E-Paper
Advertisement

OTT Movie : పగ తీర్చుకోవడానికి పెళ్లి… సీను సీనుకో ట్విస్ట్ ఉన్న క్రేజీ వెబ్ సిరీస్

OTT Movie : పగ తీర్చుకోవడానికి పెళ్లి… సీను సీనుకో ట్విస్ట్ ఉన్న క్రేజీ వెబ్ సిరీస్
Advertisement

OTT Movie : లవ్ రివేంజ్ స్టోరీలు భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ స్టోరీలను కొరియన్స్ చాలా బాగా ప్రజెంట్ చేస్తారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ చైనీస్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. అక్కడ సూపర్ హిట్ కూడా అయింది. ఒక అమ్మాయి ప్రియుడి మీద రివేంజ్ ప్లాన్ వేస్తుంది. అతని ముందే మరో వ్యక్తితో తిరుగుతుంది. క్లైమాక్స్ వరకు ఈ స్టోరీ ఆసక్తికరంగా ఉంటుంది. రొమాంటిక్ రివేంజ్ థీమ్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2022లో వచ్చిన ఈ చైనా రొమాంటిక్ రివేంజ్ సిరీస్ పేరు ‘ఇఫ్ ఐ నెవర్ లవ్డ్ యూ’ (If I Never Loved You). యాంగ్ జియాన్ దర్శకత్వంలో ఇది రూపొందింది. ఇందులో లీడ్ కాస్ట్ చెన్ మో (యున్‌జాన్), డై ఫెయ్ (యాన్ షియో) ప్రధాన పాత్రల్లో నటించారు. 25 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్, అమెజాన్ ప్రైమ్ వీడియో, వీ టివి లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

షియో అనే పూర్ అమ్మాయి పై ఒక రోజు యున్‌జాన్ అనే సూపర్ రిచ్ CEO కళ్ళు పడతాయి. అతను చూడటానికి హ్యాండ్‌సమ్ గా ఉంటాడు, ఎవరితోనూ ఎక్కువ మాట్లాడడు. షియోఆన్ ఒక్కసారిగా పూర్తి ప్రేమలో పడిపోతుంది. రోజూ అతని ఆఫీస్ దగ్గర తిరుగుతుంది. లవ్ లెటర్స్ రాస్తుంది, గిఫ్ట్స్ ఇస్తుంది. యున్‌జాన్ మాత్రం ఆమెను గుర్తే పెట్టుకోడు. ఒక రోజు ఆమె ధైర్యం చేసి ప్రపోజ్ చేస్తుంది… అతను సరే అంటాడు. కానీ ఆ సరే వెనక ఒక పెద్ద రహస్యం ఉంటుంది.పెళ్లి కూడా అయిపోతుంది. షియో ఆనందంలో ఉంటుంది, కానీ యున్‌జాన్ ఆమెను పూర్తిగా ఇగ్నోర్ చేస్తాడు. ఆమెతో మాట్లాడడు, టచ్ కూడా చేయడు. ఒక్క రాత్రి కూడా కలిసి గడపడు. ఇల్లు ఒక పెద్ద ప్యాలెస్ లాగా ఉంటుంది కానీ ఆమెకు అందులో జైలు లాగా అనిపిస్తుంది. ఎవరైనా అడిగితే నా భార్యని నేను ప్రేమిస్తాను అంటాడు కానీ చూపించడు. షియో రోజూ ఏడుస్తూ, అతని దృష్టి కోసం ఏం చేయాలో తెలియక గడుపుతుంది.

ఇంతలో ఆమె గతంలో ఒక పెద్ద మోసం జరిగిందని తెలుస్తుంది. ఆమెను ఎవరో ఫాల్స్ కేసులో ఇరికించి జైలు పంపారు. ఆ కేసు వెనక కూడా యున్‌జాన్ హ్యాండ్ ఉందని ఆమెకు అనుమానం వస్తుంది. షియోఆన్ ఇక భరించలేక, ఒక రోజు ఇంట్లోంచి పారిపోతుంది. తనను తాను మార్చుకుంటుంది. బయటి ప్రపంచంలో సక్సెస్‌ఫుల్ అవుతుంది. ఎవరికీ లొంగని స్ట్రాంగ్ వుమన్ అవుతుంది. ఇప్పుడు యున్‌జాన్ ఆమెను చూసి షాక్ అవుతాడు. ఆమెను మళ్లీ తన దగ్గరికి లాగాలని ట్రై చేస్తాడు. కానీ షియో ఇక ఆ రోజులు లేవని చెబుతుంది. నువ్వు నన్ను ఎప్పుడూ ప్రేమించలేదు కదా… ఇప్పుడు ఎందుకు? అని అడుగుతుంది.ఇక్కడే యున్‌జాన్ నిజంగా ఆమెను ప్రేమించాడా లేదా అనేది స్లోగా ఓపెన్ అవుతుంది.

Advertisement

Read Also : దెయ్యం నుంచి ఓనర్‌ను రక్షించే డాగ్… ఇలాంటి హర్రర్ మూవీని మీ లైఫ్‌లో చూసుండరు భయ్యా

అతను ఆమెను దూరంగా ఉంచిన వెనక ఒక భయంకరమైన రహస్యం ఉంది. గతంలో జరిగిన ఒక ట్రాజెడీ, ఆ ట్రాజెడీ వల్ల ఆమెను కాపాడుకోవాలని అతను ఇలా చేశాడని తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఆమె రివెంజ్ తీర్చుకోవాలని వస్తుంది. అతన్ని బాధపెట్టాలని ప్లాన్ చేస్తుంది. ఇంతలో మరో హీరో ఎంట్రీ – యున్‌జాన్ ఎనిమీ, షియోఆన్‌కి సపోర్ట్ చేస్తూ, ఆమెను ప్రేమిస్తూ రివెంజ్‌లో హెల్ప్ చేస్తాడు. చివరి వరకు ఇద్దరి మధ్య ఒక పెద్ద ఎమోషనల్ యుద్ధం నడుస్తుంది. ఎవరు సరైనవాళ్ళు ? ఎవరు తప్పు చేశారు? ఆ గత రహస్యం ఏమిటి? ఆమె అతన్ని క్షమిస్తుందా? లేక రివెంజ్ పూర్తి చేస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సిరీస్ ని మిస్ కాకుండా చూడండి.

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×