E-Paper
Advertisement

OTT Movie : చదువు కోసం వెళ్లి శవంగా తిరిగొచ్చే అమ్మాయి… గుండెను పిండేసే తమిళ థ్రిల్లర్

OTT Movie : చదువు కోసం వెళ్లి శవంగా తిరిగొచ్చే అమ్మాయి… గుండెను పిండేసే తమిళ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఓటీటీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కి వేదికగా మారిపోయింది. ప్రపంచంలో ఏ మూలనైనా, ఏ భాషలోనైనా వస్తున్న సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి. ఇక ఆడియన్స్ కూడా ఇంట్లోనే తాపీగా ఈ సినిమాలను చూస్తూ ఆనందిస్తున్నారు. ఇక టాలీవుడ్ ప్రేక్షకులు హిందీ, మలయాళం, తమిళ సినిమాలపై ఓ కన్ను వేసి ఉంచుతున్నారు. ఇంట్రస్టింగ్ గా ఏ సినిమా అనిపించినా, భాషతో సంభంధం లేకుండా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఒక తమిళ యాక్షన్ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఈ కథ ఒక మారుమూల గ్రామంలో డాక్టర్ అవ్వాలని కలలు కనే అన్నా చెల్లెళ్ల చుట్టూ తిరుగుతుంది. చెల్లెలు చనిపోవడంతో స్టోరీ రివేంజ్ మోడ్ లోకి వెళ్తుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘భోగీ’ (Bhoghee) 2025లో విడుదలైన తమిళ యాక్షన్ సినిమా. ఇది ఎస్. విజయశేఖరన్ దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమా 2025 ఆగస్ట్ 1న థియేటర్లలో విడుదలైంది.1 గంట 53 నిమిషాల నిడివితో ఐయండిబిలో 8.4/10 రేటింగ్ ని పొందింది. ఇందులో నాబీ నంతి, స్వాసిక విజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2025 నవంబర్ 14 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అళగర్ అనే ఒక యువకుడు తమిళనాడులోని ఒక మారుమూల కొండ గ్రామంలో నివసిస్తూ ఉంటాడు. ఆ ప్రాంతం సముద్ర మట్టానికి 6000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆ గ్రామంలో కనీస వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో లేకపోవడంతో, అళగర్ తన చెల్లెలు కవితను డాక్టర్ చేయాలని కలలు కంటాడు. కవిత కూడా అన్న కల నెరవేర్చడానికి పట్టుదలతో చదువుతుంది. ప్రతిరోజూ ఎన్నో మైళ్లు నడిచి పాఠశాలకు వెళ్లే కవిత, చదువులో అత్యంత ప్రతిభ కనబరుస్తుంది. ఆమె కష్టానికి తగ్గ ఫలితం కూడా దక్కుతుంది. ఆమెకు ఒక మెడికల్ కాలేజీలో సీటు లభిస్తుంది. ఇక వీళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి.

Read Also :  40 ఏళ్ళు దాటినా పెళ్లి కాని ప్రసాద్… కడుపుబ్బా నవ్వించే మలయాళ కామెడీ డ్రామా

Advertisement

కవిత ఉన్నత చదువుల కోసం చెన్నై నగరానికి వెళ్లినప్పుడు కథ విషాద మలుపు తిరుగుతుంది. దురదృష్టవశాత్తు, కవిత కలలు చెల్లా చెదురైపోతాయి. ఆమె ఒక శవపేటికలో తన గ్రామానికి తిరిగి వస్తుంది. ఆమెను అత్యంత కిరాతకంగా చంపి ఉంటారు. ఒక్క సారిగా ఆమె అన్న అళగర్ కుప్ప కూలిపోతాడు. ఈ దుస్థితికి కారణమైన వాళ్ళపై రివేంజ్ తీర్చుకోవడానికి వెళ్తాడు. క్లైమాక్స్ రివేంజ్ మోడ్ లో ఉత్కంఠంగా నడుస్తుంది. అసలు నగరంలో కవితకు ఏమి జరిగింది ? ఆమె మరణానికి కారణం ఎవరు ? అళగర్ రివేంజ్ తీర్చుకుంటాడా ? అనే ప్రశ్నలకు సమాధానాలను, ఈ తమిళ యాక్షన్ సినిమాని చూసి తెలుసుకోండి.

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×