E-Paper
Advertisement

ప్రతి ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్‌… సైకాలజీతో నేరగాళ్లకు చుక్కలు చూపించే ఇన్వెస్టిగేటర్… ఐయండిబిలో 8.2 రేటింగ్

ప్రతి ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్‌… సైకాలజీతో నేరగాళ్లకు చుక్కలు చూపించే  ఇన్వెస్టిగేటర్… ఐయండిబిలో 8.2 రేటింగ్
Advertisement

Police Procedural Crime Series OTT : ఓటీటీలో ఏడు సీజన్లతో ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టాప్ రేటింగ్ ను సంపాదించింది. ఇది మామూలు పోలీస్ స్టోరీలాగా కాకుండా, ఇందులో మనిషి సైకాలజీని ఉపయోగించి కేసులను ఎలా ఛేదిస్తారో చాలా తెలివిగా చూపిస్తారు. ప్రతి సీజన్ లో ఒక కొత్త మర్డర్ మిస్టరీ ఉంటుంది. మామూలు హత్యలే కాకుండా.. హై-ప్రొఫైల్ కిడ్నాపులు, పెద్ద పెద్ద కార్పొరేట్ స్కాములు, గ్యాంగ్‌స్టర్లకు సంబంధించిన కేసులను హీరో పరిష్కరిస్తుంటాడు. ఇది కేవలం నేరాలను పట్టుకోవడమే కాకుండా, హీరో తన కుటుంబాన్ని చంపిన సీరియల్ కిల్లర్ కోసం చేసే రివెంజ్ డ్రామా కూడా. ఐయండిబిలో దీనికి 8.2 రేటింగ్ ఉందంటే ఇది ప్రేక్షకులను ఎంతగా మెప్పించిందో తెలిసిపోతుంది. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ సూపర్ హిట్ అమెరికన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ పేరు ‘ది మెంటలిస్ట్’ (The Mentalist). ఇందులో సైమన్ బేకర్ (ప్యాట్రిక్ జేన్), రాబిన్ ట్యూనీ (టెరిసా లిస్బన్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2008 నుండి 2015 వరకు మొత్తం 7 సీజన్ల పాటు సాగింది. ఈ సిరీస్‌లో ప్యాట్రిక్ జేన్ పాత్ర ఎంత పాపులర్ అంటే, ఆ పాత్రలో నటించిన సైమన్ బేకర్ రాత్రికి రాత్రే అంతర్జాతీయ స్టార్ అయిపోయారు. ఆయన నటనకు గానూ ప్రెస్టీజియస్ ఎమ్మీ, గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేషన్లు దక్కాయి. విశేషమేమిటంటే, ఈ షోలో జేన్ వాడే పాతకాలపు సిట్రోయెన్ కారును సైమన్ బేకర్ స్వయంగా ఎంచుకున్నారు. ఈ సిరీస్ ప్రస్తుతం Prime Video, నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ప్యాట్రిక్ జేన్ ఒకప్పుడు పెద్ద ‘సైకిక్’ అని పేరు తెచ్చుకుంటాడు. అతను మనుషుల మైండ్‌ని చదివేసి వాళ్ళ మనసులో ఏముందో ఇట్టే కనిపెట్టేస్తాడు. మొదట్లో అతను ఈ తెలివిని వాడుకుని, నాకు శక్తులు ఉన్నాయి, నేను ఆత్మలతో మాట్లాడతా అని జనాల్ని నమ్మించి బాగా సంపాదిస్తుంటాడు. అయితే ఒక ఇంటర్వ్యూలో ఇతను ‘రెడ్ జాన్’ అనే సీరియల్ కిల్లర్‌ను తక్కువ చేసి మాట్లాడతాడు. దానికి ప్రతీకారంగా ఆ కిల్లర్, జేన్ భార్యాపిడ్డలను చంపేస్తాడు. ఆ సంఘటనతో జేన్ కుమిలిపోయి, ఎలాగైనా ఆ కిల్లర్‌ను పట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు.

జేన్ తన అద్భుతమైన తెలివితేటలను ఉపయోగించి సీబీఐ పోలీసులకు కన్సల్టెంట్‌గా చేరతాడు. అక్కడ ఏజెంట్ టెరిసా లిస్బన్ టీమ్‌తో కలిసి పని చేస్తూ, ఎవరూ ఛేదించలేని మర్డర్ కేసులను తనదైన శైలిలో పరిష్కరిస్తుంటాడు. నేరస్థులను మాటలతోనే బురిడీ కొట్టించి నిజాలు రాబట్టడంలో జేన్ దిట్ట. కేసులన్నీ ఒకవైపు పరిష్కరిస్తూనే, తన అసలు లక్ష్యమైన రెడ్ జాన్ ఆచూకీ కోసం జేన్ నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాడు. రెడ్ జాన్ కూడా చాలా తెలివైనవాడు. వీరిద్దరి మధ్య సాగే ఎత్తులు-పైఎత్తులు, చివరికి జేన్ ఆ కిల్లర్‌ను ఎలా కనిపెట్టి తన పగ తీర్చుకున్నాడనేదే ఈ సిరీస్ క్లైమాక్స్.

Advertisement

Read Also : 40 ఏళ్ళ బ్యాచిలర్… 35 సార్లు రిజెక్షన్… ఇకనైనా పెళ్ళవుతుందా? నలభైలో మొదలైన నయా లవ్ స్టోరీ

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×