E-Paper
Advertisement

Political Thriller OTT: మాఫియా లీడర్ గా మారే గూఢచారి… వెంట పడే డిటెక్టివ్… కేక పెట్టిస్తున్న కొరియన్ థ్రిల్లర్

Political Thriller OTT: మాఫియా లీడర్ గా మారే గూఢచారి… వెంట పడే డిటెక్టివ్… కేక పెట్టిస్తున్న కొరియన్ థ్రిల్లర్
Advertisement

Political Thriller OTT : ఓటీటీలో ఒక కొరియన్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సిరీస్‌లో కుతంత్రాలు, పవర్ గేమ్స్ చాలా పక్కాగా ఉన్నాయి. గత ఏడాది స్ట్రీమింగ్ వచ్చిన మొదటి వారంలోనే కొరియాలో మాత్రమే కాకుండా, ఆసియా దేశాల్లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. దీనికి వచ్చిన రెస్పాన్స్ చూసి, మేకర్స్ వెంటనే సీజన్ 2 కోసం ప్లాన్ చేయడం మొదలుపెట్టారు. ఒక స్మగ్లర్, ఒక ప్రాసిక్యూటర్ మధ్య జరిగే పోరాటమే ఈ సిరీస్. ఈ సిరీస్ పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్

ఈ క్రైమ్ పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘మేడ్ ఇన్ కొరియా’ (Made in Korea). ఇందులో ప్రముఖ కొరియన్ స్టార్లు హ్యున్ బిన్, జంగ్ వూ-సంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2025 డిసెంబర్ 24న జియో హాట్‌స్టార్‌లో విడుదలైంది. ఈ సిరీస్‌ను దాదాపు 480 కోట్ల రూపాయల (70 బిలియన్ కొరియన్ వాన్) భారీ బడ్జెట్‌తో నిర్మించారు. 1970ల నాటి సౌత్ కొరియా వాతావరణాన్ని, సెట్స్ వేసి చాలా రియలిస్టిక్‌గా చూపించారు. కొరియన్ సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు టాప్ హీరోలైన హ్యున్ బిన్, జంగ్ వూ-సంగ్ ఒకే స్క్రీన్‌పై కనిపించడం ఫ్యాన్స్‌కు పెద్ద పండగలా మారింది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు, డైలాగ్ వార్స్ ఈ సిరీస్‌కు మెయిన్ అసెట్ అని చెప్పొచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

1970ల కాలంలో అప్పట్లో కొరియాలో పరిస్థితులు చాలా గందరగోళంగా ఉండేవి. ఈ కథలో హీరో బాక్ కీ-ట్యాక్ (హ్యున్ బిన్) ఒక మామూలు మనిషిలా కనిపిస్తూనే, లోపల పెద్ద స్కెచ్‌లు వేస్తుంటాడు. అతను ఒకవైపు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏజెంట్‌గా ఉంటూనే, మరోవైపు దొంగచాటుగా డ్రగ్స్, ఇతర వస్తువులను దేశం దాటించే పెద్ద స్మగ్లర్ అవుతాడు. డబ్బు కోసం, పవర్ కోసం అతను చేసే అక్రమ ధందాలు ఊహించని రేంజ్‌లో ఉంటాయి. ఇక కథలోకి విలన్ లాంటి హీరో జాంగ్ కి-ట్యాక్ (జంగ్ వూ-సంగ్) ఎంట్రీ ఇస్తాడు. ఇతను ఒక కరుడుగట్టిన ప్రభుత్వ ప్రాసిక్యూటర్. తప్పు చేసినోడు ఎంతటి వాడైనా సరే, వాడిని లాగి పారేయాలనే రకం. స్మగ్లింగ్ ముఠాల వెనుక ఉన్న అసలు సూత్రధారి మన హీరోనే అని కనిపెట్టిన ఈ ప్రాసిక్యూటర్, అతన్ని పట్టుకోవడానికి వేట మొదలుపెడతాడు.

ఒకరు తప్పించుకోవాలని చూస్తుంటే, ఇంకొకరు నడిరోడ్డు మీద నిలబెట్టాలని ప్రయత్నిస్తుంటారు. వీరిద్దరి మధ్య జరిగే మైండ్ గేమ్స్, పంతాలు ఈ కథకు మెయిన్ హైలైట్. వీరిద్దరి గొడవ మధ్యలో కొరియా రాజకీయాలు, పోలీసుల కుతంత్రాలు కూడా తోడవుతాయి. పైకి స్నేహితుల్లా కనిపిస్తూనే ఒకరినొకరు వీళ్ళు ఎలా వెన్నుపోటు పొడుచుకుంటారు ? ప్రాణాలకు తెగించి ఒకరు ఒకరిపై ఎలా పైచేయి సాధిస్తారు ? అనేది క్లైమాక్స్‌లో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.

Advertisement

Read Also :  కసిగా నెత్తురు చిందించే సైకో పాప… క్షణ క్షణం ఉత్కంఠ… గుండె గట్టిగా ఉంటేనే చూడండి

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×