BigTV English
Advertisement

OTT Movie : తల కట్ చేసి ఎత్తుకెళ్లే సైకో… పోలీసుల బుర్రలతో ఆటలాడే కిల్లర్… థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్

OTT Movie : తల కట్ చేసి ఎత్తుకెళ్లే సైకో… పోలీసుల బుర్రలతో ఆటలాడే కిల్లర్… థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్

OTT Movie : ఒక బెంగాలీ గ్రిప్పింగ్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ సరికొత్త స్టోరీతో ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ సిరీస్‌ ప్రేక్షకులకు ఒక మెమరబుల్ అనుభవాన్ని ఇస్తోంది. ఒక గ్రామీణ వాతావరణంలో జరిగే ఈ స్టోరీలో హైలైట్ ట్విస్టులు చాలానే ఉన్నాయ్. ఈ సస్పెన్స్‌ఫుల్ థ్రిల్లర్‌ను ముఖ్యంగా క్రైమ్ డ్రామా, సైకలాజికల్ థ్రిల్లర్‌లు ఇష్టపడేవాళ్ళు తప్పక చూడాల్సిన సిరీస్. ఈ సిరీస్‌కు తెలుగు డబ్బింగ్ లేనప్పటికీ, తెలుగు సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


ఏ ఓటీటీలో ఉందంటే

‘బిభీషణ్’ (Bibhishon) 2025లో విడుదలైన బెంగాలీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. రాజా చంద దర్శకత్వంలో నిర్మాణంలో తెరకెక్కింది. ఈ సిరీస్‌లో సోహం మజుందార్, దేబ్‌చంద్రిమా సింగ్హా రాయ్, అమిత్ సాహా, దేబోప్రియో ముఖర్జీ, కథా నంది, సంజీబ్ సర్కార్, ప్రదీప్ ధర్, సుబ్రత గుహ రాయ్, అలోక్ సన్యాల్, అర్పితా దే ప్రధాన పాత్రల్లో నటించారు. బీర్భూమ్ జిల్లాలోని బలగఢ్ అనే గ్రామంలో ఈ స్టోరీ నడుస్తుంది. ఈ స్టోరీ ఒక చిన్న దొంగతనం, మిస్సింగ్ కేసు, ఒక తలలేని శవంతో మొదలై సైకలాజికల్ టెన్షన్‌లతో నిండిన ఒక గ్రిప్పింగ్ కథగా తెరకెక్కింది. ఈ సిరీస్ 2025న జూన్ 27 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది 7.1/10 IMDb రేటింగ్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.


స్టోరీలోకి వెళితే

బీర్భూమ్ జిల్లాలో బలగఢ్ అనే ఒక చిన్న ప్రశాంతమైన గ్రామం ఉంటుంది. ఇక్కడ నేరాలు కూడా పెద్దగా జరగవు. ఈ గ్రామంలో ఉండే పోలీస్ స్టేషన్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ బిధాన్ సేన్ రోజూ సాధారణ కేసులతో డ్యూటీ చేసుకుంటూ ఉంటాడు. అతని టీమ్‌లో ASI స్వపన్ ఖరా, ASI అశోక్ సాహా, స్టేషన్‌లో సహాయకుడిగా పనిచేసే చిదంతుడు (అమిత్ సాహా) ఉంటారు. బిధాన్ వ్యక్తిగత జీవితంలో తన భార్య బృష్టి (దేబ్‌చంద్రిమా సింగ్హా రాయ్)తో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఉంటాడు. కానీ అతను డ్యూటీ పట్ల నిజాయితీతో ఉంటాడు. ఒక రోజు ఒక చిన్న దొంగతనం కేసు, ఒక వ్యక్తి మిస్సింగ్ కేసు నమోదవుతాయి. ఈ సాధారణ కేసులు త్వరలోనే ఒక తలలేని శవంతో కనెక్ట్ అవుతాయి. ఇక స్టోరీ భయంకర మలుపు తీసుకుంటుంది. బిధాన్ ఈ కేసులను దర్యాప్తు చేయడం మొదలెడతాడు. దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ, బిధాన్‌కు షాకింగ్ విషయం తెలుస్తుంది. నేరస్థుడు ఎవరోకాదు అతనికి చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి. ఈ నిజం బిధాన్‌ను భావోద్వేగంగా కుంగదీస్తుంది.

Read Also : పరిచయం లేని అబ్బాయితో ఆ పని.. భర్తనే మరో మగాడు కావాలని అడిగే అమ్మాయి… మైండ్ బ్లాక్ ట్విస్టులు

ఎందుకంటే ఇది అతని వ్యక్తిగత జీవితంతో కూడా ముడిపడిఉంటుంది. ఈ కథలో చిదంతుడు అనే స్టేషన్ సహాయకుడు కీలక పాత్ర పోషిస్తాడు. అతను బయటికి అమాయకంగా కనిపించినప్పటికీ, అతని లోపల ఒక క్రిమినల్ మనస్తత్వం దాగి ఉంటుంది. చిదం ఒక హత్య తర్వాత మరొక హత్య చేస్తుంటాడు. ఇక బిధాన్ అతన్ని పట్టుకుని లాకప్ లో వేస్తాడు. కానీ పోలీస్ టార్చర్‌కు అతను ఎలాంటి సమాధానాలు ఇవ్వడు. అయితే బిధాన్ ప్రేమతో వ్యవహరించినప్పుడు, అతను తన నేరాల గురించి మాట్లాడతాడు. క్లైమాక్స్‌లో ఈ స్టోరీ ఒక షాకింగ్ ట్విస్ట్‌తో ముగుస్తుంది. ఇది ప్రేక్షకులను ఆలోచనలో మునిగేలా చేస్తుంది. ఈ క్లైమాక్స్‌ ట్విస్ట్ ఏమిటి ? చిదంతుడు ఎందుకు హత్యలు చేస్తుంటాడు ? చిదంతుడిని బిధాన్ ఎలా పట్టుకుంటాడు ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ని మిస్ కాకుండా చుడండి.

Related News

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథOTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

OTT Movie : పనోడి కొడుకుతో ఆ పాడు పని… అక్క లైఫ్ లో అగ్గిరాజేసే చెల్లి… క్లైమాక్స్ లో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్

OTT Movie : 100 డాలర్స్ తో అన్నోన్ సిటీలో వదిలేస్తే… బుర్రబద్దలయ్యే షాక్… రిచ్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్

OTT Movie : అన్న కోసం అరణ్యంలో వేట… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్… కల్లోనూ వెంటాడే హారర్ సీన్స్

OTT Movie : ఒకరిని లవ్ చేసి మరొకరితో రాసలీలలు… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : వరుస హత్యలు…మిస్సైన అమ్మాయిని చంపడానికి జైలు నుంచి ఎస్కేపయ్యే సైకో… ఈమె డెడికేషన్ కో దండం సామీ

Big Stories

×