E-Paper
Advertisement

యుద్ధం అంటేనే భయం పుట్టించే సినిమాలు… వీటిని చూశాక మాటలు ఉండవు

యుద్ధం అంటేనే భయం పుట్టించే సినిమాలు… వీటిని చూశాక మాటలు ఉండవు
Advertisement

Best War Movies on OTT : ఓటీటీ ప్రియుల్లో వార్ డ్రామాలంటే స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అందులో ఉండే యాక్షన్, స్టంట్స్, ఎమోషన్స్, సస్పెన్స్ ఆడియన్స్ కు తెగ ఆకట్టుకుంటాయి. ఇలాంటి సినిమాలను ఇష్టపడే వారి కోసమే బెస్ట్ వార్ డ్రామాలను మీ కోసం తీసుకొచ్చాము. మరి ఈ అదిరిపోయే వార్ మూవీస్ ను ఎక్కడ చూడవచ్చు ? అసలు ఆ సినిమాలేంటి ? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

When Trumpets Fade (1998) – JioHotstar

రెండవ ప్రపంచ యుద్ధం నాటి ‘బాటిల్ ఆఫ్ హర్ట్‌జెన్ ఫారెస్ట్’ నేపథ్యంలో సాగే కథే ‘వెన్ ట్రంపెట్స్ ఫేడ్’. తోటి సైనికులంతా చనిపోతున్నా, బతకాలనే ఆశతో పోరాడే ఒక ప్రైవేట్ సైనికుడి చుట్టూ తిరిగే కథ ఇది.

The Siege of Jadotville (2016) – Netflix

Advertisement

యదార్థ గాథ ఆధారంగా రూపొందిన మూవీ ‘ది సీజ్ ఆఫ్ జాడోట్‌విల్లే’. 1961లో కాంగోలో ఐక్యరాజ్యసమితి శాంతిభద్రతల కోసం 150 మంది ఐరిష్ సైనికులు వెళతారు. వారిని ఫ్రెంచ్ – బెల్జియం కిరాయి సైనికుల నేతృత్వంలోని 3,000 మంది స్థానిక దళాలు చుట్టుముడతాయి. ఎటువంటి సహాయం అందకపోయినా ఆ ఐరిష్ సైనికులు ఐదు రోజుల పాటు చేసిన వీరోచిత పోరాటాన్ని ఇందులో కళ్ళకు కట్టినట్టు చూపించారు.

Anthropoid (2016) – ప్రైమ్ వీడియో

నిజ జీవిత చారిత్రక సంఘటన ఆధారంగా తెరకెక్కిన మూవీ ‘ఆంత్రోపోయిడ్’. నాజీ జర్మనీలో హిట్లర్ తర్వాత అత్యంత ప్రమాదకరమైన లీడర్ ‘రీన్‌హార్డ్ హేడ్రిచ్’. రెండవ ప్రపంచ యుద్ధంలో అతన్ని హతం చేయడానికి ఇద్దరు చెక్ సైనికులు చేసిన ఆపరేషన్ ను ఇందులో చూపించారు.

The Beast (1988) – ప్రైమ్ వీడియో

Advertisement

సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధం నేపథ్యంలో సాగే మూవీ ‘ది బీస్ట్’ (The Beast of War). ఆఫ్ఘనిస్తాన్ లోయలలో దారి తప్పి చిక్కుకుపోతుంది రష్యన్ ట్యాంక్ (T-55). అందులోని క్రూరమైన కమాండర్ తో పాటు అతని సైనికులను ముజాహిదీన్ తిరుగుబాటుదారులు ఎలా వేటాడారనేది ఈ సర్వైవల్ వార్ డ్రామాలో చూడవచ్చు.

Eye in the Sky (2015) – ప్రైమ్ వీడియో

ఇదొక గ్రిప్పింగ్ మిలిటరీ థ్రిల్లర్. ఆధునిక డ్రోన్ యుద్ధాల (Drone warfare) నేపథ్యంలో సాగే కథ. కెన్యాలో దాక్కున్న భయంకరమైన ఉగ్రవాద ముఠాపై డ్రోన్ ద్వారా బాంబు దాడి చేయడానికి బ్రిటీష్ కల్నల్ కాథరిన్ పావెల్ వేసే ప్లాన్ ను అద్భుతంగా చూపించారు. మధ్యలో వచ్చిన చిన్న పాప ప్రాణాన్ని కాపాడాలా ? లేక దేశాన్ని ముంచే ఉగ్రవాదులను చంపాలా ? అనే పాయింట్‌తో ఆసక్తికరంగా సాగుతుంది.

Read Also : తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకునే కొడుకు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

Related News

ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రభాస్ ఫ్లాప్ మూవీ!

21 కోట్ల కోసం బ్లడీ డేంజరస్ డెత్ గేమ్… క్లైమాక్స్ కిరాక్ మావా

25 ఏళ్ల సీక్రెట్ లవ్ తెచ్చిన చిక్కులు… రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్

నడిసంద్రంలో కొట్టుమిట్టాడే 23000 ప్రాణాలు… మస్ట్ వాచ్ సోషల్ ఇష్యూ డ్రామా

రాజభవనంలోని వాళ్ళని వెంటాడే మిస్టీరియస్ శాపం… క్రేజీ కొరియన్ డార్క్ ఫాంటసీ థ్రిల్లర్

అక్కకు రక్తం ధారబోయడానికే పుట్టాను అనుకునే అమాయకురాలు… హార్ట్ టచింగ్ సిరీస్

ఇంగ్షీషు వోవెల్స్ తో సాగే కథ… ఓటీటీలోకి వచ్చిన తమిళ రొమాంటిక్ ఆంథాలజీ

యువరాణులందరినీ ఉంపుడుగత్తెలుగా మార్చుకోవాలనుకునే రాజు… హై ఆక్టేన్ యాక్షన్ అడ్వెంచర్

Big Stories

Advertisement
×