E-Paper
Advertisement

Rohit Sharma: మ‌రో 6 కిలోలు త‌గ్గిన రోహిత్ శ‌ర్మ‌..వ‌న్డే కెప్టెన్ గా ప్ర‌మోష‌న్ ?

Rohit Sharma: మ‌రో 6 కిలోలు త‌గ్గిన రోహిత్ శ‌ర్మ‌..వ‌న్డే కెప్టెన్ గా ప్ర‌మోష‌న్ ?
Advertisement

Rohit Sharma:  టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) చాలా స్లిమ్ గా అవుతున్నాడు. రోజు రోజుకు బరువు తగ్గిపోతున్నాడు. 2027లో జరగబోయే వన్డే ప్రపంచ కప్ టోర్నమెంటులో ఎలాగైనా స్థానం సంపాదించాలన్న కసితో రోహిత్ శర్మ దూసుకు వెళ్తున్నట్లు స్పష్టమవుతోంది. గంటల తరబడి ప్రాక్టీస్, బరువు తగ్గడం, నిత్యం సాధన చేయడం లాంటివి చేస్తూ సూపర్ హీరోల మారిపోయాడు రోహిత్ శర్మ. ఈ నేపథ్యంలోనే తాజాగా రోహిత్ శర్మ మరోసారి బరువు తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 5 నుంచి 6 కిలోలు మరోసారి రోహిత్ శర్మ తగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఫోటో అలాగే వీడియో వైరల్ గా మారింది.

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

మరోసారి ఆరు కిలోలు తగ్గిన రోహిత్ శర్మ

Advertisement

టీమిండియా మాజీ వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి 5 నుంచి 6 కిలోలు తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి. మొన్న ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన వన్డే సిరీస్ కంటే ముందు ఏకంగా 11 కిలోలు తగ్గిపోయాడు రోహిత్ శర్మ. టీమిండియాలో ఆడాలంటే కొత్త తరహా పరీక్షలు నిర్వహిస్తుంది బీసీసీఐ. అయితే దానికి తగ్గట్టుగా రోహిత్ శర్మ కూడా బరువు తగ్గుతున్నాడు. ఇలాంటి టెస్టులు పెట్టిన పాస్ అయ్యేలా బరువు తగ్గడమే కాకుండా అదిరిపోయే ఫిట్నెస్ తో దూసుకు వెళ్తున్నాడు. తనకు ఇష్టమైన వడపావు ( Vada pav)  కూడా మానేసి తన ఫిట్నెస్ పైన ఫోకస్ చేశాడు. దీంతో ఇటీవల కాలంలో 11 కిలోలు తగ్గిన రోహిత్ శర్మ తాజాగా మరో ఆరు కిలోలు తగ్గాడట. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు బయటకు వచ్చాయి. ఇది చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. రోహిత్ శర్మ నువ్వు గ్రేట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

టీమిండియా వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మ

గిల్ ( Shubman Gill) కెప్టెన్సీలో టీమ్ ఇండియాకు పెద్దగా విజయాలు దక్కడం లేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అటు భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI) కూడా ఇదే విషయాన్ని గ్రహించిందట. దీంతో టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ గా మళ్ళీ రోహిత్ శర్మకు అవకాశం ఇవ్వాలనే దానిపైన ఆలోచన చేస్తున్నారట బీసీసీఐ పెద్దలు. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మకు బాధ్యతలు ఇచ్చి ఆ తర్వాత కొత్త కెప్టెన్ నే నియమించాలని బోర్డులో కొంత మంది సభ్యులు సూచనలు చేస్తున్నారట. అనవసరంగా గౌతమ్ గంభీర్ మాట విని గిల్ కు కెప్టెన్సీ ఇచ్చినట్లు ఇప్పుడు బాధపడుతున్నారట బీసీసీఐ ( B C CI) పెద్దలు. మ‌రి యూట‌ర్న్ తీసుకుని, రోహిత్ శ‌ర్మకు కెప్టెన్సీ ఇస్తారా? లేదా ? చూడాలి.

Advertisement

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

 

 

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×