E-Paper
Advertisement

ఎన్నేళ్ళు గడిచినా ఇలాంటి వార్ మూవీస్ ఎప్పటికీ మర్చిపోలేం… ప్రతీ సినిమా ఒక అద్భుతమే

ఎన్నేళ్ళు గడిచినా ఇలాంటి వార్ మూవీస్ ఎప్పటికీ మర్చిపోలేం… ప్రతీ సినిమా ఒక అద్భుతమే
Advertisement

Best War Movies on OTT : యుద్ధం నేపథ్యంలో వచ్చే సినిమాలు ఎప్పుడూ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తాయి. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించడమే కాదు, ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ ఉండిపోయాయి. అలాంటి ఆరు క్లాసిక్ వార్ సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయో కూడా తెలుసుకుందాం.

1. ది డీర్ హంటర్ (1978)

ఈ సినిమా ఒక మాస్టర్ పీస్. వియత్నాం యుద్ధం ముగ్గురు స్నేహితుల జీవితాలను ఎలా ముక్కలు చేసిందనేది ఇందులో చూపించారు. ఇందులోని ‘రష్యన్ రూలేట్’ (తుపాకీతో ఆడే ప్రాణాల ఆట) సీన్లు చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించడమే కాకుండా 5 ఆస్కార్ అవార్డులను కోడా గెలుచుకుంది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో,, యాపిల్ టీవీలో స్ట్రీమింగ్ లో ఉంది.

2. హార్ట్‌బ్రేక్ రిడ్జ్ (1986)

Advertisement

క్లింట్ ఈస్ట్‌వుడ్ నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక ఊరమాస్ మిలిటరీ డ్రామా. రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న ఒక మెరైన్ సార్జెంట్, సరిగ్గా వినని కుర్రాళ్లను లైన్లోకి తెచ్చి ఒక పవర్‌ఫుల్ టీమ్‌గా ఎలా మార్చాడనేదే కథ. ఇందులో డైలాగులు, యాక్షన్ సీన్లు చాలా ఘాటుగా ఉంటాయి. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. యాపిల్ టీవీ, గూగుల్ ప్లే మూవీస్ లో ఇది రెంటల్ పద్దతిలో ఉంది.

3. ది పేట్రియాట్ (2000)

మెల్ గిబ్సన్ హీరోగా నటించిన ఈ సినిమా అమెరికన్ విప్లవం నేపథ్యంలో సాగుతుంది. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి యుద్ధానికి దూరంగా ఉండాలనుకున్న ఒక తండ్రి, బ్రిటిష్ సైన్యం తన కొడుకును చంపేసరికి ఎలా రౌద్రం ప్రదర్శించాడనేది కథ. ఇందులోని యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్స్ థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించాయి. బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు కొల్లగొట్టింది ఈ మూవీ. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది అందుబాటులో ఉంది.

4. రూల్స్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్ (2000)

Advertisement

ఇది సరిహద్దుల్లో జరిగే యుద్ధం కాదు, కోర్టు రూమ్‌లో జరిగే మైండ్ గేమ్. యెమెన్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై దాడి జరిగినప్పుడు, ప్రజలపై కాల్పులు జరపాల్సి వచ్చిన ఒక మిలిటరీ ఆఫీసర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అతడు చేసింది కరెక్టా కాదా అనే పాయింట్‌తో సాగే ఈ సినిమా ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్‌ను ఇస్తుంది. ఇది పారామౌంట్ ప్లస్, యాపిల్ టీవీలో అందుబాటులో ఉంది.

5. అమెరికన్ స్నైపర్ (2014)

అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన స్నైపర్ ‘క్రిస్ కైల్’ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇరాక్ యుద్ధంలో అతడు వందలాది మంది శత్రువులను ఎలా లేపేశాడు, ఆ యుద్ధం అతని జీవితాన్ని ఎలా నరకంగా మార్చిందనేది కళ్లకి కట్టినట్లు చూపించారు ఇందులో. బ్రాడ్లీ కూపర్ నటన మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. జియో సినిమా, యాపిల్ టీవీలో ఇది అందుబాటులో ఉంది.

6. ది గ్రీన్ బెరెట్స్ (1968)

జాన్ వేన్ నటించిన ఈ సినిమా వియత్నాం యుద్ధం జరుగుతున్న సమయంలోనే విడుదలై సంచలనం సృష్టించింది. అమెరికా స్పెషల్ ఫోర్సెస్ శత్రువుల గుండెల్లో ఎలా వణుకు పుట్టించాయో ఇందులో మాస్ స్టైల్లో చూపించారు. అప్పట్లో ఈ సినిమాకు జనాలు బ్రహ్మరథం పట్టారు, కలెక్షన్ల సునామీ కూడా సృష్టించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో, గూగుల్ ప్లే లో ఇది రెంటల్ లో ఉంది. ఈ సినిమాలు రక్తం చిందించే యాక్షన్ మాత్రమే కాదు, యుద్ధం వెనుక ఉన్న పెయిన్‌ను కూడా చూపిస్తాయి. ఇప్పటివరకు చూడకపోతే మాత్రం వెంటనే ఓటీటీల్లో ఓ లుక్ వేయండి.

Read Also : వైట్ హౌస్ లో జరిగిన హై ప్రొఫైల్ హత్య.. 157 మంది అనుమానితులతో కేసును ఛేదించే లేడీ డిటెక్టివ్

Related News

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

అడవి నేపథ్యంలో ఊపిరి బిగబట్టించే వేట… రక్తం ఉడికించే మలయాళం సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్

ఒలింపిక్స్ వివాదం వెనుక అసలు కథ… 6.2 రేటింగ్ ఉన్న మైండ్ బెండింగ్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×