E-Paper
Advertisement

జైలు నుంచే క్రైమ్స్ సాల్వ్ చేసే ఖైదీ… నాలుగు ఎపిసోడ్లతో బుర్ర హీటెక్కిస్తున్న కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

జైలు నుంచే క్రైమ్స్ సాల్వ్  చేసే  ఖైదీ… నాలుగు ఎపిసోడ్లతో బుర్ర హీటెక్కిస్తున్న కిరాక్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Crime Thriller Series on OTT: క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ ను ఓటీటీలో ఎక్కవచూసేందుకు ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. డిఫరెంట్ కంటెంట్ కనిపిస్తే అస్సలు వదలటం లేదు. మేకర్స్ కూడా ఆడియన్స్ కు తగ్గట్టు రకరకాల ప్రయోగాలతో ముందుకు వస్తున్నారు. ఆ ప్రయోగంలో భాగంగా ఓ క్రైమ్ థ్రిల్లర్ మంచ్ సక్సెస్ రేటును పొందింది. ఇది ప్రతి నిమిషం ఉత్కంఠను కలిగిస్తుంది. ఇందులో మర్డర్ మిస్టరీతో పాటు విచిత్రమైన పరిస్థితుల వల్ల పుట్టే ‘డార్క్ హ్యూమర్’ కూడా ఉంటుంది. పరిస్థితులు బాగోలేకపోతే ఒక మంచి వ్యక్తి కూడా ఎలాంటి ఘోరమైన క్రైమ్ చేయడానికి సిద్ధపడతాడో ఈ సిరీస్‌లో చాలా వేగవంతమైన స్క్రీన్‌ప్లేతో చూపించారు.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ 

2022లో నాలుగు ఎపిసోడ్‌లతో వచ్చిన ఈ బ్రిటిష్ క్రైమ్ థ్రిల్లర్ మినీ సిరీస్ పేరు ‘ఇన్‌సైడ్ మ్యాన్’ (Inside Man). దీనిని ప్రముఖ రచయిత స్టీవెన్ మోఫాట్ రూపొందించారు. ఈయన గతంలో ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించిన ‘షెర్లాక్’ (Sherlock), ‘డాక్టర్ హూ’ (Doctor Who) వంటి మైండ్-బ్లోయింగ్ సిరీస్‌లను అందించినందుకు మంచి గుర్తింపు పొందారు. ఇందులో హాలీవుడ్ ప్రముఖ నటులు స్టాన్లీ టుస్సీ, డేవిడ్ టెన్నెంట్ ప్రధాన పాత్రలు పోషించారు. దీనిని బిబిసి వన్ (BBC One), నెట్‌ఫ్లిక్స్ (Netflix) కలసి నిర్మించాయి. కేవలం 4 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్న ఈ డార్క్ క్రైమ్ థ్రిల్లర్‌కు డేవిడ్ ఆర్నాల్డ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కథలోని సస్పెన్స్‌ను మరింతగా పెంచింది. ఈ సిరీస్ ఐయండిబిలో 7.0/10 రేటింగ్ ను కూడా పొందింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

‘ఇన్‌సైడ్ మ్యాన్’ (Inside Man) అనేది నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న ఒక మైండ్ బ్లోయింగ్ బ్రిటిష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. పరిస్థితులు బాగోలేకపోతే, ఎంతటి మంచివాడైనా సరే క్రైమ్ చేయడానికి వెనుకాడనే కాన్సెప్ట్‌తో కేవలం 4 ఎపిసోడ్లతో ఈ కథ సాగుతుంది. ఇందులో ఒకవైపు అమెరికా జైల్లో తన భార్యను చంపిన నేరానికి ఉరిశిక్ష పడి, చావు కోసం వెయిట్ చేసే ఒక తెలివైన ప్రొఫెసర్ ఉంటాడు. అతను జైల్లోనే ఉంటూ బయటవాళ్ల మైండ్స్ రీడ్ చేస్తూ కొన్ని మర్డర్ మిస్టరీలను కూడా సాల్వ్ చేస్తుంటాడు.

మరోవైపు ఇంగ్లాండ్‌లో అందరికీ మంచి చేసే ఒక చర్చి ఫాదర్ ఉంటాడు. ఒకరోజు తన కొడుకును ఒక పెద్ద తప్పు నుండి కాపాడబోయి, అనుకోకుండా తానే ఒక పెద్ద తప్పులో ఇరుక్కుపోతాడు. ఆ గందరగోళంలో తన కొడుక్కి పాఠాలు చెప్పే ట్యూషన్ టీచర్‌ను ఇంట్లోనే బంధించాల్సి వస్తుంది. ఒక చిన్న అబద్ధం వల్ల ఆ ఫాదర్ జీవితం ఎలా నరకంగా మారింది ? అటు అమెరికా జైల్లో ఉన్న ప్రొఫెసర్‌కి ఈ కేసుకు సంబంధం ఏంటి ? అనేది చాలా సస్పెన్స్‌గా చూపించారు ఇందులో.

Advertisement

Read Also : థియేటర్లలో పాటు ఓటీటీలను షేక్ చేసిన దమ్మున్న సినిమాలు… వీటి క్లైమాక్స్ తో పూనకాలు పక్కా

Tags

Related News

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

వచ్చేవారం నెట్ ఫ్లిక్స్ లో 3 సినిమాలు.. ఆ 2 మస్ట్ వాచ్!

అందరూ తక్కువ అంచనా వేసే లాయర్‌… కోర్టులో ఆమె వాదనలు వింటే మైండ్‌ బ్లాక్‌… మెంటలెక్కించే లీగల్‌ డ్రామా

Big Stories

Advertisement
×