E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: తృటిలో తప్పించుకున్న శ్రీవల్లి.. నగల గుట్టు విప్పేందుకు నర్మద ప్లాన్.. అసలు ట్విస్ట్ ఇదే..

Illu Illalu Pillalu Today Episode: తృటిలో తప్పించుకున్న శ్రీవల్లి.. నగల గుట్టు విప్పేందుకు నర్మద ప్లాన్.. అసలు ట్విస్ట్ ఇదే..
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 30th: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి నగల మేటర్ బయట పడగానే తన తప్పేమీ లేదు అని అనుకోవాలని టెన్షన్ పడుతూ ఉంటుంది.. ప్రేమ నగలన్నీ మార్చేసి అసలు నగల్ని నేను అక్కడ పెట్టాను. అయితే ఇప్పుడు అదే నా కొంప ముంచేలా ఉంది అని శ్రీవల్లి అనుకుంటుంది. ఈ నగలు నా దగ్గర ఉన్నాయని తెలిస్తే ఇక అంతే నన్ను శాశ్వతంగా ఇంట్లో నుంచి గెంటేస్తారు అని శ్రీవల్లి భయపడుతూ ఉంటుంది..  నగల గురించి ఐడియా ఇచ్చింది మా అమ్మే ముందు మా అమ్మని చంపి పడేయాలి అనేసి శ్రీవల్లి కోపంగా ఉంటుంది..

ఆనంద రావు 10 లక్షలు 20 లక్షలు చేసే తీసుకొస్తాడని భాగ్యం చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటుంది. మా ఆయన చాలా గొప్పగా 20 లక్షలు తెస్తాను వెళ్ళాడు. ఇంకా రాలేదు ఏంటబ్బా అని ఎదురు చూస్తూ ఉంటుంది.. భాగ్యం డబ్బులెక్కడండి 20 లక్షలు తెస్తాను అన్నారు కదా ఒట్టి చేతులతో వచ్చారు ఏంటి అని అంటుంది. 10 లక్షలు కూడా ఆనందారావు పోగొట్టాడని కోపంతో కొట్టేస్తుంది. అప్పుడే ఫోన్ చేసిన శ్రీవల్లి ఫోన్ చేస్తుంది. మ్యాటర్ చెప్తుంది.. ఆ భాగ్యం నగలను దాచి పెట్టమని చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రేమ నర్మదా ఇద్దరు కూడా శ్రీవల్లి కోసం ఇల్లంతా వెతుకుతారు.. శ్రీవల్లి నగలను పాతి పెట్టేసి దేవుడికి పూజ చేస్తున్నట్లు నటిస్తుంది.. నర్మద ప్రేమలని చూసి షాక్ అయిన శ్రీవల్లి దేవుడా ఇంట్లో పోయిన నగలు వెంటనే దొరకాలి అంటూ దొంగగా దండం పెట్టుకుంటుంది.. అది చూసిన ప్రేమ నీ నాటకాలు ఇక ఆపు.. ఆ నగలని కొట్టేసింది నువ్వే అని మాకు తెలుసు. నగలు ఎక్కడ పెట్టావో చెప్పు అనేసి శ్రీవల్లిని అడుగుతారు. ఇంత అమాయకురాలని పట్టుకొని మీరు ఇలా మాట్లాడతారు ఏంటి అని శ్రీవల్లి అంటుంది. నాటకాలు ఆపి అసలు ఆ నగలు ఎక్కడ పెట్టావో చెప్పు అని ప్రేమ నర్మద ఇద్దరు అడుగుతారు.. నాకేం తెలుసు మీరే వెతుక్కోండి అనేసి అంటుంది..

నువ్వే తీసావని నాకు అర్థం అయిపోతుంది. మరి నువ్వు నా నగలను ఇచ్చినప్పుడు తిరుపతి బాబాయిని నగలు ఇచ్చావా వాళ్ళు చూసుకున్నారని పదే పదే గుచ్చి గుచ్చి ఎందుకు అడిగావు అని ప్రేమ అంటుంది. నా బాధ్యత కాబట్టే నేను అడిగాను. రేపు మీ ఇంటి వాళ్ళు నగల విషయంలో గొడవలకు దిగకుండా ఉండేందుకే అన్నిసార్లు అడిగాను అని శ్రీవల్లి అంటుంది. కానీ ప్రేమ నర్మద మాత్రం శ్రీవల్లి చెప్పేది పొంతన లేని సమాధానమని అనుకుంటారు. శ్రీవల్లి ప్రవర్తన చూస్తే ఇంకాస్త అనుమానం పెరుగుతుంది. దాంతో కచ్చితంగా శ్రీవల్లిని తీసింది అని ఆ ఇద్దరు కన్ఫర్మ్ చేసుకుంటారు. శ్రీవల్లి మాత్రం అక్కడి నుంచి మెల్లగా జారుకుని తన రూమ్ లోకి వెళుతుంది.

Advertisement

అమ్మ నువ్వు చెప్పిన ప్లాన్ వర్క్ అవుట్ అయిందే.. ఆ నగలను నేను మా ఇంటి వెనకాల చెట్టు దగ్గర దాచి పెట్టాను అని అంటుంది. ఇప్పుడు ఆ నగలను కనిపెట్టడం ఆ దేవుడి వల్ల కూడా కాదు అనేసి శ్రీవల్లి అంటుంది. నువ్వు చెప్పినట్లే జరుగుతుంది అమ్మ ఏది ఏమైనా సరే నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అనేసి శ్రీవల్లి అంటుంది. ఇక ప్రేమ నర్మదా ఏంటి అక్క ఇలా జరిగింది ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. దాని ప్రకారం చేస్తే ఖచ్చితంగా ఇంట్లోంచి బయటికి వస్తుంది అనేసి అంటుంది. ఏంటక్కా అది అని నర్మదను ప్రేమ అడుగుతుంది.. కాసేపు ఆగు చూసే ముందర ఎందుకంత తొందర పడతావు అనేసి నర్మద అంటుంది.

బయట ఆటోలో జబర్దస్త్ ప్రసాద్ వస్తాడు. నేను చెప్పిన ఆ వ్యక్తి ఇతనే. ఇప్పుడు ఆ వల్లి చేతనే నగలను బయట పెట్టించేలా చేస్తాడు అనేసి నర్మదా అంటుంది. అతని ఇంట్లోకి తీసుకొని వెళుతూ ఉంటారు అప్పుడే వేదవతి వచ్చి ఎవరు ఇతను అచ్చం దొంగ లాగా ఉన్నాడు. నేను మీకు బుద్ధుందా డైరెక్టుగా ఇంట్లోకి తీసుకెళ్తారా ఎవరైనా అనేసి అడుగుతుంది. ఇంట్లో నగలు పోయాయి కదా అత్తయ్య ఆ నగలని బయట పెట్టించేందుకు ఈయన తీసుకొని వచ్చాము. సాయంత్రం లోపల నగలు బయటకు వచ్చేస్తాయి చూడండి అనేసి నర్మద అంటుంది.

Also Read :ఎన్నో ట్విస్ట్ లతో శ్రీవాణి పెళ్లి.. ఆస్తులు కోసం ఇప్పటికీ గొడవలు..నరకం..

రాంప్రసాద్ ఇంట్లో పూజ పెట్టగానే అతని ఇంటి అలా పూజ చేస్తున్నాడు అనేసి వేదవతి అంటుంది. నగలనే బయటకు తీసుకొచ్చేందుకు ఈ పూజ చేస్తున్నారు ఆగండి మీకే తెలుస్తుంది అనేసి నర్మద అంటుంది. రాంప్రసాద్ అక్కడికి రాగానే వింత వింతగా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అతని మాటలు విన్న శ్రీవల్లి ఇంట్లోకి ఎవరో వచ్చారు అమ్మ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అనేసి ఫోన్ పెట్టేస్తుంది. శ్రీవల్లి అక్కడికి వచ్చి ఎవరితను.. బయట వేరు మొక్కలు అమ్మేలా ఉన్నాడు అనేసి అంటుంది. అతను నగలు ఇంట్లో పోయాయి కదా వాటికోసమే ఈయన వచ్చాడు.. ఈయన చేసే పూజకి దొంగ ఎక్కడున్నా సరే బయటపడపోతారు అనేసి నర్మద అనగానే శ్రీవల్లి ముఖంలో రంగులు మారతాయి. కొంపతీసి అతను నా గురించి బయట పెడతారా ఏంటి అని టెన్షన్ పడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

Big Stories

Advertisement
×