E-Paper
Advertisement

Romantic Movie OTT: మొగుడికి విడాకులు… వాడుకునే బాయ్ ఫ్రెండ్… కట్ చేస్తే మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్

Romantic Movie OTT: మొగుడికి విడాకులు… వాడుకునే బాయ్ ఫ్రెండ్… కట్ చేస్తే మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్
Advertisement

Romantic Movie OTT : హాలీవుడ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడి నుంచి వచ్చే రొమాంటిక్ సినిమాలకు డై హార్ట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా చూస్తే నిజమేనని అనిపిస్తుంది. సినిమా స్టోరీ అలా ఉంటుంది మరి ఇందులో. ఈ సినిమా కథ హెలెన్ అనే విడాకులు తీసుకున్న ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ చుట్టూ తిరుగుతుంది. ఆమె పారిస్‌లో ఒక మనిషి మీద విపరీతమైన మొహం పెంచుకున్నాక అసలు కథ ఉంటుంది. ఒక స్త్రీ వ్యామోహంతో ఎలా మారుతుందో, ఈ సినిమాలో డైరెక్టర్ డానియల్ అర్బిడ్ చాలా పచ్చిగా చూపించారు.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ ఫ్రెంచ్ రొమాంటిక్ మూవీ పేరు ‘సింపుల్ ప్యాషన్’ (Simple Passion). ఈ సినిమాను ఆనీ ఎర్నాక్స్ అనే రచయిత్రి తన జీవితంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా రాసిన నవల నుండి తీశారు. ఆమెకు 2022లో నోబెల్ బహుమతి కూడా వచ్చింది. హీరోయిన్‌గా చేసిన లెటిటియా డోష్ తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక హీరోగా నటించిన సెర్గీ పోలునిన్ నిజానికి ఒక ఫేమస్ బ్యాలెట్ డ్యాన్సర్. అందుకే సినిమాలో అతను చాలా ఫిట్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియో, ఆపిల్ టివి లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

హెలెన్ ఒక యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా ఉంటుంది. అయితే భర్తతో ఆమె విడాకులు తీసుకుని, తన కొడుకుతో ఒంటరిగా ఉంటుంది. ఆమె లైఫ్ మామూలుగా సాగిపోతున్న టైంలో, అలెగ్జాండర్ అనే ఒక రష్యన్ యువకుడు పరిచయం అవుతాడు. అతను చూడటానికి భలే అందంగా, స్టైలిష్‌గా ఉంటాడు. అతను కూడా పెద్ద ఆఫీసర్ హోదాలో ఉంటాడు. అయితే అతనికి ఆల్రెడీ పెళ్లయిందని తెలిసినా.. హెలెన్ అలెగ్జాండర్ మాయలో పడిపోతుంది. ఇద్దరి మధ్య ఒక రేంజ్‌లో రొమాన్స్, అఫైర్ మొదలవుతుంది. మెల్లగా హెలెన్‌కు అతనంటే ఒక అడిక్షన్ లాగా అయిపోతుంది.

అయితే అతను ఎప్పుడు ఫోన్ చేస్తాడా, ఎప్పుడు వచ్చి తన కోరిక తీరుస్తాడా అని పిచ్చిగా ఎదురుచూస్తుంటుంది. అతను మాత్రం అవసరం ఉన్నప్పుడే వచ్చి వెళ్తుంటాడు. ఆఖరికి తన కొడుకును, తన ఉద్యోగాన్ని కూడా పట్టించుకోకుండా.. రోజంతా అతని గురించే ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకుంటుంది. అతను పిలిస్తే చాలు, అర్ధరాత్రి అయినా సరే అన్ని పనులు వదిలేసి అతను దగ్గరికి పరిగెడుతుంది. ఇక చివరికి ఆ అలెగ్జాండర్ సడన్‌గా రష్యాకు తిరిగి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయాక హెలెన్ పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. తిండి తిప్పలు మానేసి, అతని జ్ఞాపకాల్లోనే బతుకుతుంటుంది. చివరికి ఈ పిచ్చి నుంచి హెలెన్ బయటపడుతుందా ? ఈ మాయలోనే జీవితం నాశనం చేసుకుంటుందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  రైలు పట్టాలు ఎక్కే మృత్యువు… హైజాకర్ల హైటెక్ విధ్వంసం… ఓటీటీలో ఉత్కంఠ రేపుతున్న సిరీస్

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×