E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి రాజకీయంగా కలిసి వస్తుంది – వారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి రాజకీయంగా కలిసి వస్తుంది – వారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన డిసెంబర్ 7వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

చేపట్టిన పనులు కష్టసాద్యంతో పూర్తవుతాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో మాటపట్టింపులు తప్పవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. 

వృషభం

ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసి వస్తాయి. అవసరానికి ఇతురుల నుండి ధన సహాయం అందుతుంది. సోదరులతో మనస్పర్ధలు తొలగుతాయి. గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. నూతన ఉద్యోగ అవకాశలు అందుతాయి. 

మిథునం

నేత్ర సంభందిత అనారోగ్యసమస్యలు కొంత బాధిస్తాయి. చేపట్టినపనులు మందకొడిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుండి ఒత్తిడి తప్పవు. ఆర్థిక పరిస్థితి గంధరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది.

కర్కాటకం

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. సంతాన విద్యా ఉద్యోగం విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలలో ఆశించిన విధంగా రాణిస్తారు. సంఘంలో  గౌరవ మర్యాదలకు లోటుండదు. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

సింహం

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

కన్య

ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. గృహమున సంతాన శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. ముఖ్యమైన పనులు బంధు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. రాజకీయంగా కలిసి వస్తుంది

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. ఉద్యోగమున చాలా కాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు  ఆశాజనకంగా సాగుతాయి. బంధువులలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం

కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఒక వ్యవహారంలో ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి.  కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. 

ధనుస్సు

ఉద్యోగాలలో  బాధ్యతలు మరింత అధికమవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.  వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగులకు అతి కష్టం మీద అల్ప ఫలితం పొందుతారు. కొన్ని వ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.

మకరం

ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు కలసి వస్తాయి.  నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కుంభం

ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక  ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. బంధు మిత్రులతో  సఖ్యత పెరుగుతుంది. వ్యాపారాలలో  శత్రు సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు.  వృత్తి  ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు.

మీనం

కీలక సమయంలో మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంత బందు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున మంచి పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే10: ఆ రాశి స్థిరాస్థి వ్యాపారులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు

Weekly Horoscope May 10 To May 16: ఈ వారం ఆ రాశి రాజకీయ నాయకులకు అద్బుతంగా ఉంటుంది

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 09: ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 08: ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది – వారికి వ్యాపారంలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 07: ఆ రాశి వారికి అకస్మిక ధన లాభం – వారికి వ్యాపారాలలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 06: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి ప్రముఖులతో పరిచయం

Big Stories

×