E-Paper
Advertisement

Biographical Thriller OTT: అణుబాంబుతో ఆటలాడిన మొనగాడి లైఫ్ స్టోరీ… ఏడు ఆస్కార్లు గెలిచిన అద్భుతం… ఐయండిబిలో 8.2 రేటింగ్

Biographical Thriller OTT: అణుబాంబుతో ఆటలాడిన మొనగాడి లైఫ్ స్టోరీ… ఏడు ఆస్కార్లు గెలిచిన అద్భుతం… ఐయండిబిలో  8.2 రేటింగ్
Advertisement

Biographical Thriller OTT : ఓటీటీలో ఒక బయోపిక్ థ్రిల్లర్ సినిమా టాప్ రేటింగ్ తో స్ట్రీమింగ్ అవుతోంది. రెండో ప్రపంచయుద్ధంలో హిట్లర్ వినాశనం గురించి అందరికీ తెలిసిందే. అయితే అంతకంటే వందరెట్లు మారణ హోమానికి నాంది అయ్యాడు ఒక వ్యక్తి. అతను మరెవరో కాదు, అణుబాంబు పితామహుడుగా పిలవబడే జె. రాబర్ట్ ఓపెన్‌హైమర్. ఈ సైంటిస్ట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఏడు ఆస్కార్లు కూడా గెలిచింది. ఐయండిబిలో 8.2 రేటింగ్ ఉన్న ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఏడు ఆస్కార్లు గెలిచిన సినిమా

‘ఓపెన్‌హైమర్’ (Oppenheimer) ప్రసిద్ధ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన ఒక అద్భుతమైన బయోపిక్ థ్రిల్లర్ సినిమా. 2023 లో వచ్చిన ఈ సినిమా, అణుబాంబు పితామహుడుగా పిలవబడే జె. రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా చేపట్టిన మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్, మొదటి అణుబాంబు తయారీలో ఓపెన్‌హైమర్ పాత్ర చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఇందులో కిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్ పాత్రలో), రాబర్ట్ డౌనీ జూనియర్ (లూయిస్ స్ట్రాస్), ఎమిలీ బ్లంట్ (కిట్టి ఓపెన్‌హైమర్) కీలక పాత్రలు పోషించారు. 2024 ఆస్కార్ అవార్డుల్లో ఈ సినిమా సంచలనం సృష్టించింది. మొత్తం 13 నామినేషన్లలో 7 ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. ప్రస్తుతం ఈ సినిమా prime video, jio hotstarలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

రెండో ప్రపంచ యుద్ధం టైమ్‌లో హిట్లర్ ఆరాచకాలు మామూలుగా ఉండేవి కావు. బాంబులు వేసి అందరినీ చంపేస్తున్నాడని తెలిసి, అమెరికా వాళ్లు కూడా వణికిపోయారు. ఇక జర్మనీ వాళ్ళు అణుబాంబు తయారు చేస్తున్నారని తెలిసి అమెరికా మరింత కంగారు పడింది. వాళ్ళకంటే ముందే మనం బాంబు కనిపెట్టాలని, సైంటిస్ట్ అయిన ఓపెన్‌హైమర్ కి ఆ బాధ్యత అప్పజెప్పారు. ఆయన ఒక పెద్ద టీమ్‌ని వేసుకుని, ఎడారిలో ఒక ఊరిని సెట్ చేసి, కొన్ని నెలలపాటు రేయింబవళ్లు కష్టపడి ఆఖరికి అణుబాంబును తయారు చేస్తాడు. ఆ బాంబుని టెస్ట్ చేసినప్పుడు వచ్చిన ఆ విస్ఫోటనం చూసి అందరూ షాక్ అయ్యారు కూడా. ఆ టైమ్‌లోనే ఆయనకి తాను ఒక భయంకరమైన మృత్యువుని సృష్టించానన్న ఫీలింగ్ కూడా కలిగింది.

ఆ బాంబుని జపాన్ మీద వేయడంతో యుద్ధం అయితే ఆగింది కానీ, లక్షల మంది చనిపోయారు. అది చూసి ఓపెన్‌హైమర్ మనసు వికలమైంది. ఇకపై ఇలాంటి ప్రమాదకరమైన ఆయుధాలు చేయొద్దని ఆయన గవర్నమెంట్‌తో చెప్పడం మొదలుపెట్టారు. ఇది అక్కడ ఉన్న కొంతమందికి, ముఖ్యంగా లూయిస్ స్ట్రాస్ అనే వ్యక్తికి అస్సలు నచ్చలేదు. దాంతో ఓపెన్‌హైమర్ ని ఎలాగైనా తొక్కేయాలని, ఆయన పవర్‌ని పీకేయాలని కుట్రలు మొదలయ్యాయి. ఆయన గతంలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళతో ఉన్న సంబంధాలను సాకుగా చూపి, ఆయన మీద దేశద్రోహి అనే ముద్ర వేయడానికి ట్రై చేశారు.

Advertisement

సినిమా చివరిలో ఒక కమిటీ ముందు ఓపెన్‌హైమర్ ను విపరీతంగా అవమానిస్తారు. ఆయన సెక్యూరిటీ క్లియరెన్స్ కూడా తీసేస్తారు. కానీ అసలు విలన్ లాంటి స్ట్రాస్ కుట్రలు కూడా బయటపడతాయి. ఓపెన్‌హైమర్ జీవితం చివరికి ఒక విషాదంగా మిగిలిపోతుంది. తాను కనిపెట్టిన బాంబు వల్ల ప్రపంచానికి శాంతి వస్తుందనుకుంటే, అది లోకాన్నే నాశనం చేసే ఒక భయంకరమైన దారిని చూపిందని ఆయన ఆవేదన చెందుతారు. అదే ఈ సినిమాలోని అసలు పాయింట్.

Read Also :  మాఫియా లీడర్ గా మారే గూఢచారి… వెంట పడే డిటెక్టివ్… కేక పెట్టిస్తున్న కొరియన్ థ్రిల్లర్

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×