E-Paper
Advertisement

మార్చురీ నుండి మాయమైన మృతదేహం…క్లైమాక్స్ లో ఊహించని షాకింగ్ ట్విస్ట్… ఐయండిబిలో 7.6 రేటింగ్

మార్చురీ నుండి మాయమైన మృతదేహం…క్లైమాక్స్ లో ఊహించని షాకింగ్ ట్విస్ట్… ఐయండిబిలో 7.6 రేటింగ్
Advertisement

Psychological thriller OTT : ఒక మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్ సినిమా గురించి వెతుకుతుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను చూసేయచ్చు. ఇది చూస్తున్నంత సేపు మన మెదడుకి విపరీతమైన పని పెడుతుంది. ఎందుకంటే ప్రతి సీన్ ఒక పజిల్ లాగా ఉంటుంది. కేవలం హారర్ సినిమా లాగా భయపెట్టడమే కాకుండా, ఒక మనిషి చేసిన తప్పు వాడిని ఎలా వెంటాడుతుందో ఇది చాలా ఇంటెన్సివ్‌గా చూపిస్తుంది. సినిమా మొత్తం ఒకే రాత్రి, ఒకే లొకేషన్‌లో జరుగుతున్నా సరే, ఎక్కడా బోర్ కొట్టదు. డైరెక్టర్ మనల్ని ఒక దారిలో తీసుకెళ్తుంటే, క్లైమాక్స్‌లో ఊహించని విధంగా ఇంకో దారిలోకి తిప్పుతాడు. సస్పెన్స్ సినిమాలను ఇష్టపడే వారైతే, ఇది ఖచ్చితంగా చూడాల్సిన సినిమా.

ప్రైమ్ వీడియో (Prime Video)లో అందుబాటులో ఉంది. 

ఈ స్పానిష్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ది బాడీ’ (The Body). 2012లో వచ్చిన ఈ సినిమాకు దర్శకుడు ఓరియోల్ పాలో రూపొందించారు. ఈయన మైండ్ గేమ్ సినిమాలకి పెట్టింది పేరు. అడివి శేష్ ‘ఎవరు’ సినిమాకి ఒరిజినల్ అయిన ‘ది ఇన్విజిబుల్ గెస్ట్’ (The Invisible Guest) తీసింది కూడా ఈయనే. ఈయన సినిమాల్లో చివరి 5 నిమిషాల వరకు అసలు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఇది స్పెయిన్ దేశంలో సూపర్ హిట్ అయ్యింది. కేవలం 5 మిలియన్ యూరోలతో తీస్తే, భారీ వసూళ్లు సాధించింది. స్పానిష్ సినిమాల్లో ఇది ఒక క్లాసిక్ థ్రిల్లర్‌గా నిలిచిపోయింది. దీని స్క్రీన్ ప్లే చాలా హైలెట్ గా, ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది. ఈ సినిమా ఎంత ఫేమస్ అంటే, ఇండియాలో దాదాపు అన్ని భాషల్లో దీనిని కాపీ కొట్టడమో లేదా అఫీషియల్ గా రీమేక్ చేయడమో జరిగింది. హిందీలో రిషి కపూర్, ఇమ్రాన్ హష్మీతో ‘ది బాడీ’ పేరుతోనే దీనిని తీశారు. ఇక తమిళం/కన్నడలో అర్జున్ సర్జా నటించిన ‘game ‘ ‘Oru Melliya Kodu’ కూడా ఇదే కథ. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియో (Prime Video)లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే 

Advertisement

ఒక రోజు అర్ధరాత్రి ఊరు బయట ఉన్న మార్చురీ నుంచి ఒక మైకా అనే మహిళ శవం మాయమైపోద్ది. అక్కడ డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డు ఏదో దయ్యాన్ని చూసినట్టు భయపడి రోడ్డు మీదకు పరుగెత్తుకుంటూ వచ్చి కారు కింద పడిపోతాడు. ఇక పోలీసులు సీన్‌లోకి వస్తారు. ఆ ఆమె భర్త అలెక్స్ మీద పోలీసులకు అనుమానం వస్తుంది. ఎందుకంటే అతను తన ప్రియురాలితో ఎంజాయ్ చేయడానికి, తన భార్యను విషం ఇచ్చి చంపేసి ఏమీ తెలియనట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అలెక్స్‌ని పోలీస్ ఆఫీసర్ జైమ్ మార్చురీకి పిలిపించి గట్టిగా ఇంటర్వ్యూ చేస్తాడు. కానీ అసలు విషయం దాచిపెడుతుంటాడు.

అయితే ఆ రాత్రంతా మార్చురీలో వింత వింత పనులు జరుగుతుంటాయి. చనిపోయిన తన భార్య ఇంకా బతికే ఉందేమోనని అలెక్స్ వణికిపోతాడు. ఇంతలో అక్కడ కొన్ని క్లూస్ కూడా దొరుకుతాయి. అవి తన భార్యను చంపడానికి వాడిన విషం డబ్బా లాంటివి. ఎవరో తనతో గేమ్ ఆడుతున్నారని, తన పాపం బయటపడుతుందని వాడు ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటాడు. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే… ఆ శవం బతికి లేదు. ఆ పోలీస్ ఆఫీసరే మాయం చేసి ఇదంతా ప్లాన్ చేస్తాడు. అసలు అదంతా ఎందుకు ఆ ఫీసర్ అలా చేస్తున్నాడు ? అలెక్స్ బండారం బయట పడుతుందా ? వీళ్లిద్దరికి గతంలో ఉన్న సంబంధం ఏమిటి ? అనే విషయాలతో ఈ క్లైమాక్స్ మాత్రం దద్దరిల్లిపోతుంది.

Advertisement

Read Also : పగ తీర్చుకోవడానికి 10 ఏళ్ల నిరీక్షణ… పక్కా మాస్ రివెంజ్ స్టోరీ… ఐయండిబిలో 8.2 రేటింగ్

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×