OTT Movie : మలయాళ సినిమాలను చూసేందుకు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు ప్రేక్షకులు. ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఈ స్టోరీలు వస్తున్నాయి. ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో గత ఏడాది ఓ మలయాళం సినిమా వచ్చింది. ఇది పెళ్ళికాని ఓ నలభై ఏళ్ళ వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. కడుపుబ్బా నవ్వించే ఈ సినిమా, ఆలస్యంగా వివాహం చేసుకునే యువకుల మానసిక స్థితిని చూపిస్తుంది. దీనిని ఫ్యామిలీతో కలసి ఎంచక్కా చూసేయచ్చు. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘వయస్సెత్రయాయి? ముప్పతీ’ (Vayasethrayaayi Muppathi) 2024లో విడుదలైన మలయాళం కామెడీ ఎంటర్టైనర్ సినిమా. ఇది పాప్పాన్ టి. నంబియార్ డైరెక్టర్ డెబ్యూ ఫిల్మ్. ఈ సినిమా 2024 మార్చి 29న కేరళలో థియేటర్లలో విడుదలైంది. ఇందులో సినిమా ప్రసాంత్ మురళి ప్రధాన పాత్రలో నటించారు. 2 గంటల 2 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 5.4/10 రేటింగ్ పొందింది. 2024 జులై 19 నుంచి Saina Play ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : గ్రామంలో వరుస హత్యలు… 20 ఏళ్ళ తరువాత సేమ్ సీన్ రిపీట్… ట్విస్టులతో పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్
బ్రజేష్ అనే 40 ఏళ్ల నిరుద్యోగ యువకుడి ప్రధాన లక్ష్యం పెళ్లి చేసుకోవడం ఒక్కటే. కానీ అది అంత ఈజీ గా జరగదు. ఆ వయసులో ఇంకా పెళ్లి కాలేదని అందరూ ఎగతాళి చేస్తుంటారు. బంధువులు పెట్టే ఒత్తిడికి బ్రజేష్ నిత్యం చుక్కలు చూస్తుంటాడు. ఒక పక్క తన స్నేహితులు, తోటివారు ఇప్పటికే స్థిరపడి భార్యాలతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటే, బ్రజేష్ మాత్రం ఇంకా సరైన వధువు కోసం వెతుకులాటలోనే ఉంటాడు. ప్రతి పెళ్లి సంబంధం ఏదో ఒక కారణంతో చివరి నిమిషంలో చెడిపోతుంటుంది. కొన్నిసార్లు అతని వయస్సు సమస్యగా మారుతుంది. కొన్నిసార్లు అతని ఆర్థిక పరిస్థితి, ఇతర చిన్న చిన్న కారణాలు అడ్డుతగులుతాయి. ఈ నిరాశ, ఒత్తిడి మధ్య బ్రజేష్ చేసే ప్రయత్నాలు, అతను ఎదుర్కొనే విచిత్రమైన పరిస్థితులు ప్రేక్షకులను నవ్విస్తాయి. చివరికి బ్రజేష్ తన జీవిత భాగస్వామి దొరుకుతుందా ? అతని కలలు నెరవేరాయా ? అనేది ఈ సినిమా క్లైమాక్స్ ని చూసే వరకు తెలీదు. మీరు తెలుసుకోవాలనుకుంటే, ఈ మలయాళం సినిమా మీద ఓ కన్ను వేయండి.