Prakash raj Fires on Pawan Kalyan: సినీ నటుడు ప్రకాశ్ రాజ్ గురించి తెలిసిందే. వెండితెరపై తన అద్బుతమైన నటనతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంటారు. పాత్ర ఎలాంటిదైన పరకాయ ప్రవేశం చేస్తారు. ముఖ్యంగా తండ్రి పాత్రల్లో ఆయన చూపించిన ఎమోషన్స్ ప్రతి ఒక్క ఆడియన్స్‌ని ఆకట్టుకుంటాయి. ఎన్నో పాత్రల్లో నటించిన ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇక బయట కూడా ప్రకాశ్ రాజ్ చాలా ముక్కసూటిగా ఉంటారు. సినీనటుడైన తరచూ రాజకీయాలపై స్పందిస్తుంటారు. ప్రధాని మోదీ నుంచి సీఎం, ఎమ్మెల్యే వరకు వారిపై నిర్మోహమాటం లేకుండ ప్రశ్నిస్తారు. అయితే ఈ మధ్య ఆయన ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ కౌంటరిస్తుంటాడు.
మరోసారి పవన్ పై ఫైర్
ఆయన రాజకీయ జీవితంపై తరచూ విమర్శలు గుప్పిస్తుంటారు. తాజాగా మరోసారి ఆయన పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. హరి హర వీరమల్లు సినిమా విషయంలో పవన్ తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హరి హర వీరమల్లు టికెట్స్ రేట్స్ హైక్పై పవన్పై ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోలా ప్రవర్తిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. “మనసాక్షిలేని దొంగల పవన్ కళ్యాణ్. అతడి గురించి ఏం మాట్లాడుతాం. చెత్త సినిమాని తీసిన మీకు తెలియదా? ఎవరికి అమ్ముతున్నారు. ఎవరిని మోసం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ఒకప్పుడు ఏఎన్నార్, ఎన్టీఆర్ సినిమాలు వస్తున్నాయంటే ఎదురుచూసేవాళ్లం. కానీ, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు. ఒక ప్లాప్ సినిమాకు భారీగా టికెట్స్ రేట్స్ పెంచి దోపిడి చేస్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నమ్మక ద్రోహం చేశావ్..
‘రాజమౌళి బాహుబలి లాంటి సినిమా తీశారు. అది ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలుసు. ఆ సినిమా ట్రెండ్ సెట్ చేసింది. కానీ, మీరు ఏం చేశారు. ఇది అభిమానులను నమ్మక ద్రోహం చేయడం కాదా? అంటారా? ఓ సినిమా టైంలో ఆర్జీవీ ట్వీట్ చేశారు. రోడ్డుపై ఇడ్లీకి రూ. 20అయితే అదే పైవ్ స్టార్ హోటల్లో రూ.500. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఆ సినిమాలో వీఎఫ్ఎక్స్, విజువల్స్ ఎంత బాగుంటాయి. అలా మీ సినిమాలో వీఎఫ్ఎక్స్ ఉందా? కథ ఉందా? నిజాయితీ ఉందా? నాలుగైదు సంవత్సరాలు ఎందుకు ఆలస్యమైంది. మీ చేతకాని తనంతో కాదా?’ అని పేర్కొన్నారు. ‘ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏం చేశావ్ నువ్వు. అభిమానులను రెచ్చగొట్టేలా మాట్లాతావా?. నీ కోసం చొక్కా చిచ్చుకుని అభిమానిస్తున్న వాళ్లని నీ సైన్యం అంటూ జనాలపైకి రెచ్చగొడుతున్నారు. ఓ స్టేజ్పై మహేష్ బాబు, ఎన్టీఆర్లు.. ఇండస్ట్రీలో ఏం జరిగిన మేము మంచి స్నేహితులమే. మా కోసం మీరు కొట్టుకోవద్దు అన్నారు. కానీ నువ్వేం చేశావు.. కొట్టుకొమ్మని చెబుతావా?’ అని అసహనం చూపించారు.
నీ అహంకారం వల్లే సినిమా లేటు..
నువ్వు సినిమాలో ఓ ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం జనాలకు అందుబాటులోకి రాలేదంటూ అర్థం చేసుకుంటాం. కానీ అది నీ అహంకారం. నీ సొమరితం, నీ అహంకారం వల్లే ఈ సినిమా 5 సంవత్సరాలు అయ్యింది. ఒక డైరెక్టర్ అన్నారు. ఆ డైరెక్టర్ స్థానంలో మరో దర్శకుడిని తీసుకువచ్చారు. కానీ అతడు అనుకున్నది అనుకున్నట్టుగా సినిమాని తీసే పరిస్థితి ఇచ్చారా? ఎవరిని మోసం చేస్తున్నారు. ఇదోక ప్రొఫెషన్. నీ పని ఎంటర్టైన్ చేయడం. అలాంటి సినిమాలో నీ రాజకీయాన్ని రుద్దడమంటే ఎంత మోసం. ఎవరిని నీన్ను నమ్మిన ఫ్యాన్స్ మోసం చేయడం కదా? మనసాక్షి లేదా? ఓ కథలో ఔరంగజేబు తీసుకువచ్చి.. ఇంకొకడిని తీసుకువచ్చి అందులో మరోకటి రుద్దడం ఏంటీ? మీరు మారరా? కొంచమైన సిగ్గు అనిపించడం లేదా? దీని పరిణామం ఇంకో సినిమాలపై ఎలా ఉంటుంది. ఇది సినిమా.. ఇందులో రాజకీయం ఎందుకు వస్తుంది. సినిమా వేరు, రాజకీయం వేరు. దీనిపై ప్రశ్నించే గొంతులు లేవాలి. కానీ, చివరికి దీనివల్ల ఎవరికి నష్టం. నీకే.. నిన్ను నమ్మిన నీ అభిమానులను మోసం చేయడమే కదా” అంటూ ప్రకాశ్ రాజ్ పవన్పై విరుచుకుపడ్డారు.
Also Read: Ravi Teja ART Theatre: రవితేజ ART సినిమాస్ లోపల ఎలా ఉందో చూశారా? చూస్తే అబ్బా.. అనాల్సిందే!