OTT Movie : అందాల నటి అనుపమ పరమేశ్వరన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ అమ్మడు ఒక షార్ట్ ఫిల్మ్ లో కూడా నటించిందన్న సంగతి మీకు తెలుసా? అవును ఆమె ఒక మలయాళం షార్ట్ ఫిల్మ్ లో పవర్ ఫుల్ రోల్ చేసింది. ఆమె అద్భుతమైన నటన, రియలిస్టిక్ డైలాగ్‌లకు ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ హార్డ్-హిట్టింగ్ డ్రామాను మీరు కూడా చూసేయండి. ఇది తెలుగులో కూడా ఉందండోయ్. ఈ షార్ట్ ఫిల్మ్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
యూట్యూబ్ లో
‘ఫ్రీడమ్ @ మిడ్‌నైట్’ (Freedom @ Midnight) 2021లో విడుదలైన మలయాళం షార్ట్ ఫిల్మ్. ఇది ఆర్.జే. షాన్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ (చంద్ర), హక్కీం షాజహాన్ (దాస్) ప్రధాన పాత్రల్లో నటించారు. 29 నిమిషాల నిడివితో, ఈ షార్ట్ ఫిల్మ్ ఒక గృహిణి వివాహంలో వివాహం జీవితంలో జరిగే సంఘటనలచుట్టూ తిరుగుతుంది. ఇది 2021, జనవరి 9 న YouTubeలో విడుదలైంది. ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. అనుపమ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. IMDb లో దీనికి 7.7/10 రేటింగ్ కూడా ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ కథ కేరళలోని చంద్ర (అనుపమ పరమేశ్వరన్) అనే గృహిణి చుట్టూ తిరుగుతుంది. ఆమె తన వివాహ జీవితంలో అసంతృప్తిగా ఉంటుంది. ఒక సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో,చంద్ర తన భర్త దాస్ (హక్కీం షాజహాన్)తో ఒక విషయాన్ని చర్చించాలని నిర్ణయించుకుంటుంది. ఆమె షాకింగ్‌గా తనకు లైం*గిక స్వేచ్ఛ కావాలని, ఒక వ్యక్తితో తాను ఫాంటసీలు కలిగి ఉన్నానని చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. ఈ విషయం దాస్‌ను కలవరపెడుతుంది. ఇద్దరి మధ్య తీవ్రమైన వాదన జరుగుతుంది. చంద్ర తన భర్తతో ఈ విధంగా ఎందుకు మాట్లాడుతోంది? ఆమె నిజంగా స్వేచ్ఛ కోరుకుంటోందా ? లేక ఇందులో ఏదైనా కారణం ఉందా? అనే ప్రశ్నలు కథను ముందుకు నడిపిస్తాయి.
Read Also : ఫీలింగ్స్ రావట్లేదని పిచ్చి పని… అబ్బాయి కాదంటున్నారని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ