E-Paper
Advertisement

OTT Movie : ఈ ఏడాది గూగుల్‌లో మోస్ట్ సెర్చ్డ్ టాప్ 10 మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?

OTT Movie : ఈ ఏడాది గూగుల్‌లో మోస్ట్ సెర్చ్డ్ టాప్ 10 మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?
Advertisement

OTT Movie : భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుండి ఈ ఏడాది అనేక సినిమాలు విడుదలయ్యాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో బ్లాక్ బస్టర్లు అయితే, మరికొన్ని మౌత్ టాక్ తో విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయి. వీటి గురించి తెలుసుకోవడానికి ఆడియన్స్ Google లో కూడా విపరీతంగా సర్చ్ చేశారు. ఇప్పుడు అత్యధికంగా గూగుల్ సెర్చ్ చేసిన 10 భారతీయ సినిమాల గురించి తెలుసుకుందాం.

1. ‘సైయారా’

మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ 2025 జూలై 18న విడుదలైంది. అహన్ పాండే, అనీత్ పద్దా ఈ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాలో తొలిసారిగా నటించారు. బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹570 కోట్లు వసూలు చేసింది. నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

2. ‘కాంతారా: చాప్టర్ 1’

Advertisement

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన ఈ కన్నడ చిత్రం 2025న అక్టోబర్ 2న విడుదలైంది. ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹852 కోట్లు వసూలు చేసింది. ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

3. కూలీ

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ తమిళ చిత్రం 2025న ఆగస్టు 14న విడుదలైంది. రజనీకాంత్ ప్రధాన పాత్ర పోషించారు, నాగార్జున అక్కినేని సౌబిన్, షాహిర్ లతో కలిసి నటించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ₹518 కోట్లు వసూలు చేసింది. ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

4. వార్ 2

Advertisement

2019 బ్లాక్‌బస్టర్ ‘వార్’ కి సీక్వెల్ గా వచ్చింది. ఈ అయాన్ ముఖర్జీ చిత్రం 2025 ఆగస్టు 14న విడుదలైంది. ఈ ఫ్లాప్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ₹364.35 కోట్లు వసూలు చేసింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

5. ‘సనమ్ తేరి కసమ్’

రాధిక రావు, వినయ్ సప్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదట 2016లో విడుదలైంది. ఇది 2025 ఫిబ్రవరి 7న తిరిగి విడుదలైంది. హర్షవర్ధన్ రాణే, మావ్రా హొకేన్ నటించిన ఈ చిత్రం తిరిగి విడుదల చేసిన తర్వాత ₹50 కోట్లకు పైగా వసూలు చేసింది. Zee 5 లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

6. ‘మార్కో’

ఉన్ని కృష్ణన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సూపర్‌హిట్ మలయాళ చిత్రానికి హనీఫ్ అదేని దర్శకత్వం వహించారు. 2024 డిసెంబర్ 20న విడుదలై, ప్రపంచవ్యాప్తంగా ₹102 కోట్లకు పైగా వసూలు చేసింది. జియో హాట్ స్టార్ లో ఇది అందుబాటులో ఉంది.

7. ‘హౌస్‌ఫుల్ 5’

తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహించిన హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలో ఇది ఐదవ చిత్రం. ఈ సినిమా 2025న జూన్ 6న విడుదలై ప్రపంచవ్యాప్తంగా 288 కోట్లు వసూలు చేసింది. అక్షయ్ కుమార్ ఇందులో లీడ్ రోల్ లో నటించారు. ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

8. ‘గేమ్ ఛేంజర్’

ఎస్. శంకర్ దర్శకత్వం వహించిన ఈ తెలుగు యాక్షన్ థ్రిల్లర్‌లో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైన ఈ చిత్రం 2025 జనవరి 10న విడుదలైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 186 కోట్లు వసూలు చేసింది. Zee 5 లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

9. ‘శ్రీమతి’ (Mrs.)

ఈ డ్రామా మూవీ 2025 ఫిబ్రవరి 7న నేరుగా ZEE5లో విడుదలైంది. ఆరతి కడవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సన్యా మల్హోత్రా, నిశాంత్ దహియా, కన్వల్జిత్ సింగ్ కీలక పాత్రల్లో నటించారు.

10. ‘మహావతార్ నరసింహ’

అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ యానిమేటెడ్ ఎపిక్ డ్రామా. విష్ణువు నరసింహ అవతారం కథను చూపిస్తుంది. 2025 జూలై 25న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా ₹326.82 కోట్లు వసూలు చేసింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

 

Read Also : జైలు నుంచే రాబరీ స్కెచ్… ఒక్క సారి చేస్తే లైఫ్ సెట్టు… దిమాక్ కరాబయ్యే క్లైమాక్స్

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×