E-Paper
Advertisement

OTT Movie : హాంటెడ్ హౌస్ లో మోడ్రన్ భూతాలు… సినిమా డైరెక్టర్ తో మంతనాలు… వాటి జోలికెళ్తే దబిడి దిబిడే

OTT Movie : హాంటెడ్ హౌస్ లో మోడ్రన్ భూతాలు… సినిమా డైరెక్టర్ తో మంతనాలు… వాటి జోలికెళ్తే దబిడి దిబిడే
Advertisement

OTT Movie : బెంగాలీ సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ గా ఒక హారర్ కామెడీ సినిమా నిలిచింది. ఇది బెంగాలీ సినిమాల్లో కల్ట్ క్లాసిక్ గా పేరు కూడా తెచ్చుకుంది. ఈ కథ కోల్‌కతాలో ఒక పాత హాంటెడ్ హౌస్‌ని డెమాలిష్ చేయడానికి రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ట్రై చేస్తారు. అయితే అక్కడి భూతులు తమ రెస్టింగ్ ప్లేస్ కాపాడుకోవడానికి కామికల్ ప్లాన్స్ వేస్తారు. దీంతో ఈ స్టోరీ సూపర్‌ న్యాచురల్ కామెడీతో కేక పెట్టిస్తుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2012లో విడుదలైన ఈ బెంగాలీ హారర్ కామెడీ సినిమా పేరు ‘భూత భవిష్యత్’ (Bhooter Bhabishyat). అనిక్ దత్త ( మీర్ జాఫర్, అప్పూ జం ఫేమ్) దీనికి దర్శకత్వం వహించారు. జాయ్ గంగూలీ దీనిని నిర్మించారు. ఇందులో పారమ్‌బ్రత చట్టోపాధ్యాయ్, స్వస్తికా ముఖర్జీ, సబ్యసాచి చక్రవర్తి, సమదర్శి దత్త దేవాలి కొల్కార్ లీడ్ రోల్స్ లో నటించారు. 2 గంటల 30 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 8.1/10 రేటింగ్ పొందింది. 2012 మార్చి 14న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం hoichoi, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అయన్ సేన్‌గుప్తా అనే దర్శకుడు తన సినిమా షూటింగ్ కోసం ఒక పాడుబడిన పాత భవనాన్ని వెతుకుతూ ఉంటాడు. అనుకోకుండా అతనికి బిప్లబ్ దాస్‌గుప్తా అనే వ్యక్తి తారసపడతాడు. అతను ఒక ఒక పాడుబడిన ఒక భవనం గురించి, ఆ భవనంలో నివసిస్తున్న విచిత్రమైన దెయ్యాల గుంపు ఒక ఆసక్తికరమైన కథను చెబుతాడు. ఆ కథ ఏమిటంటే, ఒకప్పుడు ఆ భవనం రాజుల పాలనలో కళకళ లాడిందని. అనులో చివరి యజమాని ఆత్మ అక్కడ ఉండేదని, ఆ తర్వాత వివిధ కాలాలకు చెందిన ఇతర దెయ్యాలు అక్కడికి వచ్చి స్థిరపడ్డాయని తెలుస్తుంది. ఈ దెయ్యాలలో బ్రిటిష్ రాజ్ అధికారి, సినిమా నటి, కమ్యూనిస్ట్, కార్గిల్ యుద్ధంలో అమరుడైన కల్నల్ వంటి విభిన్న నేపథ్యాల వాళ్ళు ఉంటారు. వారంతా మొదట్లో ఒకరినొకరు ఇష్టపడకపోయినా, చివరికి స్నేహితులుగా మారి ఆ భవనాన్ని తమ ఏకైక నివాసంగా భావిస్తారు.

Read Also : ఈ ఏడాది గూగుల్‌లో మోస్ట్ సెర్చ్డ్ టాప్ 10 మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?

అయితే ఈ దెయ్యాల ప్రశాంతమైన జీవితాన్ని ఒక దురాశపరుడైన రియల్ ఎస్టేట్ వ్యాపారి కారణంగా ప్రమాదంలో పడుతుంది. ఆ వ్యాపారి ఆ చారిత్రక భవనాన్ని కూల్చివేసి, దాని స్థానంలో ఒక ఆధునిక షాపింగ్ మాల్‌ నిర్మించాలని ప్లాన్ చేస్తాడు. తమ ఏకైక ఆవాసాన్ని కోల్పోవాల్సి వస్తుందని తెలుసుకున్న దెయ్యాలన్నీ కలిసి, బిల్డర్లను భయపెట్టి, ఆ భవనాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటాయి. ఇప్పుడు అయన్ ఆ బంగ్లాలోకి వెళ్ళి ఆ ఆత్మలని కలుస్తాడు. వాటి సమస్యల గురించి ఒక సినిమా తెయమని అవి ప్రాధేయ పడతాయి. తమ సమస్యలు ప్రపంచానికి తెలపాలనుకుంటాయి. చివరకు దెయ్యాలు తమ లక్ష్యాన్ని సాధిస్తాయా ? ఆ భవనాన్ని కూల్చివేయకుండా కాపాడటంలో సఫలమవుతాయా ? అయన్ వీటి మీద సినిమా తీస్తాడా ? అనే విషయాలను, ఈ హారర్ కామెడీ సినిమాను చూసి తెలుసుకోండి.
Advertisement

 

 

 

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×