E-Paper
Advertisement

OTT Movie : సినిమా పిచ్చి దయ్యాలతో డైరెక్టర్ రచ్చ … ప్రతీ రాత్రి కోరిక తీర్చుకొనే ఆడ దెయ్యం

OTT Movie : సినిమా పిచ్చి దయ్యాలతో డైరెక్టర్ రచ్చ … ప్రతీ రాత్రి కోరిక తీర్చుకొనే ఆడ దెయ్యం
Advertisement

OTT Movie : కామెడీ జానర్ లో వస్తున్న హారర్ స్టోరీలను ప్రేక్షకులు తెగ చూస్తున్నారు. ఫ్యామిలీలతో కలసి ఎంచక్కా ఎంటర్టైన్ అవుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బెంగాలీ కామెడీ సిరీస్ చాలా క్రేజీగా ఉంటుంది. మూడు భూతాల చుట్టూ తిరిగే ఈ సిరీస్ ని ఒక్క సారి స్టార్ట్ చేస్తే ఆపడం కష్టమే. సినిమా పిచ్చి ఉన్న ఈ భూతాలు ఒక పెద్ద బంగ్లాలో ఉంటాయి. ఇవి చేసే రచ్చ ‘బిగ్ బాస్ హౌస్’ ని తలపిస్తుంది. దీని మీద ఓ లుక్ వేస్తే కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయం. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

కౌషిక్ హఫిజీ దర్శకత్వంలో వచ్చిన ఈ బెంగాలీ సిరీస్ పేరు ‘భూత్తేరికీ’ (Bhootteriki). ఇందులో డిపన్వితా సార్కార్, ఐశ్వర్య సేన్, ఎవరీ సింఘా రాయ్ మెయిన్ గ్రోత్స్, సౌనక్ కుండు, మొయిత్రీ బానర్జీ ప్రధాన పాత్రల్లో నటించారు. 13 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ 2025 సెప్టెంబర్ 12 నుంచి హోయిచోయి (Hoichoi) ప్లాట్‌ఫామ్‌ లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఐయండిబిలో దీనికి 8 /10 రేటింగ్ ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

కలకత్తా శివార్లలో ఒక పాత పెద్ద బంగళా ఉంటుంది. అందులో మూడు భూతాలు ఉంటాయి. బహ్ను అనే భూతం అక్కడ హెడ్ గా ఉంటుంది. రజియా అనే భూతం బేబీ కోసం ఎప్పుడూ ఏడుస్తుంటుంది. లబంగా అనే భూతం రోడ్డు మీది వెళ్ళే వాళ్ళ లోపలికి వెళ్ళి తన ప్రియుడితో కోరికలు తీర్చుకుంటూ ఉంటుంది. ఈ ముగ్గురూ రోజూ ఇంట్లో గొడవలు, ఏడుపులు, లవ్ డ్రామాలతో ఏదో సీరియల్ హీరోయిన్స్ లాగా గడుపుతుంటారు. వీళ్ళకి తమ స్టోరీలను ఎవరైనా సినిమాగా తీస్తే బాగుంటుందని అనుకుంటారు. ఇంతలో ఒక డాక్యుమెంటరీ డైరెక్టర్ సంజయ్ ని ఆ భూతాలు బంగ్లాకి రప్పిస్తాయి. మొదట అతను భయపడినా, అక్కడ కెమెరా పెట్టేస్తాడు.

Read Also : ముసలాడితో మాస్టర్ ప్లాన్… ఈ అమ్మాయి ఆశలకు అవాక్కవ్వాల్సిందే… గ్రిప్పింగ్ మలయాళ డ్రామా

Advertisement

కానీ ఈ ముగ్గురు భూతాలు తమ స్టోరీలను ఒక బిగ్ బాస్ హౌస్ గా మార్చేస్తాయి. ఇంటర్వ్యూ ఇవ్వడం, సీన్ క్రియేట్ చేయడం మొదలు పెడతాయి. సంజయ్ ఫుల్ కన్ఫ్యూజ్ అవుతాడు. ఇది హారర్ డాక్యుమెంటరీనా, కామెడీ రియాలిటీ షోనా అనేది అతనికి అర్థం కాదు. బహ్ను అందరికీ రూల్స్ పెడుతుంది, రజియా తన బేబీ కోసం ఏడుస్తూ డ్రామా చేస్తుంది. లబంగా రాత్రి రోడ్డు మీదికి పోయి వీడు నా బాయ్‌ఫ్రెండ్ అంటూ గోల చేస్తుంది. చివరికి సంజయ్ భూతాల ఫ్యామిలీ మెంబర్‌లా మారిపోతాడు. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో, భూతాలు ఎందుకు ఇంత డ్రామా చేస్తున్నాయో చివరి ఎపిసోడ్‌లో భారీ ట్విస్ట్‌తో తెలుస్తుంది. ఆ టిస్ట్ ఏమిటి ? భూతాలతో డైరెక్టర్ సినిమా తీస్తాడా ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ కామెడీ హారర్ సిరీస్ ని చూసి తెలుసుకోండి.

 

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×