లపాఛపి (Lapachhapi) అనే సూపర్ హిట్ హారర్ సినిమాను తీశారు. దానినే హిందీలో చోరీ (Chhorii) గా రీమేక్ చేశారు. మరాఠీ స్టార్ హీరో స్వప్నిల్ జోషి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. ఆయన సుమారు రెండు దశాబ్దాల కెరీర్‌లో చేసిన మొదటి హారర్ సినిమా ఇది. ఇందులో పూజా సావంత్ డాక్టర్‌గా కీలక పాత్రలో నటించింది. GSEAMS బ్యానర్‌పై అర్జున్ సింగ్ బరన్, కార్తీక్ నిషాందర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మొత్తం 103 నిమిషాల పాటు సాగుతుంది. ఇది కరోనా కారణంగా థియేటర్లలో విడుదల కాకుండా, నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video) లో 2021 డిసెంబర్ 9న విడుదలైంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

శ్రీకాంత్ అనే ఒక సాదాసీదా మధ్యతరగతి తండ్రికి తన ఏడేళ్ల కొడుకు మందార్ అంటే ప్రాణం. ఒకరోజు ఆ పిల్లాడు ఉన్నట్టుండి పడిపోతే, హడావిడిగా ఒక పాత హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. అయితే ఆ హాస్పిటల్ చూడటానికి మామూలుగా ఉన్నా, దాని వెనక ఏదో గూడుపుఠాణి జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఆ పిల్లాడు ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే, అక్కడ ఎవరికీ కనిపించని ‘ఎలిజబెత్’ అనే ఒక నర్సుతో మాట్లాడుతున్నానని చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. హాస్పిటల్‌లో ఆ ఎలిజబెత్ అనే నర్సు ఒక పాడుబడ్డ గదిలో ఉంటుందని, ఆమె చనిపోయిన పిల్లల ఆత్మలతో ఆడుకుంటుందని తెలిసి శ్రీకాంత్ గుండె ఆగిపోయినంత పని అవుతుంది.

ఆ పిల్లాడు రోజురోజుకూ వింతగా ప్రవర్తిస్తుంటే, అసలు ఆ నర్సు ఎవరు? ఆమెకి ఈ హాస్పిటల్‌కి ఉన్న పాత సంబంధం ఏంటి? అన్నది తెలుసుకోవడానికి శ్రీకాంత్ తన ప్రాణాలకు తెగించి రంగంలోకి దిగుతాడు. ఆ ఆసుపత్రి గదుల్లో వినిపించే ఏడుపులు, చీకటి మలుపులు చూస్తుంటే పక్కా భయం పుట్టిస్తుంది. చివరికి ఆ నర్సు వెనుక ఉన్న ఒక భయంకరమైన నిజాన్ని శ్రీకాంత్ తెలుసుకుంటాడు. డాక్టర్లు చేసే దారుణాల వల్ల చనిపోయిన వాళ్ల ఆత్మలు ప్రతీకారం తీర్చుకుంటున్నాయని అర్థమవుతుంది. ఇక తన కొడుకుని ఆ దయ్యం నుండి ? హాస్పిటల్ మాఫియా నుండి ? శ్రీకాంత్ ఎలా బయట పడేశాడు అనేదే క్లైమాక్స్. గజగజ వణికించే సీన్లతో సినిమా మొత్తం ఒక రేంజ్‌లో సాగుతుంది.

Advertisement

Read Also : హత్య కేసులో బోలెడు అనుమానాలు… కూతురిని కూడా అనుమానించే తండ్రి… నరాలు తెగే ఉత్కంఠ

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×