E-Paper
Advertisement

నల్గొండకు మహర్థశ.. హలీయా మీదుగా విజయవాడకు గ్రీన్ ఫీల్డ్ హైవే..!

నల్గొండకు మహర్థశ.. హలీయా మీదుగా విజయవాడకు గ్రీన్ ఫీల్డ్ హైవే..!
Advertisement

Nalgonda: స్వేచ్ఛ బ్యూరో: నల్గొండ జిల్లా ప్రజలకు ఉపాధి అవకాశాలు, ఈ ప్రాంత సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా జిల్లాలోని మిర్యాలగూడ తో పాటు ఇతర ప్రాంతాలను ఇండస్ట్రియల్ హబ్ గా మారుస్తామని రాష్ట్ర ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ తో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.

ఆ ప్రాంతంలో డ్రైపోర్ట్ ఏర్పాటు..

భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా హై స్పీడ్ ట్రైన్లు, నేషనల్ హైవేలు, డ్రై పోర్ట్, గ్రీన్ ఫీల్డ్ హైవేల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ హైవే హాలియా మీదుగా విజయవాడకు వరకు నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తే ఇండస్ట్రియల్ అభివృద్ధికి ముందడుగు పడుతుందన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో రూ. 500 కోట్లతో ట్రైన్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తే లక్ష్యంగా కేంద్ర నుంచి నిధులు తెచ్చేందుకు ఢిల్లీకి వెళ్తున్నాడు అని చెప్పారు.

Advertisement

Also Read: CV Anand Telangana DGP: తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్

ఫ్లైఓవర్ల నిర్మాణం..

మిర్యాలగూడలో ఫ్లైఓవర్ల నిర్మాణం నిమిత్తం సంబంధిత కాంట్రాక్టర్లతో ఇప్పటికే చర్చలు చేశామని త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. హరీష్ రావు, కేటీఆర్ పనులు లేక ప్రజా ప్రభుత్వం పై అర్థరహితమైన విమర్శలకు దిగుతున్నట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పారు.

Advertisement

Also Read: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. పరిషత్ ఎన్నికలకు పచ్చజెండా.. వచ్చే నెలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోరు..!

Related News

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×