E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ఘోర అవమానం.. మనోజ్ పని అవుట్.. బయటపడ్డ మరో నిజం..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ఘోర అవమానం.. మనోజ్ పని అవుట్.. బయటపడ్డ మరో నిజం..
Advertisement

Gundeninda GudiGantalu Today episode November 23rd: నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ చేత నిజం చెప్పించాలని  బాలు చాలానే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.  కామాక్షి అత్తను  కనుక్కుంటే సరిపోతుంది కదా అని బాలు వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అంటాడు. మీనా కూడా సరే అని అంటుంది. ఇద్దరు కలిసి కామాక్షి దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్తారు. మేము అమ్మమ్మ గారికి ఇప్పటికైనా నగలం తెచ్చి చేయను కొనిద్దామని అనుకుంటున్నాము. మాకు చాలా బాధగా ఉంది అని కావాలని నిజం చెప్పించాలని మాట్లాడతారు.. అయితే కామాక్షి మాత్రం మీరు నా చేత నిజం చెప్పించాలని అనుకుంటున్నారేమో అని అనుకుంటుంది. కొన్నిసార్లు నోరు జారి నిజం చెప్పబోయిన సరే మళ్లీ అది కాదు అని కవర్ చేస్తుంది. ఇక ఆ తర్వాత ప్రభావతి ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మొత్తం రివర్స్ అవుతుంది.. మనకు నిరాశ తప్పలేదు అని బాలు అనుకుంటారు. రాజేష్ బీరువా కొనాలని వెళ్తాడు.. అక్కడే అసలు నిజాన్ని తెలుసుకుంటాడు బాలు.. రాజేష్, బాలు షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ప్రోమో విషయానికోస్తే.. రాజేష్, బాలు బీరువా కొనడానికి వెళ్తారు. అక్కడ దొంగ సామాన్లు అని పోలీసులు ఎంట్రీ ఇస్తారు.. బాలు రాజేష్ ఎంత చెప్పినా సరే వాళ్ళు వినకుండా వీళ్ళను కూడా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. విచారణలో తేలుతాయి కానీ మీరు రండి అని వాళ్ళని తీసుకొని వస్తారు అక్కడికి ఫర్నిచర్స్ పోగొట్టుకున్న షాప్ ఓనర్లు అందరూ అక్కడికి రావడంతో ఇదంతా మోసమా అని బాలు అనుకుంటాడు. అప్పుడే మనోజ్ రావడం చూసి బాలు షాక్ అవుతాడు అంటే వీడు నగలు అమ్మేసి ఆ ఫర్నిచర్ల డబ్బులను రీప్లేస్ చేశాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పాలి అని వీడియో తీస్తాడు. ఇక బాలుని రిలీజ్ చేసిన పోలీసులు అతన్ని ఇంకొకసారి విచారణకు రమ్మంటే రావాలని చెప్తారు. బాలు మనోజ్ పోలీస్ స్టేషన్ సీన్ ని అందరికీ చూపిస్తాడు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.

Advertisement

వీడు నాలుగు లక్షలు ఫర్నిచర్ అమ్మేసి లాభం తెచ్చాను అని సంకలు గుద్దుకుంటున్నాడు. అందులో నిజం లేదు. వీడేంటో మీ అందరికీ తెలియాలి ఈ వీడియో చూడండి అని పోలీస్ ఎస్ఐ తో మనోజ్ మాట్లాడుతున్న వీడియోని బాలు అందరికీ చూపిస్తాడు. నువ్వు ఇంత ఈజీగా మోసపోతావ్ అని అస్సలు అనుకోలేదు అలా ఎలా చేశావయ్యా అని ఎస్ఐ అడగడం చూసి అందరూ షాక్ అవుతారు. రోహిణి కి కొట్టేసిన అంత పని అవుతుంది. బాలు అన్న మాటలకి రోహిణి చాలా ఫీల్ అయిపోతుంది.

మనోజ్ ని సత్యం కొడతాడు. ఏదీ చేత కాదా ఆ నాలుగు లక్షలు ఎక్కడి నుంచి తెచ్చావు. బంగారు మమ్మీ తెచ్చావా ఏంటి అని సీరియస్ గా మనోజ్ ని తిడుతూనే కొట్టేస్తాడు. కానీ మనోజ్ మాత్రం నేను మా ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చాను అని చెప్తాడు. ప్రభావతి ఎక్కడ నగల విషయం బయట పడుతుందోనని కావాలనే మరో సీన్ ని క్రియేట్ చేస్తుంది. ఇక మనోజ్ మా ఫ్రెండ్ దగ్గర తెచ్చాను అని చెప్పగానే అందరూ మౌనంగా ఉండిపోతారు. ఎందుకురా ఇలా చేస్తున్నావ్ నువ్వు ఇప్పటికీ ఇంటి పరువు తీస్తూనే ఉంటావా అని ప్రభావతి అనడంతో అందరూ మౌనంగా ఉండిపోతారు.

Advertisement

ఏంటమ్మా నువ్వు కూడా నన్ను కొట్టావు అంటే సంతోషించు నగల విషయం ఎక్కడ బయట పడుతుందో.. ఆ బాలు గాడు మనల్ని ఎక్కడ చంపేస్తాడు అని చాలా కంగారుపడ్డాను. కానీ ఏదో ఒకటి చేసి తప్పించుకున్నామని ప్రభావతి అంటుంది.. నీకు ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు నువ్వు వెళ్లి ఆ నగల ప్లేస్ లో కొత్త నగలను తీసుకొచ్చి పెట్టాలి లేదంటే మాత్రం కచ్చితంగా మీతో పాటు నన్ను కూడా ఇంట్లోంచి బయట గెంటేస్తారు అని ప్రభావతి మనోజ్ కి వార్నింగ్ ఇస్తుంది.

మీనా అదేంటి నగలమ్మి డబ్బులు తెచ్చాడు కదా మరి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర తెచ్చాడు అని అంటున్నారని బాలుతో అంటుంది. కచ్చితంగా ఈ నగలను అమ్మేసే వాడు డబ్బులు కట్టాడు. అది మాత్రం క్లియర్ గా నాకు అర్థమైంది. కానీ మా అమ్మ వాడు ఎక్కడ దొరికిపోతారని ఫ్లైట్ మార్చేశారు అని బాలు అంటాడు. మరి ఇప్పుడు ఈ నగల విషయాన్ని ఎలా బయటపెట్టాలండి అని మీనా అంటుంది. ఎలాగైనా సరే ఈ నగలు తీసింది వాడే అని వాడి నోటి చేత అయితే చెప్పిస్తాను అని బాలు అంటాడు.

Also Read : చిరంజీవి దారిలోనే బన్నీ..వారికి దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతున్నాడా..?

తర్వాత రోజు అందరూ కలిసి గుడికి వెళ్తారు. అక్కడ ఒక వ్యక్తి పోతురాజు లాగా కనిపిస్తాడు. బాలు ఇదే కరెక్ట్ ప్లాను మనోజ్ చేత నిజం కక్కించాలి అని అనుకుంటాడు. ఆ వ్యక్తితో మాట్లాడి నేను ఒక పేరు చెప్తాను వాడి చేతే అసలు నిజాన్ని బయటపెట్టించాలి అని అంటాడు. అతని ఎవరో చెప్పండి మిగతా విషయాలని నేను చూసుకుంటాను అని బాలుకి ఆ వ్యక్తి సపోర్ట్ గా నిలుస్తాడు. మనోజు గుడిలోకి రాగానే ఈ వ్యక్తి దేవుడిని నిజాలు చెప్పాలి. అబద్దం చెప్పావో ఛస్తావ్ అని అంటాడు. మనోజ్ భయపడి పోయి నిజం చెప్తాను అని అరుస్తాడు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×