E-Paper
Advertisement

Body Horror Thriller OTT : బతికుండగానే బాడీని ముక్కలు ముక్కలు చేసే వైరస్… గూస్ బంప్స్ పక్కా

Body Horror Thriller OTT : బతికుండగానే బాడీని ముక్కలు ముక్కలు చేసే వైరస్… గూస్ బంప్స్ పక్కా
Advertisement

Body Horror Thriller OTT : ఓటీటీలో సైన్స్ ఫిక్షన్ హారర్ సినిమాలు చాలానే ఉన్నాయి. ఆయితే రియల్ స్టోరీ ఆధారంగా ఒక మూవీ తెరకెక్కి ఆడియన్స్ ని బాగానే భయపెట్టింది. ప్రపంచంలోనే అత్యంత లోతైన సొరంగం అయిన ‘కోలా సూపర్ డీప్ బోర్ హోల్’ నిజంగానే రష్యాలో ఉంది. దీని చుట్టూ ఉన్న అనేక మిస్టరీలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తీయడం జరిగింది. సొరంగంలోకి వెళ్ళిన మనుషుల శరీరాలు వంకర్లు తిరుగుతూ ముక్కలవుతుంటాయి. ఈ సీన్స్ చూడటానికి కాస్త భయంకరంగా ఉంటాయి. ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘ది సూపర్ డీప్’ (The Superdeep) 2020లో విడుదలైన ఒక రష్యన్ సైన్స్ ఫిక్షన్ హారర్ చిత్రం. అర్సెనీ స్యుహిన్ దీనికి దర్శకత్వం వహించారు. ఇది రష్యాలోని నిజమైన ‘కోలా సూపర్ డీప్ బోర్ హోల్’ నేపథ్యంగా రూపొందింది. మిలెనా రాడులోవిక్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. shudder, prime videoలలో ఈ మూవీ అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : కంటికి కనిపించని అడ్డుగోడతో అడ్డంగా బుక్కయ్యే ఒంటరి అమ్మాయి… కట్ చేస్తే దిమాక్ ఖరాబ్ ట్విస్ట్

స్టోరీలోకి వెళ్తే

1980 నాటి కాలంలో సైంటిస్ట్స్ భూమి లోపల 12 కిలోమీటర్లు డ్రిల్ చేస్తుంటారు. కానీ సడన్‌గా ఒక భారీ శబ్దం, గ్యాస్ ఎమిషన్ వస్తాయి. టీమ్‌లో చాలా మంది మరణిస్తారు. బయటికి వచ్చినవాళ్లు భయంకరమైన ఇన్‌ఫెక్షన్‌తో ఉంటారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం మళ్ళీ రీ-ఓపెన్ చేస్తుంది. దీనిని పరిశోధించడానికి అన్నా ఫెడోరోవా అనే ఎపిడెమియాలజిస్ట్ ఒక సైనిక బృందంతో కలిసి వెళుతుంది. భూమికి 12 కిలోమీటర్ల లోతుకు వెళ్ళిన తర్వాత, అక్కడ ఒక భయంకరమైన ఫంగస్ వల్ల మనుషులు వింత ఆకృతులుగా మారిపోతున్నారని వాళ్ళు గుర్తిస్తారు.

Advertisement

అక్కడ ఒక అసాధారణ ప్రాచీన దుష్ట శక్తి లాంటిది ఉన్నట్లు తెలుస్తుంది. క్రమంగా వీళ్ళ టీమ్‌లో మెంబర్స్ ఒక్కొక్కరుగా అదృశ్యమవుతారు. ఇన్‌ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. లోపల ఉన్న అదృశ్య శక్తి మనుషుల మైండ్స్‌ను కంట్రోల్ చేసి, హారిబుల్ హాలుసినేషన్స్ చూపిస్తుంది. బోర్‌హోల్ లోపల ఏదో ప్రాచీన ఎవిల్ ఉందని తెలిశాక మిగిలిన వాళ్ళు ప్రాణాలతో బయట పడటానికి ప్రయత్నిస్తారు. మరి అక్కడికి వెళ్ళిన వాళ్ళల్లో ఎవరైనా ప్రాణాలతో బయట పడతారా ? ఇంతకీ ఆ సొరంగం లోపల ఏముంది ? అనే విషయాలను మాత్రం ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×