E-Paper
Advertisement

Pink Number Plates: ఫ్రాన్స్ లో కొత్తగా పింక్ నెంబర్ ప్లేట్లు, ఎందుకో తెలుసా?

Pink Number Plates: ఫ్రాన్స్ లో కొత్తగా పింక్ నెంబర్ ప్లేట్లు, ఎందుకో తెలుసా?
Advertisement

France Launches Pink Number Plates: ఫ్రాన్స్ లో వాహనాలకు సాధారణంగా వైట్ నెంబర్ ప్లేట్లు ఉంటాయి. జనవరి 1, 2026 నుండి సరికొత్త పింక్ రిజిస్ట్రేషన్ ప్లేట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. పింక్ ప్లేట్లు గతంలోని ‘WW’,  ‘W గ్యారేజ్’  ప్లేట్ల స్థానంలో తీసుకొచ్చారు. ఇవి బ్రిటన్‌ లోని ట్రేడ్ ప్లేట్లకు సమానమైన ఫ్రెంచ్ ప్లేట్లు. వీటిని ప్రధానంగా ప్రీ రిజిస్టర్డ్ వాహనాలపై కార్ డీలర్లు, టెస్ట్ డ్రైవ్ కోసం ఉపయోగిస్తారు. UKలో, ఈ ప్లేట్లలో తెల్లటి బ్యాగ్రౌండ్, రెడ్ బార్డర్, రెడ్ నెంబర్స్ ఉంటాయి.

వాస్తవానికి ఫ్రాన్స్‌ లో, టెంపరరీ రిజిస్ట్రేషన్లు సాంప్రదాయ వైట్ నంబర్ ప్లేట్ల మాదిరిగానే ఉండేవి. కానీ ‘WW’ మార్కింగ్‌ తో, ట్రాఫిక్‌ లో పోలీసులు గుర్తించడం కష్టతరంగా మారింది. ఈ సమస్య నుంచి పరిష్కారం పొందేందుకు కొత్త నంబర్ ప్లేట్స్ ను ఫ్రాన్స్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఫ్రాన్స్‌ లో సంవత్సరానికి దాదాపు 400,000 వాహనాలు ఈ తాత్కాలిక ప్లేట్లను ఉపయోగిస్తాయి. కానీ, చాలా వరకు అవి మోసపూరిత ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతున్నట్లు అధికారులు గుర్తించారు. చాలా మంది ఫ్రెంచ్ డ్రైవర్లు ‘WW’ ట్రేడ్ ప్లేట్‌లను నెలల తరబడి, ఇంకా చెప్పాలంటే సంవత్సరాలుగా మోటారు నేరాలకు శిక్ష నుంచి తప్పించుకునేందుక వాటిని వాడుతున్నారు.  ఇక ఈ ప్లేట్లను పింక్ రంగులోకి మార్చడం ద్వారా, ఫ్రెంచ్ పోలీసులు ట్రాఫిక్‌లో గుర్తించడం, రిజిస్ట్రేషన్ల చెల్లుబాటుపై తనిఖీలు నిర్వహించడం సులభతరం అవుతుందని అధికారులు చెబుతున్నారు.

జనవరి 1 నుంచి అందుబాటులోకి కొత్త ప్లేట్స్

Advertisement

జనవరి 1న ప్రవేశపెట్టబడిన కొత్త డిజైన్ టెంపరరీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు వెంటనే గుర్తించే అవకాశం కల్పిస్తుంది. పాత WW ప్లేట్లను నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగించడం రోజు రోజుకు పెరుగుతోందని అధికారులు వెల్లడించారు. ఇప్పుడు పింక్ నెంబర్ ప్లేట్లు తీసుకురావడం వల్ల  ట్రాఫిక్‌లో తాత్కాలిక రిజిస్ట్రేషన్ కింద ఉన్న వాహనాలనుగుర్తించడం ఈజీ అవుతుందన్నారు. అదే సమయంలో నేరాలను నియంత్రించడం సాధ్యమవుతుంది.

నాలుగు నెలల వరకు చెల్లుబాటు

ఫ్రాన్స్ లో తాత్కాలిక రిజిస్ట్రేషన్లు నాలుగు నెలల వరకు మాత్రమే చెల్లుతాయి. పొడిగించబడవు. అయితే, ఫ్రెంచ్ అధికారులు ఇటీవలి సంవత్సరాలలో టెంపరరీ నెంబర్ ప్లేట్స్ దుర్వినియోగం పెరుగుతున్నట్లు గుర్తించారు. డ్రైవర్లు ఈ తాత్కాలిక ప్లేట్‌లను గడువు ముగిసిన తర్వాత సంవత్సరాల తరబడి ఉపయోగిస్తున్నట్లు వెల్లడయ్యింది. అలా చేయడం వల్ల ట్రాఫిక్ ఉల్లంఘనలకు విధించే జరిమానాలను తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. వాటిలో కొన్ని పరిమితికి మించిన వేగంతో ప్రయాణించిన వాహనాలు కూడా ఉన్నట్లు వెల్లడించారు. ఫ్రెంచ్ ప్రభుత్వం అతి వేగంగా నడుపుతున్న డ్రైవర్లకు కఠినమైన శిక్షలను ప్రవేశపెట్టిన కొద్ది రోజులకే కొత్త ప్లేట్‌లను ప్రారంభించింది. డిసెంబర్ 29 నుంచి వేగ పరిమితిని మించి (50 కిలో మీటర్లకు) వేగంతో ప్రయాణించినట్లు తేలిన వాహనదారులకు జరిమానా విధిస్తారు. కొన్నిసార్లు డ్రైవర్లకు జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. ఫ్రాన్స్‌ లో డ్రైవింగ్ చేయకుండా మూడు సంవత్సరాల నిషేధం కూడా విధించే అవకాశం ఉంటుంది.

Advertisement

Read Also: ఎలక్ట్రిక్ మెర్సిడెస్ బెంజ్ కు అరుదైన గుర్తింపు.. యూరోపియన్ కార్ ఆఫ్ ది ఇయర్ గా..

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×