E-Paper
Advertisement

Horror Comedy OTT : పెళ్ళాం పోయాక సంతోషపడే మొగుడు… చచ్చినా వదలని ఆత్మ… క్లైమాక్స్ వరకు నవ్వులే

Horror Comedy OTT : పెళ్ళాం పోయాక సంతోషపడే మొగుడు… చచ్చినా వదలని ఆత్మ… క్లైమాక్స్ వరకు నవ్వులే
Advertisement

Horror Comedy OTT : ఇటు హారర్, అటు ఫుల్ కామెడీతో ఓ మరాఠీ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం ఒక ప్రేమకథ మాత్రమే కాదు, కడుపుబ్బా నవ్వించే హారర్ స్టోరీ కూడా. ఓ భర్తని చనిపోయిన భార్య ఆత్మ ముప్పతిప్పలు పెడుతుంది. ఈ సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయి. వీకెండ్ ఫ్యామిలీతో కలసి ఈ సినిమాను ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చు. మరి ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

మరాఠీ రొమాంటిక్ కామెడీ సినిమా పేరు ‘బెటర్ హాఫ్ ఛీ లవ్ స్టోరీ’ (Better Half Chi Love Story). గత ఏడాది థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా 2025 సెప్టెంబర్ 19 నుంచి Ultra Jhakaas అనే ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇందులో సుబోధ్ భావే, రింకూ రాజ్‌గురు, ప్రార్థన బెహేరే, అనికేత్ విశ్వాసరావు లీడ్ రోల్స్ లో నటించారు. సంజయ్ అమర్ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ చాలా వెరైటీగా ఉంటుంది. అజయ్ పాటిల్ (సుబోధ్ భావే) ఒక మంచి కాపీ రైటర్. కానీ అతని భార్య సోనియా (రింకూ రాజ్‌గురు)కి భర్త మీద విపరీతమైన అనుమానం ఉంటుంది. తన బాస్ మోనాతో అజయ్‌కి అఫైర్ ఉందేమోనని ఆమె ఎప్పుడూ గొడవ పడుతుంటుంది. దీంతో అజయ్ విసిగిపోతాడు. ఒక రోజు ఇలాంటి గొడవలోనే సోనియా పొరపాటున చనిపోతుంది. అయితే అజయ్ తనకి సమస్య వదిలిపోయింది అనుకుంటాడు. కానీ స్టోరీలో అక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది.

చనిపోయిన సోనియా ఆత్మ అజయ్ శరీరంలోకి ప్రవేశించి, అతని శరీరంలో సగం భాగాన్ని తన కంట్రోల్‌లోకి తీసుకుంటుంది. అంటే ఒకే శరీరంలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉండాల్సి వస్తుంది. అజయ్ వేరే అమ్మాయితో ప్రేమలో పడాలని చూసినప్పుడల్లా, అతని లోపలే ఉన్న భార్య ఆత్మ అతన్ని ఎలా ముప్పతిప్పలు పెట్టింది. ఈ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి కూడా. మరి చివరికి అజయ్ తన భార్య ఆత్మ నుంచి విముక్తి పొందాడా ? మరో అమ్మాయి ప్రేమ సంగతి ఏమవుతుంది ? ఈ కథ ఎలాంటి ముగింపు ఇస్తుంది ? అనే విషయాలను మాత్రం ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : అమ్మాయిల్ని హింసించి చంపే కిల్లర్… చచ్చాక బట్టల్లేకుండా బయట పడేసే క్రూరత్వం… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×